Saturday, November 15, 2025
HomeTop StoriesBigg Boss News promo:  సండే ఫండే ప్రోమో.. గెస్ ద లిరిక్స్ గేమ్.. చిల్...

Bigg Boss News promo:  సండే ఫండే ప్రోమో.. గెస్ ద లిరిక్స్ గేమ్.. చిల్ పిల్ గా హౌస్ మేట్స్

Bigg Boss News promo: బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ తో కామనర్స్ ని హోస్ట్ నాగార్జున వాయించడంతో ఆడియన్స్ అందరూ సాటిస్ఫై అయ్యారు. డీమాన్ కెప్టెన్సీని పీకిపాడేసారు నాగ్. దీంతో, హౌస్ లో రచ్చ జరిగింది. డీమాన్ పవన్, రీతూ చౌదరి, శ్రీజ, ప్రయాకు వాయింపు మాములుగా లేదు. కాగా.. సండే ఎపిసోడ్ లో మొత్తం ఫన్ యాక్టివిటీసే జరిగాయి. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఆ వివరాలేంటో చూద్దాం.

- Advertisement -

Read Also: Bigg Boss Written Updates: డీమాన్ కెప్టెన్సీ రద్దు.. నాగ్ గ్రిల్డ్ ది ఓనర్స్.. దద్దరిల్లిన వీకెండ్ ఎపిసోడ్

తనూజ లవ్ స్టోరీ..

కాగా.. ఆ ప్రోలో నాగార్జున బ్లాక్ ఔట్ ఫిట్ తో హ్యాండ్సమ్ గా కన్పించారు. రాగానే, తనూజ ఏం చేస్తున్నావ్ ఇప్పటి దాకా కిచన్ లో.. అని నాగ్ అడిగారు. దాంతో, తనూజ.. ప్లీజ్ సార్ నాకొక చిన్న డబ్బా కాఫీ పౌడర్ ఇప్పించాలని కోరింది. దీంతో, నాకొక చిన్న సీక్రెట్ చెప్తే.. అని నాగ్ అనగానే.. అమ్మో నాకు నేనే ఇరుక్కున్నాను అని తనూజ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తన క్రష్ గురించి మాట్లాడింది. నాకంత ఈజీగా క్రష్ అనేది, లవ్ అనేది అవ్వదు అని తనూజ అనగానే.. ఓకే అని ఇంకా చెప్పమన్నారు. నా అని చెప్తూ ఫుల్ గా బ్లష్ అయ్యింది. నేనో పర్సన్ ని కాఫీ షాప్ లో కలిసానని చెప్పుకొచ్చింది. దానికి ఇమ్మూ రెస్పాన్స్ చూసి నాగ్ ఇంకా మాట్లాడారు. ఇమ్మూ నువ్వు ఫోన్లో మాట్లాడిన రమేష్ గురించి కాదు మ్యాటర్.. అని అనగానే.. అందరూ నవ్వారు. తనూజ రమేష్ ఎవరూ అని అడగానే.. నాగ్ ఫోన్లో మాట్లాడుతూ.. ముద్దులు పెట్టినట్లు యాక్టింగ్ చేశారు.

Read Also: Bigg Boss Written Updates: అన్నిట్లో థు థు థు అని వస్తున్నావ్’ శ్రీజపై నాగ్ ఫైర్

గెస్ ద లిరిక్స్ కాంపిటీషన్

ఫన్ టాక్స్ అయిపోయాక నాగ్ ఓనర్స్ కి టెనెంట్స్ కి మధ్య కాంపిటీషన్ పెట్టారు. గెస్ ద లిరిక్స్ అంటూ ఓ కాంపిటీషన్ పెట్టారు.  ఏ టీం గెస్ చేస్తే వాళ్లు బెల్ కొట్టాలని.. బిగ్ బాస్ సాంగ్ ప్లీజ్ అని నాగ్ చెప్పారు. దీంతో, జల్సా సినిమాలోని జెనిఫర్ లోపేజ్ పాటను ప్లే చేశారు. కాగా.. ఇమ్మూ ఫస్ట్ బెల్ కొట్టి లిరిక్స్ చెప్పాడు. ఆ తర్వాత శ్రీజ కూడా లిరిక్స్ చెప్పింది. జీన్స్ ప్యాంటు వేసుకున్న జేమ్స్ బాండ్ లా అని శ్రీజ అని గానే.. ఇమ్మూ ఫన్ క్రియేట్ చేశారు. దీంతో, శ్రీజ జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు చాలా మంది పాడేవారు అని నాగ్ అనగానే.. మూతి ముప్పై వంకర్లు తిప్పి తెగ సిగ్గుపడిపోయింది. ఆ తర్వాత మరో సాంగ్ ప్లే చేశారు. దానికి ఇమ్మూ, డీమాన్ పోటీ పడ్డారు. మరో సాంగ్ వద్దురా సోదరా పెళ్లంటే వద్దు అనే సాంగ్ రాగానే.. ఇమ్మూ లిరిక్స్ ని కరెక్ట్ గా గెస్ చేశాడు. ఆ తర్వాత అందరూ.. డోంట్ వర్రీ బీ హ్యాపీ అనే పాటకు డ్యాన్స్ చేశారు. దీంతో నాగ్ అందరూ డ్యాన్స్ చేశారు కానీ, నాకు సుమన్ ఎక్స్ ప్రెషన్ నచ్చిందని నవ్వారు. అయితే, ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం మనీష్ హౌస్ నుంచి ఔట్ అయినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad