Bigg Boss 9 Telugu Day 04: బిగ్‌బాస్ సీజన్-9 కామనర్స్ వర్సెస్ సెలెబ్రటీస్ గా మారింది. అయితే, కామనర్ల కోటా నుంచి చివరిగా అడుగుపెట్టింది మర్యాద మనీష్. జ్యూరీతో పాటు శ్రీముఖి నిర్ణయం వల్లే మనీష్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. చాలా తెలివైనవాడు.. హౌస్‌లో స్ట్రాటజీలతో పిచ్చెక్కిస్తాడంటూ శ్రీముఖి ఓవర్ గా పొగిడేసింది. అయితే, ఇప్పటివరకూ జరిగిన గేమ్‌ని గమనిస్తే స్ట్రాటజీ మాట పక్కన పెడితే ఎదుటివాళ్లు మాట్లాడే మాటలు వినే ఓపిక కూడా ‘మర్యాద’ దగ్గర లేదు. ఇక బిగ్ బాస్ డే 4 ఎపిసోడ్‌లో అయితే తన పేరు ముందు ఉన్న మర్యాదని కూడ పక్కన పెట్టేసి ఇమ్మానుయేల్ గురించి నీచంగా మాట్లాడాడు.
అన్యాయంగా కెప్టెన్సీ టాస్క్ నుంచి ఇమ్మూ ఔట్
బిగ్‌బాస్ మొదలయ్యే ముందు ఆడియన్స్ దృష్టిలో కామనర్లపై గుడ్ ఒపీనియన్ ఉండేది. ముఖ్యంగా అగ్నిపరీక్షలో వాళ్లు సత్తా చూపించి వచ్చారు. పైగా, మనలాంటి వారే కదా అనే ఫీలింగ్ కూడా ఆడియన్స్‌లో బలంగా ఉండేది. అయితే హౌస్‌లో వాళ్ల బిహేవియర్, మాటలు ఇవన్నీ చూస్తుంటే నెమ్మదిగా ఆడియన్స్ దృష్టి, సపోర్ట్ మొత్తం సెలబ్రెటీల మీదకే వెళ్తుంది. నిన్నటి ఎపిసోడ్‌లో రాము రాథోడ్ ఏదో చెప్పడానికి వస్తే మర్యాద మనీష్ మాట్లాడితన తీరు చాలా తప్పుగా అనిపించింది. నేను నిన్ను నమ్మను.. నాకేం చెప్పకు అంటూ ఏదో చీదరించుకుంటూ చెప్పినట్లు అనిపించింది. పోనీ సర్లే ఏదో కోపంలో అన్నాడేమో అనుకుంటే ఈరోజు ఎపిసోడ్‌లో కూడా చాలానే మాటలు వదిలేశాడు మనీద్. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. అలాంటి టాస్కుకి సంచాలక్‌గా అవకాశం ఇస్తే మనీష్ అన్‌ఫెయిర్ డెసిషన్ తీసుకున్నాడు. పార్శియాలిటీగా వ్యవహరించి ఈ టాస్కు నుంచి కంటెండర్‌గా ఉన్న ఇమ్మానుయేల్‌ని ఎలిమినేట్ చేశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే నోటికొచ్చినట్లుగా కామెంట్లు చేశాడు మనీష్. అసలు ఈ కెప్టెన్సీ టాస్కులో ఏం జరిగింది ఏంటో చూద్దాం రండి మరి.
కెప్టెన్సీ టాస్కులో..
ఇక, కెప్టెన్సీ టాస్క్ లో సంజన, హరీష్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్, శ్రష్టి పోటీ పడ్డారు. శ్రష్టికి రాము, సంజనకి దమ్ము శ్రీజ, డీమన్ పవన్‌కి ప్రియ, హరీష్‌కి పవన్ కళ్యాణ్ సపోర్ట్‌గా వచ్చారు. ఇక అటు కామనర్లు ఇటు సెలబ్రెటీలు డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఏమైనా కానీ మన మధ్యలోనే కెప్టెన్ ఉండాలి.. అంటూ మాట్లాడుకున్నారు. అయితే సంజనకి శ్రీజ ఎందుకు సపోర్ట్ చేశావ్ అంటూ కామనర్లు అడిగారు. దీంతో నేను కావాలనే సపోర్ట్ చేశా.. ఆమె గేమ్ ఎలా ఉంటుందో తెలియాలని సెలక్ట్ చేశా.. అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఇక శ్రష్టి కానీ ఇమ్మూ కానీ కెప్టెన్ అవ్వాలి.. సంజన గారు కెప్టెన్ అయితే ఓనర్స్‌కి కూడా అడ్వాంటేజ్ అవుతుంది.. ఆమెకి అక్కడే ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు.. అంటూ భరణి సెలబ్రెటీలతో చెప్పాడు. ఇక నువ్వు సంజనకి సపోర్ట్ చేసినా కొట్టిపడేద్దాం.. అల్టీమేట్‌గా మన దగ్గరే ఉండాలి కెప్టెన్సీ.. అంటూ హరీష్.. కామనర్లతో అన్నాడు.
వదలకు బెదరకు టాస్క్
కెప్టెన్సీ టాస్క్‌కి మొత్తం సెట్ చేశారు. ఇక, కెప్టెన్ ఎవరో తేల్చేందుకు పెడుతున్న టాస్క్ ‘వదలకు బెదరకు’.. కంటెండర్స్ తరఫున సపోర్టర్స్ గేమ్ ఆడాల్సి ఉంటుంది.. ఈ టాస్కులో గెలవడానికి సపోర్టర్స్ చేయాల్సింది గార్డెన్ వైపు ఉంచిన వాల్‌కి ఉన్న రాడ్స్‌ని గట్టిగా పట్టుకొని వీలైనంత ఎక్కువ సేపు ఉండాలి.. ఆ పక్కనే ఉన్న లైట్ టవర్స్‌ని బట్టి కంటెండర్ల నుంచి ఒకర్ని సంచాలక్ పిలుస్తారు.. తమ ఇష్టానుసారం సపోర్టర్స్‌లో ఒకరిని ఆట నుంచి తప్పించడానికి ఒక రాడ్ తీయాల్సి ఉంటుంది. ఏ సపోర్టర్ శరీర భాగాలైనా నేలని తాకితే వాళ్లు తప్పుకున్నట్లే చివరి వరకూ ఎవరి సపోర్టర్ అయితే వాల్‌ని పట్టుకొని నిల్చొని ఉంటారో ఆ సపోర్టర్ కంటెండర్ ఈ టాస్క్ విజేతగా మొదటి కెప్టెన్ అవుతారు.. అంటూ బిగ్‌బాస్ టాస్క్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఇక ఈ టాస్కుకి మనీష్‌ని సంచాలక్‌గా నియమించారు.
Read Also: Bigg Boss 9 Telugu Day 04: బిగ్ బాస్ ట్విస్ట్.. కన్ఫెషన్ రూమ్ లోకి సంజనా..!
మిస్టేక్ చేసిన మనీష్
ఇక గేమ్ ఇలా మొదలుకాగానే మొదటి ఛాన్స్ డీమన్ పవన్‌కి ఇచ్చాడు. అయితే రెడ్ సిగ్నల్ ఉండగా డీమన్ రాడ్ తీయడానికి వెళ్తుంటే ఆగు.. గ్రీన్ వచ్చాకనే తీయాలి అంటూ మనీష్ చెప్పాడు. ఆ తర్వాత శ్రష్టికి కూడా ఇలానే చెప్పాడు. కానీ తర్వాత వెళ్లి ఇమ్మానుయేల్‌కి మాత్రం ఏం చెప్పకుండా అలా చూస్తూ నిల్చున్నాడు. దీంతో రెడ్ సిగ్నల్ ఉండగనే ఇమ్మూ రాడ్ తీసేశాడు. ఇక రాడ్ తీసిన వెంటనే మనీష్ అసలు గేమ్ స్టార్ట్ చేశాడు. గ్రీన్ పడక ముందే మీరు రాడ్ తీశారు.. అని మనీష్ చెప్పగానే సారీ.. గ్రీన్ పడింది కదా అనుకొని తీశాను.. అని ఇమ్మూ అమయకంగా చెప్పాడు. ఇంతలో రూల్స్ ఆర్ రూల్స్.. అంటూ హరీష్ పాయింటా లాగాడు. రూల్స్‌లో లేదు కదా అని ఇమ్మూ అంటే సంచాలక్ చెప్పారు.. అంటూ ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో ఏం ఆలోచించకుండా ఇమ్మానుయేల్ టీమ్ ఎలిమినేటెడ్.. అంటూ మనీష్ డెసిషన్ అనౌన్స్ చేశాడు. అన్నా ఎలిమినేట్ ఏంటన్నా.. మీరు ఆపాలి కదా.. అని ఇమ్మూ అడిగితే సింపుల్ రూల్ చెప్తున్నాను వెళ్లేటప్పుడు.. సంచాలక్ ఆపాలి కానీ కంటెస్టెంట్ ఆగలేదు కదా.. అంటూ మనీష్ అన్నాడు.
సంచాలక్ గా ఫెయిల్
మీరు చెప్పాలి కదా పట్టుకున్నప్పుడైనా చెప్పాలి కదా.. అని ఇమ్మూ కరెక్ట్ పాయింట్ తీశాడు. చెప్పాలి కదా మరి తీసేశావ్ కదా.. నేను చెప్పకుండానే.. నా మాట విన్నావా ఆగలేదు.. నేను ఇమ్మానుయేల్ గారు అన్నాను.. అంటూ మనీష్ అబద్ధం చెప్పాడు. అనలేదు మీరు.. ఆగమని వాళ్లకి చెప్పినట్లు నాకు చెప్పాలి కదా.. పవన్‌కి చెప్పారు కదా నాకు చెప్పాలి కదా.. మీరు ఎప్పుడు చెప్పారు తీశాక చెప్పారు.. స్టాప్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు.. ఎలిమినేషన్ అనేది ఫస్ట్ రౌండ్‌లోనే కరెక్ట్ కాదు.. అంటూ ఇమ్మూ అస్సలు తగ్గలేదు. దీంతో ఇలాంటి పాయింట్లు పెట్టకు ప్లీజ్.. చాలా కామెడీ ఉంటది.. అంటూ మనీష్ టాపిక్ డైవర్ట్ చేశాడు. దీంతో సంచాలక్‌గా ఫెయిల్.. అంటూ ఇమ్మూ ఫైర్ అయ్యాడు. నువ్వు కంటెస్టెంట్‌గా ఫెయిల్ అవుతున్నావ్ కదా.. కంటెస్టెంట్‌గా ఒక సింపుల్ మిస్టేక్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నావ్ నువ్వే ఫెయిల్.. అంటూ మనీష్ అడ్డదిడ్డంగా వాదించాడు. మీది మిస్టేక్ నాది కాదు.. అంటూ ఇమ్మూ పాయింట్ లేపాడు.
Read Also: Bigg Boss New Promo: గుడ్డు గురించి రచ్చ.. హరీష్ పై కామనర్స్ ఫైర్..!
ఇమ్మూని అవమానించేలా..
ఇమ్మూతో పాటు మిగిలిన సెలబ్రెటీలు కూడా సంచాలక్‌ది మిస్టేక్ అంటూ గోలగోల చేశారు. దీంతో బిగ్‌బాస్ నేను డెసిషన్ తీసుకుంటున్నాను.. ఎలాంటి పరిస్థితులైనా నేను ఎదుర్కొంటాను.. ఇమ్మానుయేల్ ఎలిమినేటెడ్.. అంటూ మనీష్ చెప్పుకొచ్చాడు. దీంతో మీరు అన్‌ఫెయిర్ గేమ్ ఆడారు..అన్‌ఫెయిర్ ఇది.. మీ వాళ్లకి నువ్వు సపోర్ట్ చేశావ్.. అంటూ ఇమ్మూ ఫైర్ అయ్యాడు. తనెవరు తను (శ్రష్టి) కామనరా అని శ్రష్టిని మనీష్ మధ్యలోకి లాగాడు. అసలైతే.. నీ పాయింట్‌కే నేను కౌంటర్ చేస్తున్నాను.. మావాళ్లు మీ వాళ్లు అన్నావ్ కదా మీవాళ్లకే నేను సపోర్ట్ చేస్తున్నాను.. ఏం పాయింట్ లెస్ రూల్ పెడతావ్.. ఏ పో అన్నా.. అంటూ ఇమ్మూపై మనీష్ ఫైర్ అయ్యాడు. మీ డ్యూటీ చేయకుండా మీరేం చేస్తున్నారు.. అని ఇమ్మూ అడిగితే నువ్వు రూల్స్ తెలీకుండా నువ్వేం చేస్తున్నావ్.. బేసిక్ రూల్స్ తెలీదు కానీ గేమ్ ఆడటానికి వచ్చావ్..వచ్చిండు పెద్ద బిగ్‌బాస్‌కి.. ఏం మాటలు మాట్లాడుతున్నావ్ అసలకి.. వచ్చాడు పెద్ద ప్లేయర్ బిగ్‌బాస్ కంటెస్టెంట్.. 100 మంది ఉన్నారు రీప్లేసబుల్.. వాళ్లని తీసుకోండి బిగ్‌బాస్.. వైల్డ్ కార్డ్ వస్తారు కదా వాళ్లని పెట్టుకోండి.. అంటూ బిగ్‌బాస్‌కే సలహాలు ఇస్తూ మనీష్ మర్యాద లేకుండా మాట్లాడాడు. దీంతో అబ్బో చెప్తున్నాడబ్బా ఈయన పెద్ద జడ్జి రీప్లేస్‌మెంట్ చెప్తున్నాడు.. వాళ్లిద్దరికీ ఆపినప్పుడు నాకెందుకు ఆపలేదు చెప్పండి.. అని సరైన పాయింట్ లాగాడు ఇమ్మూ. దీంతో సరే నన్ను నామినేట్ చేసేయండి.. నాగార్జున గారు కూడా చూస్తున్నారు కదా నన్ను నిలదీసినప్పుడు పాయింట్ చేసెయ్.. అంటూ మనీష్ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇక్కడితో డే 4 ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ గేమ్ రేపు కంటిన్యూ అవుతుంది . అయితే, సంజన హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ అయినట్లు తోలుస్తోంది.


