Sunday, November 16, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Nominations:  కెప్టెన్ కి స్పెషల్ పవర్.. రాత్రిపూట రాజు, రాజా గుసగుసలు

Bigg Boss Nominations:  కెప్టెన్ కి స్పెషల్ పవర్.. రాత్రిపూట రాజు, రాజా గుసగుసలు

Bigg Boss Nominations: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆరోవారం రసవత్తరంగా మారింది. ఇక నామినేషన్స్ ప్రక్రియ చివరిలో కెప్టెన్‌కి బిగ్‌బాస్ ఒక పవర్ ఇచ్చాడు. నామినేషన్స్‌లో లేని (వైల్డ్‌కార్డ్స్‌ని మినహాయించి) ఒక సభ్యుడ్ని కెప్టెన్ కళ్యాణ్ నేరుగా నామినేట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో రాముని నామినేట్ చేశాడు కళ్యాణ్. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం లేదు.. బెలూన్ టాస్కులో ఫౌల్ జరిగింది.. కానీ అది చూసి నువ్వు ఊరుకున్నావ్.. అక్కడే ఆ టాస్క్ రద్దు చేయాల్సింది అంటూ కళ్యాణ్ చెప్పాడు. నేను పాయింట్ ఇవ్వనని చెప్పాను.. సంజన గారు బాగా ఆడారు అందుకే రద్దు చేయలేదని రాము వాదించాడు. దీనికి కళ్యాణ్ చెప్పాడయ్యా కంపేరిజిన్ మాములుగా నవ్వు రాలేదు. ఫస్ట్ దొంగతనం చేసినా ఒక రూపాయి దొంగతనం చేసినా 100 రూపాయలు దొంగతనం చేసినా దొంగ దొంగే.. దొంగతనం చూసినోడ్ని కూడా దొంగే అంటాం.. మేము అందరం దొంగలమని చెప్పి మేము ఒప్పుకున్నాం.. సంచాలక్‌గా నువ్వు ఒప్పుకోవట్లేదు.. అంటూ కళ్యాణ్ అన్నాడు. అయినా దొంగతనం (ఫౌల్) చేసిన రీతూ, తనూజలని వదిలేసి.. చూసి తప్పని చెప్పిన రాముని నామినేట్ చేయడం ఏంటో కళ్యాణ్‌కే తెలియాలి.

- Advertisement -

Read Also: Bigg Boss Updates: వాయమ్మో.. సీరియల్ విలన్ సినిమా చూపిస్తాడంట.. రూటు మార్చిన భరణి

ఎవరు నామినేట్ అయ్యారంటే..

ఇలా నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి హౌస్ నుంచి ఈ వారం బయటికి వెళ్లేందుకు ఆరుగురు సభ్యులు లిస్ట్‌లో చేరారు. భరణి, తనూజ, రాము, డీమాన్, సుమన్ శెట్టి, దివ్య.. ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు. ఇక, నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తనూజ కిచెన్‌లోకి వెళ్లింది. తన ఎదురుగా ఏదో టీషర్ట్ తీసుకొని భరణి లోపలికి వెళ్తుంటే తనూజ ఇలా అడిగింది. ఎన్నిసార్లు అదొక్కటే టీ షర్ట్ వేసుకుంటారు.. అని తనూజ అంటే ఏం చేయమంటావ్ మిగిలిన టీషర్ట్ అన్నీ నైలాన్ క్లాత్ ఉన్నాయి.. ఇదొక్కటే ఉంది.. వాష్ చేసిందే..అని భరణి చెప్పాడు. 3 నైట్స్ వేసుకున్నారు.. వేరేది వేసుకోవచ్చు కదా.. అంటూ తనూజ సలహా ఇచ్చింది. దీనికి ఏం సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్లి ఛీ కనీసం ఏ టీషర్ట్ వేసుకోవాలనే స్వేచ్ఛ కూడా నాకు లేదా అన్నట్లుగా దాన్ని విసిరేశాడు భరణి.

మాధురి ముచ్చట్లు..

తర్వాత సంజన-మాధురి ముచ్చట పెట్టారు. అయేషా పాయింట్లన్నీ యాక్సెప్ట్ చేస్తారా.. అని సంజనని అడిగింది మాధురి. తను కరెక్ట్‌గా చెప్పింది.. అని సంజన అనగానే మరి తనూజ పాయింట్లు.. ఎలా అనిపించాయని మాధురి అడిగింది. తనూజ కొద్దిగా క్యారెక్టర్‌లో ఉంది.. తను సీరియల్ క్యారెక్టర్‌లో ఉంది.. 100 పర్సంట్ ఉంది.. అంటూ సంజన చెప్పింది. నాకేంటి జెన్యూన్‌గా ఉంది అనిపిస్తుంది.. అని మాధురి చెప్పింది. గేమ్ తనది.. మేము యాక్టర్స్ కదా మాకు తెలిసిపోతుంది.. తను సీరియల్ క్యారెక్టర్‌లో ఉంది.. అండ్ అది తనకి వర్కవుట్ అవుతుంది అని అలా చేస్తూనే ఉంది. నేను జెన్యూన్‌గానే ఉంటాను మీతో మాధురి గారు నాతోనే ఉండండి మీరు.. మీరు నాకే బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండండి వేరే ఎవరికీ బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండకండి.. అంటూ సంజన చెప్పింది. దీనికి డన్.. అంటూ మాధురి ఆన్సర్ ఇచ్చింది.

అందర్నీ బుట్టలో వేసుకుంటున్న మాధురి

ఇక నామినేషన్స్ బోర్డుపై తన ఫొటో చూసి.. రాజు (మాధురి) నేను ఎంత ముద్దుగా ఉన్నానో చూశావా.. అంటూ మాధురిని అడిగింది తనూజ. నాకు సేవ్ చేసే పవర్ వస్తే మా తనూజమ్మని సేవ్ చేస్తాను.. అంటూ మాధురి చెప్పింది. నేను ముద్దుగా లేనా అంటూ మళ్లీ తనూజ అడిగేసరికి చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావ్.. అంటూ మాధురి చెప్పింది. తర్వాత నైట్ పడుకునే టైమ్‌లో మాధురి దగ్గరికెళ్లి గట్టిగా పట్టుకొని మీద పడుకుంది తనూజ. పక్కనే సంజన పడుకొని ఉంది. నువ్వయితే పోవులే హ్యాపీగా ఉంటావ్.. అని తనూజతో చెప్పింది సంజన. నువ్వు టాప్-3లో ఉంటావ్.. పక్కా నేను చెప్పా కదా.. అంటూ మాధురి అంది. మరి నేనో అని సంజన అడిగితే మీరు కూడా టాప్-5లో ఉంటారు.. అంటూ మాధురి జోస్యం చెప్పింది. రాజు.. అందరికీ నువ్వు ఇలానే చెప్తావ్ రాజు.. అంటూ తనూజ గారం కురిసింది. నేను ఎవరికీ చెప్పలేదు కావాలంటే వెళ్లి అడుగు.. అంటూ మాధురి అంది. ఇలా వెళ్లిన రెండు రోజులకే మాధురికి ఫ్రెండ్స్ అయిపోయారు తనూజ-సంజన. ఏందో ఈ రాత్రి పూట గుసగుసలు చూసిన ఆడియన్స్ తల బాదుకుంటున్నారు.

Read Also: Bigg Boss Season 9: చీచీ.. ఇప్పటి వరకు ఆ విజువల్స్ చూపించలేదు.. బిగ్ బాస్ పై మరో వివాదం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad