Rohith Trigun Clash: బిగ్ బాస్ ఇంట్లో మొదటి రోజే కంటెస్టెంట్ల మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. ముఖ్యంగా రోహిత్, త్రిగుణ్ మధ్య జరిగిన పరిణామాలు ఎపిసోడ్‌లో ప్రధానంగా కనిపించాయి. మ్యాజికల్ కీ కోసం ఇద్దరిని ఎంపిక చేసే సమయంలోనే వీరి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత కూడా రోహిత్ చేసిన పనులను త్రిగుణ్ పదే పదే ప్రస్తావిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రెచ్చిపోయారు.
ఇంట్లోకి వచ్చిన 16 మంది ఇంకా పూర్తిస్థాయి హౌస్ మేట్స్ కాలేదని బిగ్ బాస్ తేల్చిచెప్పేశాడు. ఈ వారం మొత్తం మహా పరీక్ష ఉంటుందని, నామినేషన్స్ లేకపోయినా ఎలిమినేషన్ అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పాడు. ఇప్పటికే ఎనిమిది మందికి మ్యాజికల్ కీస్ లభించగా, మరో ఇద్దరిని ఎంపిక చేయాల్సి వచ్చింది. పెద్ద రచ్చ ,చర్చ అనంతరం వంశీ, కృష్ణుడు ఆ అవకాశాన్ని దక్కించుకున్నారు.
బిగ్ బాస్ ఇచ్చిన వాటర్ టాస్క్‌లో రోహిత్ పాల్గొనకపోవడాన్ని కొందరు ప్రస్తావించారు. ఇదే విషయాన్ని త్రిగుణ్ కూడా ఇతరుల ముందు చెప్పడంతో మరోసారి చర్చ మొదలైంది. నిర్ణయాల విషయంలో సుధీర్, వర్షిణి మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. మరోవైపు షాలినీ, త్రిగుణ్ మధ్య కిచెన్‌లో కర్రీ విషయంలో చిన్న గొడవ జరిగింది.
మ్యాజికల్ కీస్ ద్వారా వచ్చిన ప్రత్యేక అధికారాలను బిగ్ బాస్ ఒక్కొక్కరికి వివరించాడు. త్రిగుణ్‌కు టేక్ ఓవర్ పవర్ లభించగా, ఝాన్సీకి ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే అవకాశం వచ్చింది. ముఖేష్‌కు పవర్ రివర్స్ చేసే అవకాశం దక్కింది. వర్షిణికి గ్రాబ్ ఎనీ విన్, కృష్ణుడికి స్వాప్, శాలినీకి డ్యూటీ అసైన్, శ్రిష్టికి డైరెక్ట్ నామినేషన్, రాం ప్రసాద్‌కు సేఫ్ షీల్డ్, నరేష్‌కు డబుల్ ఓట్స్ పవర్ లభించాయి.
చివరగా రెండు టీమ్‌లకు నాయకులను ఎంపిక చేయాలని బిగ్ బాస్ సూచించాడు. అగ్ని పరీక్ష నుంచి వచ్చినవారిలో ఎక్కువమంది రోహిత్‌కు మద్దతు ఇవ్వగా, సెలెబ్రిటీలు రాం ప్రసాద్, త్రిగుణ్ వైపు నిలిచారు. చివరికి రాం ప్రసాద్ బ్లూ టీమ్‌కు, రోహిత్ రెడ్ టీమ్‌కు నాయకులుగా ఎంపికయ్యారు. దీంతో తొలిరోజు ఎపిసోడ్ ముగిసింది.
Also Read:Lord Ganesha: ఆ గణపయ్య 32 రూపాల గురించి మీకు తెలుసా?

