Bigg Boss New Promo: బిగ్‌బాస్ హౌస్‌లో గుడ్డు మాయం అయ్యింది. ఆ విషయంలో మొత్తం అందరినీ బుజ్జిగాడు బ్యూటీ సంజన హడలెత్తించింది. సైలెంట్‌గా గుడ్డు తినేసి తాను తినలేదని బుకాయించడంతో అటు ఓనర్లు ఇటు టెనెంట్లు బీపీ తెచ్చుకొని ఒకరినొకరు తెగ తిట్టుకున్నారు. ఇక రచ్చ అంతా గడిచాక నేనే గుడ్డు మింగేశా అని సంజన చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. సంజన షాక్ తో హౌస్ లో లెక్కలన్నీ మారిపోయాయి. ఆడియన్స్ అయితే ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి హౌస్ లో ఉండాల్సిందే అని తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే హౌస్‌మెట్స్‌కి మాత్రం సంజన ఎప్పుడు పోతుందురా బాబు అన్నట్లుగా ఉంది. ఎందుకంటే ఒక్క దొంగతనంతో మొత్తం హౌస్‌మెట్స్ అందర్నీ పరుగులు పెట్టించింది. నిన్నటి ఎఫెక్ట్ ఈరోజు ఎపిసోడ్‌లో కూడా గట్టిగానే ఉంది. లేటెస్ట్ ప్రోమోలో సంజన ఇష్యూ గురించి కామనర్ల మధ్య గొడవ జరిగింది. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో కూడా సంజన పెట్టిన చిచ్చుతో కామనర్లు తన్నుకు చచ్చారు. లేటెస్ట్ ప్రోమోలో ప్రియ- మనీష్ మధ్య జరిగిన గొడవ హైలెట్ అయింది.
Read Also: Rithu Chowdary: వస్తువుల్ని కాదు.. మనసుల్ని దొంగతనం చేస్తాం- రీతూ చౌదరి
గుడ్డుపై రగడ..
ఆ అమ్మాయి ఒక్కదాని వల్ల మొత్తం మా టీమ్ మెంబర్స్ అందరూ మెంటల్లీ డిస్ట్రబ్ అయిపోయారు.. అంటూ శ్రష్టి ఫైర్ అయింది. మరోవైపు, సంజన గారికి టూ డేస్ హౌస్‌లోకి నో ఎంట్రీ ఓకేనా.. అంటూ జవాన్ పవన్ కళ్యాణ్ ప్రపోజల్ పెట్టాడు. దీనికి అందరూ ఓకే చెప్పారు. మనీష్ ఓకేనా.. అని హరీష్ అడిగితే మనీష్ డన్ అని కూడా అన్నాడు. అయితే ఆమెకి హౌస్ లోకి ఇక కంప్లీట్ నో ఎంట్రీ.. అంటూ పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇంతలో అందరూ ఓనర్లే కానీ నేను పిలవాలనుకున్నప్పుడు పిలుస్తాను.. అంటూ ప్రియ ట్విస్ట్ ఇచ్చింది. ఈ మాటకి మనీష్‌కి కాలింది. దీంతో ఇది గుర్తుపెట్టుకోండి.. ఇప్పటివరకూ నన్ను అలా ట్రీట్ చేయలేదు.. మీరిద్దరూ ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటున్నారు.. అంటూ ప్రియ, దమ్ము శ్రీజపై ఫైర్ అయ్యాడు మనీష్. నిన్ను పాయింట్ ఔట్ చేయాలంటే చాలా చేయొచ్చు.. అని శ్రీజ రివర్స్ అయింది. నేను కామ్‌గా ఉంటున్నానని నన్ను తొక్కేయడానికి ట్రై చేయకండి.. అంటూ మనీష్ కూడా రెయిజ్ అయ్యాడు.
Read Also: Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోలు హతం
మనీష్ పై ఫైర్..
ఎవరూ కామ్‌గా లేరు.. ఎవ్వరూ తొక్కేయట్లేదు.. అంటూ మనీష్ మీద అటు శ్రీజ ఇటు ప్రియ వాదనకి దిగారు. దీంతో వినండి పిల్ల ప్రియ.. ప్రియ నాకు మాట్లాడాలని లేదు.. మానిటర్‌గా మీరు ఇష్టమొచ్చినట్లుగా మీరు చేసుకోండి ఓనర్‌గా నేను నాకు నచ్చినట్లు చేసుకుంటా.. అంటూ మనీష్ తేల్చి చెప్పాడు. దీంతో నీకు నో చెప్తే ఆ ఆప్షన్ నువ్వు తీసుకోలేవు.. అంటూ ప్రియ కూడా ఫైర్ అయింది. నిన్నటి నుంచి నోటీస్ చేస్తున్నాను ఏదేదో మాట్లాడుతున్నావ్.. నేను ఏదో కామ్‌గా ఉంటున్నా మీరు చెప్పినవన్నీ పడుతున్నా కదా అని వద్దబ్బా వద్దంటున్నా కదా.. అంటూ మనీష్ అయితే ఫుల్ గా రఫ్ఫాడించేశాడు. దీంతో మీరు మమ్మల్ని కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు.. అంటూ ప్రియ, శ్రీజ అన్నారు. ఈ మాట వినగానే కొత్త పాయింట్ ఏంటంటే కంట్రోల్ చేస్తున్నట్లు అనిపించిందా మీకు.. అంటూ హరీష్ అడిగితే అనిపించింది అంటూ శ్రీజ, ప్రియ షాకిచ్చారు. దీంతో, షాక్ అవ్వడం హరీష్ వంతైంది.


