Saturday, November 15, 2025
HomeTop StoriesSivaji Bigg Boss Buzzz: పుంగి బజాయిస్తుందండి.. సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న హరీష్.. రెడ్ ఫ్లవర్స్...

Sivaji Bigg Boss Buzzz: పుంగి బజాయిస్తుందండి.. సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న హరీష్.. రెడ్ ఫ్లవర్స్ ఇచ్చిన శివాజీ

Bigg Boss Buzzz: బిగ్‌బాస్ బజ్ లో శివాజీ హోస్టింగ్ మాములుగా లేదు. హౌస్‌లో చేసిన ఎక్స్‌ట్రాలకి బజ్‌లో బదులివ్వాల్సిందే అంటూ ఈసారి శివాజీ హోస్టుగా బిగ్‌బాస్ బజ్ మొదలైంది. మొదట్లో కాస్త శివాజీ తడబడినట్లు కనిపించినా.. లాస్ట్ ఎలిమినేట్ అయిన ప్రియశెట్టిని మాత్రం గట్టిగానే ప్రశ్నలు అడిగాడు శివాజీ. ముఖ్యంగా నాగార్జున ముందే కాలు మీద కాలేసి కూర్చుంటావా అంటూ ప్రియని ఏకిపారేశాడు. ఇక ఇప్పుడు హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయిన హరిత హరీష్‌పై కూడా శివాజీ ఇంటర్వ్యూ గట్టిగానే జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమో సూపర్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు ఆ వివరాలేంటో చూసేద్దాం.

- Advertisement -

రెడ్ ఫ్లవర్స్ తో వెల్కమ్

మాస్క్‌ పెట్టుకొని హరీష్‌కి బజ్‌లోకి వెల్కమ్ చెప్పాడు శివాజీ. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు.. కానీ మీ నోటి నుంచి వచ్చిన మాటలకి అంటూ రెడ్ ఫ్లవర్స్ ఇచ్చి స్వాగతం పలికాడు శివాజీ. ఇక ఫ్లవర్స్ చేతిలో పట్టుకొని ఉదాహరణకి మీరు రెడ్ ఫ్లవర్ అన్నారు కదా కానీ నేను రెడ్‌ని తీసుకునే పర్స్‌పెక్టివ్ వేరుగా ఉంటుంది.. అని హరీష్ చెప్పాడు. అసలు ఇక్కడేం మేటర్ లేదు ఇదంతా డొల్లే అంటున్నారు ఆడియన్స్.. అంటూ హరీష్ ముఖం మీదే అడిగాడు శివాజీ. నిజాయతీ మనిషి ఫేక్‌గా కాదు ఫెయిర్‌గా ఉండే మనిషి రావాలని కోరుకున్నప్పుడు నేను నిజాయతీగా ఉండాలి కదా అక్కడ.. అంటూ హరీష్ బదులిచ్చాడు. ఎంతసేపు మీరు నేను నేను అన్నారు.. ఏంటి సార్ ఈ డబ్బా అని దొబ్బుతున్నారు బయట.. అంటూ శివాజీ ఫైర్ అయ్యాడు.

Read Also: Castor Oil: ఆముదం నూనే ఎన్ని లాభాలున్నాయో మీకు తెలుసా?

మన డబ్బా మనమే కొట్టుకోవాలి

భారతదేశంలో మావా ఇవాళ మన డబ్బా మనమే కొట్టుకోవాలి.. అని హరీష్ చెప్పాగనే సినిమా డైలాగ్ ఇది అంటూ పంచ్ వేశాడు శివాజీ. దీంతో అరచేతిలో నేను 6 అని రాస్తే జనాలకి చూపించేటప్పుడు అది 9లానే కనిపిస్తుంది.. ఇది 6 అని అర్థమయ్యేది నాకు ఒక్కడికే కదా.. అని హరీష్ అన్నాడు. దీనికి ఇది రియలైజేషన్.. తెలుగు యువత మీకు కొన్ని బిరుదులు ఇచ్చారు సార్.. అంటూ శివాజీ అన్నాడు. ఇంతలో భగత్ సింగ్ ఒక్కడే.. సుభాష్ చంద్రబోస్ ఒక్కడే నేనూ ఒక్కడినే.. అంటూ హరీష్ మళ్లీ తన డబ్బా మొదలుపెట్టాడు. ఇది చూసి మీ కంపేరిజన్ మాత్రం తగ్గట్లేదే ఎక్కడా.. బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చిన తర్వాత ఇతను చాలా మంచి మనిషని.. పీకిపడేశారంతే.. అంటూ హరీష్‌పై రెచ్చిపోయాడు శివాజీ. ఈ మాటలకి మీరు నన్ను మాట్లాడనివ్వట్లేదు.. అంటూ హరీష్ ఆగిపోయాడు.

Read Also: Bigg Boss Sunday Promo: నాగార్జునకి షాక్ ఇచ్చిన దివ్య- శ్రీజ.. కమ్ అంటే గార్డెన్ లోకి రమ్మన్నట్లేనా?

తప్పుడు మనిషంటే?

తప్పుడు మనిషంటే ఎన్ని అర్థాలు తీసుకుంటారు.. అని హరీష్‌ని అడిగాడు శివాజీ. తప్పు చేసేవాళ్లని తప్పుడు మనిషే అంటారు కద సార్.. అని హరీష్ అడిగాడు. అతను అంటే తప్పేముందండి.. అని శివాజీ మళ్లీ ప్రశ్నించాడు. నేను ఆన్ ఫేస్ మాట్లాడతా.. రైటా రాంగా అనేది నేను తెలుసుంటా.. రాంగ్ అయితే రియలైజ్ అవుతా.. అంటూ హరీష్ క్లాస్ పీకాడు. ఇక ప్రోమో చివరిలో ఇప్పుడు అర్థమైందా మీకు బిగ్‌బాస్ ఎంత తోపునైనా వొంగోబెట్టి పుంగి బజాయిస్తుందండి.. అంటూ శివాజీ మాములు డైలాగ్ కొట్టలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad