Bigg Boss New Promo: బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ వీక్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సారి బిగ్ బాస్ సీజన్ 9 చదరంగం కాదు.. రణరంగమే అంటూ ఆట ఆరంభించగా.. ఇందులో ఊహించని మలుపులు జరుగుతున్నాయి. ఇప్పటికే, సీజన్ లో కామనర్స్, సెలబ్రెటీలు సపరేట్ చేశారు. ఇప్పటికే హౌస్ లో ఐదుగురు సామాన్యులుతొమ్మిది మంది సెలబ్రెటీలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా సామాన్యులను ఓనర్లుగా, సెలబ్రెటీలు టెనెంట్స్ గా డివైడ్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు రోజు రోజుకు ముదురుతున్నాయి. హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టేలా టాస్క్ లు ఇస్తున్నాడు. ఇక, సెప్టెంబర్ ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్లు గా ఐదుగురి పేర్లులను అనౌన్స్ చేశాడు. ఆ ఐదుగురినిక్ చిత్ర విచిత్రమైన టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్.. ప్రస్తుతం నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో మాస్క్ మ్యాన్ హరీష్ నోరు జారాడు. ముందు వెనక చూస్కోకుండా మాటలు వదిలినట్టు కనిపిస్తుంది. ఏకంగా భరణి, ఇమ్మాన్యుయేల్ ను ఆడవాళ్ళతో పోల్చేశాడు హరీష్. ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ కు మర్యాద మనీష్ ను సంచలక్ గా చేశాడు బిగ్ బాస్. సంచలక్ గా ఉన్న మనీష్ వల్ల చాలా గందరగోళం నెలకొంది. చాలా వాదనలు కూడా జరిగాయి.
Read Also: Bigg Boss 9 Telugu Day 04: పేరులోని మర్యాదని పక్కన పెట్టిన మనీష్..!
న్యూ ప్రోమోలో..
అయితే, ఇప్పుడు రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమోలో పవన్ కళ్యాణ్ తనను బాడీ షేమింగ్ చేశాడని ఇమ్మానుయేల్ బాధపడ్డాడు. డిమాన్ పవన్ తనను ఏవిధంగా బాడీ షేమింగ్ చేశాడో భరణి దగ్గర చెప్పుకున్నాడు ఇమ్మానుయేల్. అలాగే డిమాన్ పవన్ కోపంతో హెడ్ క్యాప్ విసిరేయడం కూడా ఈ ప్రోమోలో చూడొచ్చు. అలాగే ప్రియా కూడా తొక్కలో ఫెయిర్ గేమ్.. మాటలు కూడా ఫెయిర్ గా మాట్లాడటం లేదు అని అసహనం వ్యక్తం చేసింది. ఇక భరణి గురించి అలాగే ఇమ్మానుయేల్ గురించి హరీష్ నోరు జారాడు. తనూజ, ఇమ్మానుయేల్, భరణి నేను ఇన్నిరోజులు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు అనుకున్నా.. కానీ ముగ్గురు ఆడోళ్లతో ఫైట్ చేశా అని నాకు ఇప్పుడు అర్ధమైంది అని చెప్పాడు. దాంతో సీన్ సీరియస్ గా మారింది. ఇకపోతే, ఈవారం నాగార్జున చేతిలో కామనర్స్ కు గట్టిగానే క్లాస్ పడేలా ఉంది. హరీష్, డిమాన్ పవన్ కు నాగ్ క్లాస్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరోవైపు, లీకుల ప్రకారం.. సంజన హౌస్ కెప్టెన్ గా అయ్యా ఛాన్స్ కన్పిస్తోంది.
Read Also: Bigg Boss 9 Telugu Day 04: బిగ్ బాస్ ట్విస్ట్.. కన్ఫెషన్ రూమ్ లోకి సంజనా..!


