Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Captain: ప్చ్.. పాపం తనూజ.. ఈసారి కూడా.. కెప్టెన్సీ టాస్క్ లో ఓటమి

Bigg Boss Captain: ప్చ్.. పాపం తనూజ.. ఈసారి కూడా.. కెప్టెన్సీ టాస్క్ లో ఓటమి

Bigg Boss Captain: బిగ్‌బాస్ హౌస్‌లోకి భరణి రీఎంట్రీతో మరోసారి ఎమోషనల్ యాంగిల్ మరింత పెరిగిపోయింది. భరణి రాకతో తనూజ నెమ్మదిగా పార్టీ మార్చేసింది. అప్పటివరకూ మాధురితో చాలా క్లోజ్‌గా ఉన్న తనూజ ఇప్పుడు మళ్లీ భరణి పార్టీలోకి వెళ్లిపోయింది. అలానే కళ్యాణ్‌తో కూడా ముందులా ఏం ఉండట్లేదు. దీంతో ఈ వారం కెప్టెన్సీ టాస్కులో తనూజకి మరోసారి షాక్ తగిలింది. గత వారం ఇమ్మానుయేల్ చేతిలో ఓడిపోయి తనూజ కెప్టెన్సీ మిస్ చేసుకుంది. ఇప్పుడు దివ్య చేతిలో దెబ్బతింది.

- Advertisement -

కెప్టెన్సీ టాస్కు..

బిగ్ బాస్ లో ఎనిమిదో వారం కెప్టెన్సీ కంటెండర్లుగా దివ్య, తనూజ, నిఖిల్, శ్రీనివాస్, భరణి నిలిచారు. దీంతో వీరికి డ్యాన్సింగ్ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా ఒక్కొక్కరినీ తీసేస్తూ వెళ్లారు..అలా చివరికి తనూజ-దివ్య మిగిలారు. అప్పుడు చివరిగా హౌస్‌మేట్స్ మద్దతు ప్రకారం ఎవరికి ఎక్కువమంది సపోర్ట్ ఉంటే వాళ్లు కెప్టెన్ అవుతారని బిగ్‌బాస్ ప్రకటించాడు. తనూజకి రీతూ, డీమాన్, కళ్యాణ్, మాధురి మాత్రమే సపోర్ట్ చేశారు. మరోవైపు దివ్యకి ఇమ్మానుయేల్, సుమన్, సంజన, భరణి, గౌరవ్, శ్రీనివాస్ మద్దతిచ్చారు. దీంతో దివ్య 8వ కెప్టెన్ అయింది.

Read Also: Women’s World Cup: సెంచరీతో అదగొట్టిన జెమీమా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆమెనే..

తనూజ మిస్టేక్స్..

అయితే, ఈ వారం తనూజకి ఎక్కడా టాస్కులు ఆడే అవకాశం రాలేదు. కానీ రేషన్ మేనేజర్‌గా ఉంటు అటు కుకింగ్ డిపార్ట్‌మెంట్‌తో ఇటు మిగిలిన హౌస్‌మేట్స్‌తో గొడవపడటమే సరిపోయింది. సంజన, మాధురి, శ్రీజ, కళ్యాణ్, డీమాన్ ఇలా అందరితో పాపకు గొడవైంది. ఫుడ్ విషయంలో ఆమె మాట్లాడే తీరుపై హౌస్‌మేట్స్ చాలా మంది కంప్లెయింట్స్ చేశారు. అంతెందుకు తనూజకి అంత క్లోజ్‌గా ఉండే మాధురి కూడా ఈ వారం గొడవపడింది. ఒక చపాతీ ఎక్స్‌ట్రా ఇవ్వు నాకు కళ్లు తిరుగుతున్నాయని మాధురి అడిగితే తిరగనీ పర్లేదు పడిపోతే డాక్టర్‌ని పిలుస్తా అంటూ తనూజ చెప్పింది. అది కామెడీగా అన్నట్లు కూడా అనిపించలేదు.

Read Also: Women’s World Cup: ఆట బాలేదు.. పక్కన పెట్టేస్తున్నా.. కానీ ఈ రియాక్షన్ అస్సలు ఊహించలేదేమో!

భరణి ఎంట్రీతో దివ్య జోష్..

మరోవైపు దివ్య మాత్రం ఈ వారం భరణి రీఎంట్రీ ఇవ్వడంతో పుల్ జోష్‌లో ఉంది. ముఖ్యంగా భరణి కోసం ఒక టాస్క్ ఆడి గెలిపించింది కూడా. అలానే హౌస్‌మేట్స్‌తో కూడా గట్టిగానే గొడవలు పడింది. మొత్తానికి అయితే దివ్య కెప్టెన్ అయిపోయింది. మరి రేషన్ మేనేజర్‌గా ఎవరిని పిక్ చేసుకుంటుందో చూడాలి. ఇంకోవైపు ఈ వారం కెప్టెన్‌గా ఉన్న ఇమ్మూ తన వరకూ బాగానే డీల్ చేశాడు. కానీ తనూజ వల్లే గొడవలు జరిగాయి. హౌస్ అంతా రచ్చ రచ్చ జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad