Bigg Boss Promo: గత సీజన్ లో బిగ్ బాస్ లో నాగార్జున హోస్టింగ్ పరమచెత్తగా ఉంది. ఎందుకొచ్చిన హోస్టింగ్ రా బాబు అంటూ అందరూ తిట్టుకున్నారు. చూసే వాళ్లే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా.. ఆయన మళ్లీ హోస్ట్ చేస్తే అసలు మేం బిగ్ బాస్ మొహమే చూడం అని స్టేట్‌మెంట్‌లు పాస్ చేసేశారు. అంత చెత్తగా ఉంది మరి నాగార్జున హోస్టింగ్. కానీ.. తొమ్మిదో సీజన్‌లో మాత్రం నాగార్జున హోస్టింగ్ ఎలా ఉందని అడిగితే.. మాటల్లేవ్ అంతే. పర్ఫెక్ట్ హోస్ట్ మెటీరియల్ అంటే ఈయనే. ఇది కదా.. జనం కోరుకున్నదీ.. ఇది కదా కింగ్ నుంచి జనం ఆశించింది. ఈ వాడీ వేడీ ఇన్నాళ్లూ ఏమైపోయింది ‘బాసూ’ అనేట్టుగా సాగుతుంది నాగార్జున హోస్టింగ్. ఇక ఇప్పుడు ఆయన హోస్టింగ్ లో చాలా మార్పు వచ్చింది. గేమ్ ఫాలో అయి హోస్టింగ్ చేస్తున్నట్లు పక్కాగా కన్పిస్తుంది. హోస్టింగే కాదు.. ఆయన లుక్స్ లోనూ మార్పు కన్పిస్తుంది. ఫుల్ స్టైలిష్ గా కన్పిస్తున్నారు. ఇక, ఈ వారం మరింత హ్యాండ్సమ్ గా కన్పిస్తున్నారు.
రీతూ, డీమాన్..
బిగ్ బాస్ అంటేనే లవ్ ట్రాకులు, గొడవలు. అయితే, ప్రతి సీజన్ లో హౌస్ లో రెండు, మూడు ప్రేమ జంటలున్నాయి. అయితే, ఆ లోటుని ఈ సీజన్ లో రీతూ చౌదరి ఫుల్ ఫిల్ చేసింది. ఇద్దరు కళ్యాణ్ లను కవర్ చేసింది. కానీ, ఇప్పుడు ఓ కళ్యాణ్ తనూజవైపు మళ్లగా.. రీతూ, డీమాన్ చెలరేగిపోతున్నారు. అయితే, వాళ్లని ఎప్పుడెప్పుడు రఫ్పాడిస్తాడా నాగార్జున అని జనం ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే, నాగ్ ఒక్కొక్కరి తాట తీస్తున్నారు. నో ఫేవరేటిజం, తప్పు చేసినోడు ఎవరైనా తాట తీయాల్సిందే అన్నట్లుగా ఊరమాస్ అవతార్ లో కన్పిస్తున్నారు. ఇవాళ్టి ఎపిసోడ్ కి సంబంధించి ఫస్ట్ ప్రోమోలో భరణి, తనూజలకు క్లాస్ పీకితే.. ఈ రెండో ప్రోమోలో ప్రేమ జంట రీతూ, డీమాన్ పవన్‌లకు వాచిపోయింది. ఆ వివరాలపై లుక్కేద్దాం.
Read Also: Bigg Boss Written Updates: అంతా అయిపోయాక సారీ చెప్తే ఏమొస్తుంది.. పాపం తింగరి తనూజ పరిస్థితి ఏంటో?
బెలూన్ టాస్క్ విషయంపై
బెలూన్ టాస్క్‌లో అడ్డదారిలో గెలవాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోవడమే కాకుండా.. థౌజంట్ పర్సెంట్ నేను అలా చేయలేదు అంటూ బొంకేసింది రీతూ చౌదరి . అయితే, ఇప్పుడు వీడియో చూపించి మరీ బొమ్మ చూపిస్తున్నారు నాగార్జున. బెలూన్ టాస్క్‌లో ఎంత బ్రిలియంట్ ఐడియా వచ్చింది రీతూ నీకూ?? ఊదుతూ గాల్లో ఉంచాలి చెప్తే.. కార్నర్‌లో ఉంచితే అది గాల్లో ఉన్నట్టా? నిన్ను చూసి మిగతా వాళ్లు కూడా అదే చేశారు. అందర్నీ చెడదొబ్బావ్ అని నాగార్జున రీతూ చేసిన కక్కుర్తి పనిని ప్రశ్నించారు. అయితే ఈ మహానటి అమాయకురాలిగా ఫేస్ పెట్టి.. సంచాలక్‌గా ఉన్న ఇమ్మానుయేల్‌పైకి నెట్టేసింది. నిజానికి ఆరోజు వాళ్లు చెప్తూనే ఉన్నారు. రాము రాథోడ్ అయితే ఫౌల్ గేమ్ అని.. వీకెండ్‌లో నాగార్జున వచ్చిన ప్పుడు చెప్తారని కూడా అన్నారు. అప్పుడు కూడా.. అబ్బే నేను అలా చేయలేదు.. థౌజంట్ పర్సెంట్ పర్ఫెక్ట్‌గా ఆడానంటూ దొంగ ఆట ఆడింది రీతూ. నువ్వు సైడ్ నుంచి వేసేశావ్ అని చెప్పినా కూడా.. లేదూ అది నా హైట్ అడ్వాంటేజ్ ఇలా పెట్టానంతే అని ఆమె చేసిన కక్కుర్తి పనిని కళ్లకి కట్టాడు ఇమ్మానుయేల్.
సుమన్ శెట్టి దగ్గరకు వెళ్లి..
సుమన్ శెట్టి దగ్గరకు వెళ్లి.. శ్రీజాతో ఎందుకు పెయిర్ అయ్యావ్ అని చిచ్చుపెట్టింది రీతూ చౌదరి. అదే విషయాన్ని నాగార్జున ప్రస్తావిస్తే.. అబ్బే నాకది గుర్తు లేదు సార్ అని తనకి అలవాటైన పద్దతిలో చెప్పుకొచ్చింది. దాంతో నాగార్జున నీకు కట్ అయ్యింది హెయిర్ మాత్రమే.. మెమొరీ కాదు అంటూ ఇచ్చిపడేశారు. ఆ తరువాత ‘పవర్ అస్త్ర’ని ప్రవేశపెట్టారు నాగార్జున. అదే ఇప్పుడు కంటెస్టెంట్స్‌కి ఆయుధంగా మారబోతుందని తెలుస్తోంది.


