Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss: నిలిచిపోయిన బిగ్ బాస్ షో.. బయటకు వచ్చేసిన కంటెస్టంట్లు

Bigg Boss: నిలిచిపోయిన బిగ్ బాస్ షో.. బయటకు వచ్చేసిన కంటెస్టంట్లు

Bigg Boss: హోరాహోరీగా సాగుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు దెబ్బ పడింది. బిగ్ బాస్ మేకర్స్ కు గట్టి షాక్ తగిలింది. బిగ్ బాస్ సెట్ ను రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసింది. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్లను బయటకు పంపించేశారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. దీంతో, ఈ పాపులర్ షో కన్నడ సీజన్ కు బ్రేక్ వచ్చింది. ఈ సీజన్ లో ఉన్న బిగ్ బాస్ హౌస్ ను సీజ్ చేశారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో కర్ణాటక ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇప్పుడిది కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

బిగ్ బాస్ 12 కన్నడలో ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ కన్నడలో 12వ సీజన్ సెప్టెంబర్ 28న ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ కు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ వీక్ నడుస్తోంది. ఇంతలోనే బిగ్ బాస్ హౌస్ కు సీజ్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ హౌస్ లోని కంటెస్టెంట్లను బయటకు పంపించి అధికారులు సీజ్ వేశారని తెలిసింది. ఈ బిగ్ బాస్ హౌస్ సెట్ బెంగళూరులోని జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్ లో ఉంది. అయితే ఆ హౌస్ నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేయకుండానే బయట డ్రైనేజీలో కలిపేస్తున్నారని తెలిసింది. ఈ కారణంతోనే కర్ణాటక కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు వెళ్లి ఆ హౌస్ ను సీజ్ చేశారు.

Read Also: Bigg Buzz: శివాజీ కాబట్టి కంట్రోల్ లో ఉన్నా.. రేఖలు మొత్తం ఊడగొట్టేవాడ్ని.. హరిత హరీష్ వైల్డ్ కామెంట్స్ వైరల్

రూల్స్ ఏం చెప్తున్నాయి?

కాలుష్య నియంత్రణ చట్టాల ప్రకారం తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని అనుమతులను ఆ స్టూడియో మేనేజ్ మెంట్ తీసుకోలేదని తెలిసింది. దీంతో పాటు మురుగు నీరు శుద్ధి చేయకుండా బయటకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక పర్యావరణ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు వెంటనే స్టూడియో కార్యకలాపాలను ఆపేయాలని నోటీసులు ఇచ్చారు. మరోవైపు రామనాగర జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆ హౌస్ ఉన్న సెట్ ను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంకో వైపు పవర్ కట్ చేయాలని కూడా ఆదేశాలు వచ్చాయి.

కలర్స్ కన్నడ

బిగ్ బాస్ 12 కన్నడ సీజన్ కలర్స్ కన్నడ ఛానెల్లో టీవీల్లో ప్రసారమవుతుంది. జియోహాట్ స్టార్ లో ఓటీటీలో చూడొచ్చు. అయితే ఇప్పుడు సడెన్ గా హౌస్ కు సీజ్ వేయడం ఈ సీజన్ కు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఒక ఎపిసోడ్ జియోహాట్ స్టార్ లో లేట్ గా స్ట్రీమింగ్ అయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ను ప్రొడ్యూస్ చేసే ఎండెమాల్ షైన్ సంస్థ కోర్టును ఆశ్రయించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Read Also: Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్ లో లెక్కలు తారుమారు.. లీస్ట్ ప్లేస్ లో టాప్ కంటెస్టెంట్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad