Bigg Boss elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కొత్త కొత్త ట్విస్ట్ లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ ను మరోసారి హౌస్ లోకి రప్పించారు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ లోపల ఉన్న హౌస్ మేట్స్ ను నామినేట్ చేశారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి.. ముఖ్యంగా శ్రీజ, మాధురి మధ్య ఓ రేంజ్ లో రచ్చ జరిగింది. కేవలం మాధురితో గొడవ పెట్టుకోవడానికే శ్రీజ హౌస్ లోకి వచ్చినట్టు ఉంది. ఇక ఈ అమ్మడు హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..ఇక శ్రీజ తర్వాత భరణి కూడా హౌస్ లోకి వచ్చాడు. భరణి మెయిన్ గేట్ నుంచి ఇలా ఎంటర్ అవ్వగానే దివ్య పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది. దీంతో భరణి అయ్యో అంటూ కాస్త ఇబ్బంది పడ్డాడు. భుజం బానే ఉందా.. అని అడిగితే బానే ఉంది.. అని బదులిచ్చాడు. ఇమ్మానుయేల్‌ని హత్తుకొని కట్టప్ప.. చంపేశావ్ కదా అమరేంద్ర బాహుబలిని.. మహేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్ప.. చలో గుడ్ గేమ్ ఇమ్మానుయేల్ వెరీ గుడ్ గేమ్.. అని భరణి అన్నారు.
Read Also: Bigg Boss: నీ ఇంటి నెంబర్ తో సహా తెలుసు.. దమ్ముకు దువ్వాడ వార్నింగ్..!
సంజనను నామినేట్ చేసిన భరణి
భరణి వచ్చి సంజన గారు మిమ్మల్నే నేను నామినేట్ చేస్తున్నాను.. మీరు రూల్స్ మాట్లాడతారు కానీ మీరే బ్రేక్ చేస్తారు అని భరణి సంజనను నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆతర్వాత దివ్యకు కాకుండా నిఖిల్ కు కత్తి ఇచ్చాడు భరణి. భరణి వెళ్లగానే కిచెన్‌లో దివ్య ఏడుపు స్టార్ట్ చేసింది..ఇమ్మూ ఓదార్చాడు. నెక్స్ట్ డే హౌస్‌లోకి భరణి-శ్రీజ రీఎంట్రీ ఇచ్చారు. భరణి, శ్రీజ హౌస్ లోకి రావడంతో హౌస్ మేట్స్ మధ్య పెద్ద చర్చే జరిగింది. లొల్లి జరిగింది.
Read Also: Bigg Boss Fame: సీక్రెట్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ పెళ్లి.. నిజం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!
నామినేషన్స్ లో 8 మంది..
ఇక దీంతో, ఎనిమిదో వారం నామినేషన్స్ లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నిలిచారు. కళ్యాణ్, రాము, డీమాన్ పవన్, గౌరవ్, సంజన, తనూజ, మాధురి, రీతూ చౌదరి ఈ లిస్ట్ లో నిలిచారు. అయితే, వీరిలో అందరికి ఎంతో కొంత బయట ఫ్యాన్ బేస్ ఉంది. కానీ గౌరవ్, మాధురీలకు మాత్రం అంతగా ఆదరణ లేదు. అయితే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ వారం కూడా తనూజ టాప్ లో దూసుకుపోతుంది. ఇక డీమాన్ పవన్, రీతూ చౌదరి లాస్ట్ లో ఉన్నారు. అలాగే మాధురి కూడా ఓటింగ్‌లో లాస్ట్ లో ఉంది.. ఈ ముగ్గురిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ ముగ్గురి నుంచి ఒకరు బయటకు వచ్చేస్తారు. అయితే, ఓటింగ్ ప్రకారం రీతూ లేదా మాధురి బయటకు వచ్చే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది.


