Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో ఈక్వేషన్స్ ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు. ఎవరు ఎప్పుడు గొడవ పడతారో కూడా చెప్పలేం. బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్లు పొట్టుపొట్టు తిట్టుకున్న సందర్భాలు, బద్ధశత్రువులు కలిసి ఆడిన దాఖలాలు ఉన్నాయి. ఇక సీజన్-9లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రియ-దమ్ము శ్రీజ కలిసే ఉన్నారు. ఇద్దరూ కలిసి ఇటు మిగిలిన కామనర్లు అటు సెలబ్రెటీలపై నోరేసుకొని పడిపోయేవారు. దీంతో వీళ్లకి ఆడియన్స్ శాకినీ-డాకినీ అంటూ పేర్లు కూడా పెట్టారు. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. ఫ్యామిలీ నుంచి వచ్చిన మెసేజ్‌లు, వస్తువులు పొందేందుకు బిగ్‌బాస్ ఓ టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే. బ్లూ గ్రూప్‌కి సంబంధించిన వాళ్లు గంట సౌండ్ వచ్చినప్పుడు బజర్ కొట్టాల్సి ఉంటుంది. ఎవరైతే ముందుగా బజర్ కొడతారో వాళ్లకి ఫ్యామిలీ మెసేజ్‌లు పొందే ఛాన్స్ ఇస్తారన్నమాట.
Read Also: Bigg Boss Today Promo: అయ్యో పాపం.. సుమన్ శెట్టిని ఏడ్పించిన బిగ్ బాస్
ఇందులో భాగంగా చివరికి ప్రియ, సుమన్ శెట్టి, సంజన మిగిలారు. ఇక బజర్ కొట్టేందుకు ముగ్గురూ పరిగెత్తగా ప్రియ ముందు బజర్ కొట్టింది. కానీ ఫస్ట్ సంజన గారు పెట్టారు.. అంటూ సంచాలక్‌గా ఉన్న శ్రీజ చెప్పింది. ఇది వినగానే వాట్ నేను ప్రెస్ చేశా.. అంటూ ప్రియ వాదించింది. సంజన గారు అయితే ఫస్ట్ బటన్ టచ్ చేశార్రా.. అని శ్రీజ మళ్లీ చెప్పేసరికి ప్రియకి మైండ్ బ్లాక్ అయింది. దీంతో శ్రీజ శ్రీజ సంజనగారికి ఇచ్చేయరాదా.. ఈ మూమెంట్ ఇలా పాడుచేసుకోవడం ఎందుకు.. అంటూ ప్రియ చెప్పేసింది.
Read Also: Bigg Boss Telugu 9: అప్పుడేమో రన్నరప్.. ఇప్పుడు కప్పు కోసమే.. మళ్లీ బిగ్‌బాస్‌లోకి హీరో ఎంట్రీ?
థూ అని ఊసేసిన ప్రియ
కానీ ముందు సంజన పేరు చెప్పిన శ్రీజ తర్వాత మాత్రం లేదు బిగ్‌బాస్ నేను ప్రియని సెలక్ట్ చేస్తున్నాను.. అంటూ ప్లేట్ తిప్పింది. ఇదంతా చూసి ప్రియకి ఏడుపు వచ్చింది. ప్రియని ఓదార్చేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లాడు. మరోవైపు శ్రీజ మీ ఆఖరి నిర్ణయం ఏంటో చెప్పండి.. అని బిగ్‌బాస్ అడిగితే ప్రియ అంటూ శ్రీజ చెప్పింది. దీంతో ఈ పిల్ల వినదా.. ఈ పిల్లకైనా ఉండాలి కదా కొంచమైనా.. అంటూ కళ్యాణ్ దగ్గర ప్రియ నిప్పులు చెరిగింది. డీమాన్ వచ్చి సద్ది చెప్పడానికి చూస్తే నాకే నేను వద్దంటున్నా కదా.. అంటూ ప్రియ అరిచింది. ఇంతలో ప్రియ సంచాలక్‌గా నువ్వు నన్ను అన్‌ఫెయిర్ చేయమంటున్నావ్.. అంటూ శ్రీజ వచ్చి వాదించింది. దీంతో నాకు నీతో వాదించే ఓపిక కూడా లేదు.. అని ప్రియ అంటే మాట్లాడకు అయితే అంటూ శ్రీజ కౌంటర్ ఇచ్చింది. దీంతో థూ.. అంటూ ఊసింది ప్రియ. వెంటనే అది నీకంటే ఎట్లా ఉంటదో కూడా ఆలోచించుకో.. అంటూ శ్రీజ సీరియస్ అయింది. ఇలా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.


