Bigg Boss Wildcard Updates: బిగ్‌బాస్ 2.0 పేరుతో ఆదివారం నాటి ఎపిసోడ్‌లో వైల్డ్‌కార్డ్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు ఈరోజు ఎపిసోడ్‌లో వైల్డ్‌కార్డ్స్‌గా రానున్నారు. ఇప్పటికే వీళ్ల పేర్లు, వివరాలు అన్నీ సోషల్ మీడియాలో లీకైపోయాయి. అయితే, అందరి చూపు దివ్వెల మాధురి కేరాఫ్ దువ్వాడ శ్రీనివాస్ మీదే ఉన్నాయి. వాళ్ల మీద ట్రోల్స్ ఇంతా అంతా కాదు. అందుకే ఆమె కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందులోనూ ఆమె నృత్య ప్రదర్శన, ఇంటర్వ్యూలు ఇలా అన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అలాంటి క్యాండేట్ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా రాబోతుండటంతో ఇటు ఆడియన్స్‌తో పాటు అటు పొలిటికల్ సర్కిల్‌లో కూడా హాట్ టాపిక్ కానుంది. ఇక ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేస్తూ దువ్వాడ శ్రీనివాస్ ఓ వీడియోని రిలీజ్ చేశారు.
Read Also: Bigg Boss Elimination: బిగ్ బాస్ లో డబుల్ ఎలిమినేషన్.. మరో ఘోరం వైల్డ్ కార్డుల చేతిలో శ్రీజకు దెబ్బ
దువ్వాడ ప్రమోషన్స్..
అందరికీ నమస్కారం అండి.. మీ అందరికీ ఒక శుభవార్త.. ఇప్పటివరకూ బిగ్‌బాస్ ఒక లెక్క.. ఈరోజు నుంచి బిగ్‌బాస మరో లెక్క.. మీరందరూ చూడబోతున్నారు బిగ్‌బాస్ 2.0.. ఎవరో తెలుశా.. తాను ఎవరికి ఎదురొచ్చినా వారికే ప్రమాదం.. వారు తనకి ఎదురొచ్చినా వారికే ప్రమాదం.. మరి ఆదివారం సాయంత్రం 9 గంటలకి చూసేద్దామా.. కమాన్.. అంటూ ఎగ్జైట్ మెంట్ తో చెప్పుకొచ్చారు దువ్వాడ. మాధురి హౌస్‌లోకి వెళ్తున్నారంటే ప్రమోషన్స్ సంగతి ఇక దువ్వాడ చూసుకోవాల్సిందే. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే శ్రీనివాస్ చేసిన ఈ వీడియో కింద నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మీరు కూడా కలిసి వెళ్లాల్సింది, వారంలోనే ఇంటికి పంపించేస్తాం, ఓరి వీళ్ల ఏషాలో అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
దివ్వెలతో పాటు..
మరోవైపు దివ్వెల మాధురితో పాటు సీరియల్ నటీనటులు నిఖిల్ నాయర్, ఆయేషా, గౌరవ్ గుప్తా కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా రాబోతున్నారు. అలానే సోషల్ మీడియా సెన్సేషన్ రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్), యంగ్ హీరో శ్రీనివాస కూడా హౌస్‌లోకి రాబోతున్నారు. దివ్వెల మాధురితో పాటు పచ్చళ్ల పాప రమ్యపైన కూడా ఆడియన్స్‌కి చాలా నమ్మకాలు ఉన్నాయి. ఎందుకంటే అసలే సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉన్న రమ్య హౌస్‌లో ఎలా ఉంటుంది.. ఎలా ఆడుతుంది అనేది చూడాలి. పైగా ఈమెకి ఫిట్‌నెస్, జిమ్ అంటే ప్రాణం.. సో గట్టిగానే అబ్బాయిలకి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కనుక ఈ సారి బిగ్‌బాస్ 2.0తో షో ఎక్కడికో వెళ్లేలా ఉంది. ఇక దీనికి సంబంధించిన వివరాలు తెలియాలంటే.. మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
View this post on Instagram

