Bigg Boss Fame: నటి శోభా శెట్టి అంటే ఎవరికీ తెలీదు. కానీ, కార్తీకదీపం మోనిత అంటే ఆమెని ఇట్టే గుర్తుపట్టేస్తారు. శోభాశెట్టి పేరుకు కన్నడ నటే అయినా తెలుగు ఆడియెన్స్ కు ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయం. ‘అగ్నిసాక్షి’ సీరియల్‌తో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల తార కార్తీక దీపంతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అందులో మోనిత పాత్రలో తన విలనిజంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా తెలుగు ఇండస్ట్రీలో మరింతగా ఫేమస్ అయ్యింది. ఇదే ఊపుతో గతేడాది కన్నడ బిగ్ బాస్ 11లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ, అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఈ రెండు రియాలిటీ షోస్ లోనూ విజేతగా నిలవనప్పటికీ తన అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.
Read Also: Surya Kumar Yadav: అరుదైన రికార్డు.. హిట్ మ్యాన్ సరసన సూర్యా భాయ్
నటుడితో ప్రేమలో..
ఇక, ప్రొఫెషనల్ విషయం పక్కన పెడితే శోభా శెట్టి, నటుడు యశ్వంత్ రెడ్డి ప్రేమలో ఉన్నారు. కార్తీక దీపం సీరియల్ లో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ మొదలైంది. తెలుగు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది శోభ. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. గతేడాది ఏప్రిల్ లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది ఎంగేజ్మెంట్ యానివర్సరీ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారీ లవ్ బర్డ్స్. కాగా పెళ్లి గురించి అడిగినప్పుడు ఈ ఏడాదే చేసుకుంటామని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది శోభా శెట్టి. ఈ నేపథ్యంలో తన పెళ్లిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇప్పుడు శోభా శెట్టి పెళ్లి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిలో పెళ్లి దుస్తుల్లో శోభ, యశ్వంత్ రెడ్డి నూతన వధూవరుల్లా కనిపించారు. ఇద్దరూ తలంబ్రాలు కూడా పోసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. కొందరు నెటిజన్లు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.
Read Also: IND vs AUS: స్కై సూపర్ సిక్సర్.. టీ20ల్లో 150వ సిక్స్ కొట్టిన విధ్వంసకర బ్యాటర్
పెళ్లి దుస్తుల్లో తళుక్కుమన్న శోభ
అయితే శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డి పెళ్లిబట్టల్లో ఉన్న రీల్ వైరల్ కాగా.. వారిద్దరూ నిజంగా పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. ఓ జువెల్లరీ బ్రాండ్ యాడ్ షూట్ కోసం వీరు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు నిజంగా పెళ్లెప్పుడు చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మరి వీళ్లిద్దరూ పెళ్లెప్పుడు చేసుకుంటారో తెలియాల్సి ఉంది.
View this post on Instagram


