Bigg Buzz: బిగ్‌బాస్ సీజన్-9లో మరో ఎలిమినేషన్ షాక్ ఇచ్చింది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి అడుగుపెట్టిన దివ్వెల మాధురి ఈ వారం బయటికొచ్చింది. కానీ వెళ్లిపోయాక కూడా ఆమె ఫైర్ తగ్గలేదు. బిగ్‌బాస్ బజ్‌లో శివాజీతో చేసిన చిట్‌చాట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆమె ఎంట్రీ క్షణానికే శివాజీ సెటైర్ వేసాడు “మాధవీనా లేక మాధురినా పిలవాలి?” అని. దానికి ఆమె చల్లగా “నా పేరు మాధురి, మాధవి కాదు” అంటూ ఝలక్ ఇచ్చింది. వెంటనే శివాజీ మళ్ళీ కౌంటర్ – “అది అప్పుడే చెప్పుంటే గొడవ ఉండేది కాదు కదా” అన్నాడు. ఆమె మాత్రం “నాకు నచ్చితేనే చెబుతాను” అంటూ సమాధానం ఇచ్చింది.
Read Also: Shafali Verma:ఫైనల్‌కి ముందు సచిన్ తో చాట్..!
“100 పర్సెంట్ మీరు తెలుగు ఇళ్లల్లోకి వెళ్లాలనుకున్నారా?” అని శివాజీ అడిగితే, “అవును వెళ్లాను, అలాగే రావాలని అనుకున్నా కాబట్టి వచ్చాను. నాకు యాక్టింగ్ రాదు, మాస్కులు లేవు” అని ఆమె స్పష్టంగా చెప్పింది. దానికి శివాజీ సరదాగా “అది ఎవరూ అడగలేదే” అని సెటైర్ వేశాడు.
చర్చ ముదురుతుండగా, “బిగ్‌బాస్‌లో ఎంత పెద్ద తోపున్నా…” అని శివాజీ మొదలుపెట్టగానే, “ఇప్పుడెవరూ తోపు అనట్లేదు” అంటూ ఆమె కౌంటర్ ఫైర్ ఇచ్చింది. శివాజీ సైతం “నేను మీ గురించి అనలేదు” అని సర్దుకున్నా, ఆమె తన దూకుడు తగ్గించలేదు. “బయటైతే జుట్టు పట్టుకొని ఈడ్చి కొడతా అన్నారు కదా, ఎలా కొడతారు?” అని శివాజీ అడిగితే, ఆమె చిరునవ్వుతో “ఎలా అనుకుంటే అలా” అన్నట్టుగా ఫుల్ అటిట్యూడ్ చూపింది.
ఆడియన్స్ ఉండనిస్తారా?
“ఈ విధంగా మాట్లాడితే ఆడియన్స్ ఉండనిస్తారా?” అన్న ప్రశ్నకు “ఆడియన్స్ ప్రకారమే మాట్లాడాలా?” అంటూ ఆమె తిప్పికొట్టింది. “నేను వెళ్లాలనుకున్నాను వెళ్లాను, రావాలనుకున్నాను వచ్చాను” అని సూటిగా చెప్పింది. దానికి శివాజీ “అంటే ఓడిపోయి నేను కావాలని ఓడిపోయానంటారా?” అని అడిగితే, ఆమె మాత్రం నవ్వుతో చెలరేగిపోయింది.
Read Also: Deepti Sharma: ఎన్నో అవమానాలు దాటుకొని..ప్రపంచ కప్ వరకు!
కూర్చోండి అన్నప్పుడు కూర్చోపోతే మాట్లాడరా అంటే అర్థమేంటి అని శివాజీ అడిగాడు. “ఏ అంటే తప్పా?” అని ఆమె చురుకైన సమాధానం ఇచ్చింది. దీంతో శివాజీ ఓ స్టోరీ చెప్పబోయాడు “డాక్టర్ దగ్గరికెళ్తే ఏమన్నాడంటే, గట్టిగా అరవకు, గట్టిగా మాట్లాడకు, నువ్వు మాట్లాడిన ప్రతిసారి నీకు తెలీకుండా నెగెటివిటీ స్టార్ట్ అవుతుంది. మీరు హౌస్‌లో చేసే ప్రతి వాదన భయపెట్టేలా ఉంది” అన్నాడు. దానికి ఆమె చురుగ్గా “మీకా?” అంటూ సెటైర్ వేసింది.
అమ్మా తల్లి నాకు కాదమ్మా..
దాంతో శివాజీ నవ్వుతూ “అమ్మా తల్లి నాకు కాదమ్మా, లోపల ఉన్న సాయికి” అంటూ హాస్యంగా సర్దుకున్నాడు. “శ్రీజని చూస్తే భయపడ్డట్టే అనిపించింది” అని రెచ్చగొట్టగా, “భయమనేది నా బ్లడ్‌లో లేదు” అంటూ ఆమె పవర్‌ఫుల్ డైలాగ్ పేల్చింది. మరి ప్రోమోయే ఇలా ఉంటే, పూర్తి ఇంటర్వ్యూ ఎయిర్ అయితే మాధురి మాటల తుఫాన్ సోషల్ మీడియాలో ఎలాగుంటుందో చూడాలి!


