Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు లో వైల్డ్ కార్డుల ఎంట్రీ జరిగినప్పట్నుంచి షో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే మాధురితో చెవులకు చిల్లులు పడుతుంటే.. ఇంకోవైపు అయేషా.. తనకి అడ్డొచ్చిన వారిని బండకేసి తోముతుంది. ఈరోజు ఎపిసోడ్‌లో రీతూ-అయేషా మధ్య డిస్కషన్ జరిగిందయ్యా.. అబ్బో వాళ్ల అరుపులు, కేకల దెబ్బకి గొడవలంటే ఇష్టపడే సంజన కూడా సైలెంట‌్ అయిపోయింది. పని నుంచి తప్పించుకోవడానికి రీతూ వేసిన స్కెచ్.. దానికి హెల్ప్ చేద్దామనుకున్న కళ్యాణ్‌ని ఇద్దరినీ వాయించిపారేసింది. కిచెన్‌లో ఓవైపు గిన్నెలు తోముతూ ఎదురుగా ఉన్న అద్దంలో నుంచి చూస్తూ రీతూ చౌదరిని కూడా తన మాటలతో తోమేసింది. మరి అంతలా ఇద్దరి మధ్య గొడవ జరగడానికి రీజన్ ఏంటి.. ? ఆ గొడవకి ముందు డీమాన్ ఏం చేశాడు.. ఇవన్నింటిపై ఓ లుక్కేద్దాం.
గిన్నె గురించి మొదలైన రచ్చ..
ఉదయాన్నే గిన్నెలు తోమడానికి వెళ్లి రీతూ తిట్టుకుంది. ఎవరైనా తినడం లేటయ్ అర్ధరాత్రి తినేవాళ్లయితే తీసి పక్కన పెట్టుకోమని చెప్పు కళ్యాణ్.. పొద్దున్న నా వల్ల అవ్వదనే కదా నైట్ గిన్నెలు తోముతుంది.. మళ్లీ పొద్దున్న వేస్తే ఎలా.. అంటూ రీతూ చిరాకు పడింది. ఇదే విషయం దివ్యకి కూడా చెప్పింది. దీంతో కళ్యాణ్ వెళ్లి.. గిన్నెలు తోమడానికి పెట్టిన మరో హౌస్‌మెట్ అయేషా దగ్గరికెళ్లాడు. రీతూ రాత్రి అన్ని డిషెస్ వాష్ చేసింది.. కానీ ఎవరో మార్నింగ్ దోశ పిండి గిన్నె అక్కడ పెట్టారు.. అది నువ్వు చేస్తావా అని అడిగాడు. లేదు నేను ఎందుకు చేస్తాను.. బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్ వరకూ వాడిన గిన్నెలు మాత్రమే నావి.. తర్వాత రీతూ పని అని ముఖం మీదే చెప్పేసింది అయేషా.
Read Also: Bigg Boss 9 Telugu Day 38: రీతూని వదిలేసిన డీమాన్.. అయేషాతో కెమిస్ట్రీ వర్క్ ఔట్ అవుతుందా?
పని తప్పించుకునేందుకు స్కెచ్ వేసిన రీతూ..
కాసేపటికి డిషెస్ వాష్ చేయడానికి అయేషా కిచెన్‌లోకి వెళ్లింది. అక్కడ రాత్రి వాడిన దోశ పిండి గిన్నె కనిపించింది. దీంతో రీతూ ఇక్కడ బ్యాలెన్స్ పెట్టింది ఫినిష్ చేస్తావా.. నాకు ఇటు స్పేస్ కావాలి.. అని చాలా సింపుల్‌గా నెమ్మదిగా రీతూని అడిగింది అయేషా. దీనికి ఆన్సర్ ఇవ్వకుండా.. కెప్టెన్.. నేను క్లియర్‌గా కెప్టెన్‌కి చెప్పా.. అక్కడ నేను అన్నీ క్లియర్ చేశాను.. అక్కడ ఉన్నవి నేను క్లియర్ చేయను.. అక్కడ పెట్టుంటేనే నేను చేస్తానని చెప్పాను.. పొద్దున్న సింక్‌లో వేశారు ఆ గిన్నె.. అంటూ రీతూ చెప్పింది. ఈ గిన్నె నిన్న నైట్‌ది అది.. అని అయేషా చెప్పింది. నిన్న నైట్ రెండు సింక్‌లూ ఖాళీగా ఉన్నాయి అదే చెప్పాను నేను.. పిండి ఉంది నైట్ ఆ గిన్నెలో.. అంటూ రీతూ చెప్పింది. డ్యూటీ గురించి చెప్పినప్పుడు నువ్వే చెప్పావ్ నైట్ చేయకపోతే మార్నింగ్‌కి కూడా యాడ్ అవుతుందని.. ఇదే నేను చేస్తే నువ్వు ఒప్పుకుంటావా.. అని అయేషా సూటిగా అడిగింది. దీనికి ఆన్సర్ ఇవ్వకుండా రేషన్ మేనేజర్ ప్లీజ్ టాక్.. నేను పొద్దున్న కూడా నీకు ఏం చెప్పాను.. అంటూ దివ్య వైపు చూసింది రీతూ. ఇది నిన్నటిది.. అంటే నీ డ్యూటీ కూడా నేనే చేయాలా.. అన్నీ నేనే తోమాలా.. అని అయేషా అడిగింది. అది నిన్నటిదే నేను చెప్పేది విను అయేషా.. అని రీతూ అరిచింది. దీంతో ఏం వినాలి చెప్పు.. అంటూ అయేషా రెయిజ్ అయింది. అది నైట్ తీయలేదు అందులో పిండి ఉంది చెప్తున్నా కదా.. అంటూ రీతూ అంది. అది నైట్‌ది నేను ఎందుకు తోమాలి.. అని అయేషా స్టార్ట్ చేసింది.
మధ్యలో మాట్లాడిన రీతూ..
ఇంతలో కళ్యాణ్ మధ్యలో మాట్లాడాడు. అయేషా పాయింట్ ఏంటంటే అది రాత్రి వాడిన గిన్నె కదా నేనెందుకు కడుగుతాను అంటుంది.. రీతూ పాయింట్ ఏంటంటే అది ఉదయాన్నే వేశారు కదా.. అని కళ్యాణ్ చెప్పాడు. ఇది నేను కడగను అని చెప్పట్లేదు అర్ధరాత్రి వేశారు అంటున్నాను.. అని రీతూ చెప్పింది. అవన్నీ నాకు అవసరం లేదురా నువ్వు తర్వాత చేస్తావ్ కదా.. అని అయేషా అడిగితే చేస్తాను.. అని రీతూ అంది. సరే పక్కన పెట్టనా.. అయిపోయింది అంతే.. అని అయేషా కట్ చేసింది. కానీ రీతూ మళ్లీ సాగదీసింది. అయిపోయింది కాదు నువ్వు మాటలు అనేసి అయిపోయింది అంటే కాదు.. అంటూ రీతూ అంది. మరి మాట్లాడటం అయిపోతే అయిపోయిందనే అంటారు.. లేకపోతే మాట్లాడుతూనే ఉండాలా రోజంతా నీతో.. అంటూ అయేషా చెప్పింది. మరి నువ్వు అనకుండా ఉండు.. అని రీతూ అంటే సరేరా అయిపోయింది రీతూ.. అని మళ్లీ గట్టిగా అరిచింది అయేషా.
కళ్యాణ్‌కి కోటింగ్
ఇక నేను కెప్టెన్ మధ్యలో దూరాలి అన్నట్లు కళ్యాణ్ మళ్లీ మాట్లాడాడు. అయేషా నాకు ఉన్న డౌట్ ఏంటంటే నేను చెప్పాను కదా రీతూ కడుగుతుందని ఆల్ రెడీ మళ్లీ ఎందుకు వాదిస్తున్నావ్.. అని కళ్యాణ్ అడిగాడు. దీంతో అయేషా ఇచ్చిపడేసింది. కళ్యాణ్ ఎందుకు నువ్వు నాతో వాదిస్తున్నావ్.. నేనేం తప్పు చేశాను ఇప్పుడు.. ఇక్కడ ఇది ఖాళీ చెయ్ నాకు స్పేస్ కావాలని చెప్పా అంతే.. అది తర్వాత చేస్తానని చెప్తే అయిపోయేది కదా.. కానీ కెప్టెన్‌ని అడుగు.. రేషన్ మేనేజర్‌ని అడుగు అంటే నేనేం చెయ్యాలి చెప్పు.. అని అయేషా అడిగింది. ఇంతలో అర్ధరాత్రి వచ్చి గిన్నెలు వేస్తే నేనేం చేయాలి చెప్పు.. అంటూ రీతూ అరిచింది. అవన్నీ నాకు అనవసరం నాకు కావాల్సింది నువ్వు ఇక్కడ స్పేస్ క్లియర్ చేసి ఇవ్వాలి.. నువ్వు క్లియర్ చేస్తా తర్వాత అని చెప్తే అప్పుుడే అయిపోయేది కదా.. ఎందుకు నువ్వు కెప్టెన్‌ని అడుగు అక్కడ అడుగు అంటున్నావ్.. అని అయేషా కూడా ఇచ్చిపడేసింది. రీతూ కూడా చాలా వరకూ అరిచింది కానీ అయేషా వాయిస్ ముందు తేలిపోయింది. నువ్వు కూడా ఉండు.. అని రీతూ అంటే నువ్వు ఉండవే ఫస్ట్.. నువ్వు ఉండు.. నువ్వు ఊరుకోవే.. నువ్వు ఊరుకో.. ఏం పని చేయవు అడిగితే న్యన్యన్య అంటావ్.. అంటూ అయేషా వెక్కిరించింది. దీంతో ఏంటి అది మాటలు సరిగా మాట్లాడు.. అంటూ రీతూ మళ్లీ వాదించింది. ఇంతలో అయేషా అయేషా.. అంటూ కళ్యాణ్ పిలిచాడు. ఏంటి నాతో వద్దు కళ్యాణ్.. ఎందుకు నన్ను పిలుస్తున్నావ్ అక్కడ ఆపలేకుండా.. అని కళ్యాణ్‌పై సీరియస్ అయింది అయేషా.
మధ్యలో వచ్చిన మాధురి
ఇంతలో అయినా కెప్టెన్ ఆ గిన్నె మధ్యాహ్నం నుంచి అక్కడే ఉంది.. అంటూ మాధురి మాట్లాడింది. మధ్యాహ్నం నుంచి అక్కడే ఉందా నైట్ పెట్టారు తెలుసుకోండి.. మీకు అసలు తెలీకుండా వచ్చి మధ్యలో మాట్లాడకండి.. అర్ధరాత్రి తీసిన పిండి అది.. అంటూ మాధురిపై ఫైర్ అయింది రీతూ. దీంతో సుమన్ గారు ఇది ఇక్కడే ఉంది కదా పిండి.. బయట ఉందా.. అని మాధురి అడిగింది. లేదు బయటే ఉంది.. అని సుమన్ చెప్పాడు. వెంటనే పిండి ఉన్న గిన్నె నేను ఎలా కడుగుతాను సింక్‌లో వేశారా.. అంటూ రీతూ పాయింట్ మార్చింది. దీంతో మరి ఇప్పటివరకూ ఫ్రిడ్జ్‌లో ఉందన్నావ్.. ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నావ్.. అని మాధురి కొశ్చన్ చేసింది. మీరు ఏది పడితే అది మాట్లాడకండి.. అంటూ రీతూ అరిచింది. ఏంటి ఏయ్ ఏంటి.. నీకు ఒక స్టాండ్ లేదా.. అంటూ మాధురి ఫైర్ అయింది. ఏంటి స్టాండ్ ఏం తెలీకుండా మధ్యలో దూరిపోకండి.. అంటూ రీతూ కూడా అరిచింది.
సీరియస్ అయిన అయేషా
ఇక పక్కకెళ్లి మళ్లీ కళ్యాణ్-దివ్యలతో ఏదో గొణికింది రీతూ. దీంతో కిచెన్‌లో గిన్నెలు తోముతూ అద్దంలో నుంచి చూస్తూ రీతూ ఆపేస్తావా ఇంక.. అని అయేషా సీరియస్ అయింది. నువ్వెవరు ఆపేయమనడానికి.. అని రీతూ అనగానే అయిపోయింది ఆ టాపిక్ అని అయేషా చెప్పింది. అది చెప్పడానికి నువ్వెవరు అని రీతూ అడిగితే అది నా టాపిక్ నేనే చెప్తాను.. ఏయ్ ఆపవే ఓవరాక్షన్.. మాటలు ఆపెయ్ ఫస్ట్.. అంటూ అయేషా ఫైర్ అయింది. రీతూ ఏమో నువ్వే ఆపు అంటూ అరిచింది. నువ్వు ఆపెయ్‌రా ఎక్కువ మాట్లాడింది నువ్వు.. అని గిన్నెలు తోమేసి పక్కనే ఉన్న సుమన్ శెట్టి దగ్గరికెళ్లింది అయేషా. వామ్మో గట్టి నోరే.. అని అయేషాతో అన్నాడు సుమన్. మరి గొంతు అమ్మానాన్నది.. తగ్గదు.. అంటూ కన్నుకొట్టింది అయేషా. ఇలా అటు రీతూ ఇటు కళ్యాణ్ ఇద్దరినీ అయేషా మాములుగా వాయించలేదు.
Read Also: Bigg Boss Voting : వైల్డ్ గా వైల్డ్ కార్డులు.. హడలెత్తిస్తున్న దివ్వెల…. డేంజర్ జోన్‌లో ఉన్నదెవరంటే?


