Bigg Boss Wild Card: బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్‌ల ఎంట్రీ ఉండనుంది. దీంతో, బిగ్ బాస్ ఆట రణరంగంగా మారనుంది. అయితే, అయితే ఈ సీజన్‌లో ఐదోవారం నుంచి హౌస్‌లోకి మరికొంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టబోతున్నారు. ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఒకేసారి హౌస్‌లోకి వెళ్లబోతుండగా.. ఆట మరింత రసవత్తరంగా మారబోతుంది. అలేఖ్య చిట్టిపికెల్స్ రమ్య, దివ్వెల మాధురి, నటి అయేషా జీనత్, నటుడు గౌరవ్ గుప్తా, యాక్టర్ శ్రీనివాస సాయి, సీరియల్ హీరో నిఖిల్ నాయర్.. ఈ ఆరుగురు హౌస్ లోకి వెళ్లనున్నారు. ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టంట్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
అయేషా జీనత్
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా వెళ్లబోతున్న వాళ్లలో అయేషా జీనత్ ఉంది. ఈమె మోస్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈమె బ్యాగ్రౌండ్ అలాంటిది మరి. ఈమె ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ అనే సీరియల్‌తో పాపులర్ అయ్యింది. ఆ తరువాత కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ రెండో సీజన్ కంటెస్టెంట్. అంతకు ముందు తమిళ సీరియల్స్‌తో పాటు.. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ కూడా. దాదాపు 9 వారాలు పాటు హౌస్‌లో ఉంది. బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ బిందు మాధవిలాగే ఈమె చాలా ఫైరింగ్ కంటెస్టెంట్. తమిళ బిగ్ బాస్‌లో వివాదాస్పద కంటెస్టెంట్‌గా నిలిచింది. వాదనలు కూడా బలంగా వినిపించిన ట్రాక్ రికార్డ్ ఉంది. ఐదువారాల ఆట చూసి వచ్చింది.. పైగా బిగ్ బాస్ ఎక్స్‌పీరియన్స్ ఉండటంతో ఈమె వైల్డ్ కంటెస్టెంట్‌గా వెళ్లి వైల్డ్ ఫైర్ చూపించే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. పైగా ఈమె గ్లామర్ బ్యూటీ కూడా కావడంతో.. అసలే హౌస్‌లో ఢమాల్ వవన్, కళ్యాణ్ పడాల లాంటి కక్కుర్తి గాళ్లు ఉన్నారు కాబట్టి.. బిగ్ బాస్‌కి కావాల్సినంత కంటెంట్ రావొచ్చు ఈమె వైల్డ్ కార్డ్‌గా అడుగుపెడితే.
కండల వీరుడు
గౌరభ్ గుప్త.. ఈ కండల వీరుడు ప్రస్తుతం గీత LLB సీరియల్‌లో నటిస్తున్నాడు. సిక్స్ ప్యాక్‌తో మంచి ఫిజిక్‌తో ఉన్న ఇతను హౌస్‌లోకి వెళ్తే ఫిజికల్ టాస్క్‌లే కాదు.. అక్కడ జరిగే పత్తేపారాలలోనూ భాగం కావచ్చు. ఎందుకంటే హౌస్‌లో కక్కుర్తిగాళ్లే కాదు.. హగ్ కోసం అల్లాడిపోయే రీతూ చౌదరి లాంటి సొల్లు బ్యాచ్‌లు కూడా ఉన్నాయి. గౌరభ్ గుప్తని ఇందుకే సెలెక్ట్ చేసి ఉండొచ్చు. శ్రీనివాస సాయి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లలో నటించి.. ‘గోల్కొండ హైస్కూల్’ సినిమాతో పాపులర్ అయ్యాడు. ఆ తరువాత శుభలేఖలు, వినరా సోదర వీరకుమారా వంటి సినిమాల్లో నటించి వెండితెర నుంచి మాయమయ్యాడు. ఇదిగో ఎప్పుడు బిగ్ బాస్ వాళ్లు వలేసి మరీ పట్టుకొస్తున్నారు. కుర్రాడు మంచి దిట్టంగానే ఉన్నాడు కాబట్టి.. హౌస్‌లోకి వెళ్లాక ట్రాక్‌లు పడొచ్చు.
Read Also: Bigg Boss Promo 2 Today: ఓయబ్బో.. కర్మ సిద్ధాంతం గురించి గుడ్లు దొంగతనం చేసిన సంజనే మాట్లాడాలా?
పలుకే బంగారమాయెనా హీరో..
నిఖిల్ నాయర్ గురించి తెలియనవారెవరూ లేరు. గృహలక్ష్మి సీరియల్‌లో తులసి చిన్న కొడుకు ప్రేమ్‌గా మెప్పించిన నిఖిల్ నాయర్.. పలుకే బంగారమాయెనా సీరియల్ హీరోగా నటించారు. ‘దిల్ సే’ వంటి వెబ్ సిరీస్‌లలో నటించాడు. ఇతని ఫిజిక్ చూస్తే.. రీతూ చౌదరి ఆ ఢమాల్ పవన్ పక్కనెట్టి ఉరుక్కుంటూ వచ్చి ఇతని దగ్గర వాలిపోయేట్టుగానే ఉన్నాడు. బిగ్ బాస్‌కి వెళ్లడం కోసమేనేమో కానీ.. సిక్స్ ప్యాక్స్‌తో సిద్దం అయ్యాడు. ఆ చేత్తో ఢమాల్ పవన్‌ని ఈ చేత్తో కళ్యాణ్ పడాలని విసిరేట్టుగానే కనిపిస్తున్నాడు. ఇతని ఎంట్రీతో హౌస్ మరింత కలర్ ఫుల్ గా మారనుంది. ఇతను ఫిజికల్ టాస్క్‌లలో తలపడితే.. అడ్డుకోవడం కష్టమే. అప్పట్లో ప్రిన్స్ యావర్ ఎలాగైతే స్ట్రాంగ్‌గా కనిపించాడో.. ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్స్‌లో నిఖిల్ నాయర్ అంతే స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాడు. ఇతనికి మంచి సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు. మనోడి కటౌట్‌కి తగ్గట్టుగా క్యారెక్టర్‌ని కాపాడుకుంటే.. ఖచ్చితంగా బలమైన కంటెస్టెంట్ అవ్వొచ్చు. మొత్తంగా వీళ్లు బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా కన్ఫామ్ అయినట్టు తెలుస్తుంది.


