Bigg Boss New Promo: బిగ్ బాస్ వీక్ డేలో ఉండే ఫ్యాన్స్ కంటే వీకెండ్ ఉండే ఫ్యాన్ బేస్ సపరేటు. శనివారం వచ్చిందంటే నాగార్జున వాయింపు కోసం ఎదురుచూసే బిగ్ బాస్ ఆడియన్స్ చాలామంది ఉంటారు. ఇక శనివారం ఎపిసోడ్ ప్రోమోకి బీభత్సమైన క్రేజ్. నాగార్జున వచ్చి ఎవర్ని ఏగుతారని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈశనివారం నాటి ప్రోమో వచ్చేశారు నాగార్జున. అయితే మరి షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదో ఏమో కానీ.. జస్ట్ ఇంట్రోనే సరిపెట్టేసిన నాగార్జున.. హౌస్‌లో భరణి వర్సెస్ గుడ్లు దొంగ సంజనాల మధ్య జరుగుతున్న గొడవనే చూపించారు.
Read Also: Japan PM: జపాన్ చరిత్రలో కొత్త అధ్యాయం.. తొలి మహిళా ప్రధానిగా సనై తకైచి..!
తెలుగు టీవీ సీరియల్స్‌లో లేడీ విలన్లు ఉంటారు. వాళ్ల క్యారెక్టర్‌లు ఎలా ఉంటాయంటే.. ఇంట్లో వాళ్లంతా సంతోషంగా ఉంటే అస్సలు తట్టుకోలేరు. ఏదైనా గొడవలు పడుతుంటే రాక్షస ఆనందం పొందుతారు. సంతోషంగా ఉన్నా.. కలిసి తింటున్నా.. ఉంటున్నా.. అస్సలు తట్టుకోలేరు. విషం చిమ్ముతూనే ఉంటారు. బిగ్ బాస్ హౌస్‌లో సంజన క్యారెక్టర్ కూడా సేమ్ అలాగే ఉంది. హౌస్‌లో ఎవరైనా గొడవలు పడుతున్నారంటే.. ఈమె కళ్లల్లో ఆనందం ఓ రేంజ్ లో ఉంటుంది. స్పైడర్ సినిమాలో విలన్ కూడా ఈమె ముందు పనికిరారేమో. పక్కకి వచ్చి మరీ డాన్స్‌లు చేస్తుంటుంది. ఈవారం అయితే ఈమె బిహేవియర్ మరీ వరస్ట్. గతవారమే నాగార్జున హెచ్చరించారు. ఇంట్లో దొంగతనం చేయొద్దు.. ఎదుటి వాళ్ల నోటి కాడిది లాక్కొద్దని. కానీ ఈవారంలో తన వంకరబుద్దిని మళ్లీ చూపెట్టింది సంజన. పాపం హౌస్‌లో వాళ్లంతా తినడానికి గుడ్లు ఉడకబెట్టుకుని ప్లేట్‌లలో అన్నంపెట్టుకునే టైమ్‌లో.. ఆ గుడ్లను దొంగిలించి స్టోర్ రూంకి వెళ్లి తినేసింది. వాళ్ల నోటి కాడిది లాక్కుని తినేసింది. వాళ్లందరి కడుపుకొట్టి రాక్షసఆనందం పొందింది. దీని గురించి హోస్ట్ నాగార్జున వస్తారూ.. అడగడం కాదు.. కడిగిపారేస్తారని అంతా ఎదురుచూశారు. అయితే ఆయనొచ్చారు కానీ.. ఈ విషయం గురించి ప్రస్తావించకుండానే.. సంజన చేసిన కక్కుర్తి పని బయటపడింది.
Read Also: Diwali : అదృష్టం అంటే వీరిదే.. దీపావళి తర్వాత లక్కు మామూలుగా ఉండదు
అయితే, హౌస్‌లో వాళ్లకి టాస్క్ ఇచ్చి.. ఆ టాస్క్‌లో గెలిచినందుకు వాళ్లకి బిర్యానీ థమ్స్ అప్‌లు ఇచ్చారు. వాటిని షేర్ చేసుకుని తింటుంటే.. సంజనకి కడుపు మండిపోయింది. మరి ఈమెకి పెట్టలేదో.. లేదంటే అందరూ తింటున్నారనే కడుపుమంటో ఏమో కానీ.. ఓ పక్క గెలిచిన వాళ్లంతా హ్యాపీగా బిర్యానీ తింటుంటే.. ‘బిగ్ బాస్ నాకు బిర్యానీ తినాలని లేదు.. వాళ్ల బిర్యానీ వాళ్లనే తినమనండి’ అని చిచ్చు పెట్టింది. అందరికీ తినిపిస్తున్న భరణిని పట్టుకుని.. స్వార్థపరుడు అంటూ అతనిపై రంకెలు వేసింది. దాంతో భరణి ఇచ్చిపడేశాడు. ‘ఏం మాట్లాడుతున్నావ్.. గెలిచాం.. గెలిచిన దాన్ని అందరికీ పెడుతుంటే సెల్ఫిష్ అంటావ్ ఏంటీ.. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి?..మీకు వద్దంటే వద్దని చెప్పండి’ అని తిరగబడ్డాడు. దాంతో సంజన.. ‘మీరు నాకు అర్థం కావడం లేదండీ.. అంటూ సింపథీ డ్రామా షురూ చేసింది. ‘నా వైపు గుర్రుగా చూస్తున్నాడు.. అతనుగురాయించి చూస్తే నేను భయపడతానని అనుకుంటున్నారా అంటే.. సిగ్గులేకుండా నోటి నుంచి లాగేసుకుందని చెప్తున్నాడు’ అంటూ రీతూ దగ్గర చెప్తుంది. అయినా భరణి కరెక్టే కదా అన్నాడు.. ‘సిగ్గులేకుండా నోటి నుంచి లాగేసుకున్నది నిజమే కదా.. నిన్నటి ఎపిసోడ్‌లో అందరూ తింటుంటే.. గుడ్లుని దొంగతనం చేసి సిగ్గులేకుండా తినేసింది కదా !


