Sunday, November 16, 2025
HomeTop StoriesBigg Boss Written Updates: ఎవరు ఏంటో అర్థం చేసుకో.. ఇప్పటికైనా కళ్లు తెరువు.. తనూజకు...

Bigg Boss Written Updates: ఎవరు ఏంటో అర్థం చేసుకో.. ఇప్పటికైనా కళ్లు తెరువు.. తనూజకు నాగ్ సలహా

Bigg Boss Written Updates: బిగ్ బాస్ గత ఎపిసోడ్ లు వేరు.. ఈ ఎపిసోడ్ లు వేరు.. అప్పటి నాగార్జున వేరు.. ఇప్పుడున్న నాగ్ వేరు.. అక్టోబర్ 11 ఎపిసోడ్ చూస్తే చాలా మందికి అదే అన్పించింది. ఒక్కొక్కరి సినిమా చూపించారు. ప్రోమోలో నాగార్జునని మమ మాస్ అని చూపించాడు కానీ.. నేటి (అక్టోబర్ 11) 35వ ఎపిసోడ్‌లో మాత్రం ‘చిట్టిచిలకా.. చిన్ని మొలకా’ అనే పాటతో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. స్టైలిష్ లుక్‌లో మాత్రం కింగ్‌లా ఉన్నారు నాగార్జున. మన టీవీలో హౌస్‌లో ఏం జరుగుతుందో చూద్దాం అంటూ భరణి, తనూజల ముచ్చట్లను చూపించారు. నీ గురించి నువ్వు ఆడు.. ఇది నా గేమ్ నాకు నచ్చినట్టు నేను ఆడతాను. నీకు కొన్ని నిజాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఎప్పటిలాగే ఉండు కానీ.. గేమ్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నీకోసం నువ్వు ఆడు. నీకు ముందు నుంచి ఎవరు సపోర్ట్ చేశారో ఆలోచించు. నీకు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటో నీకు తెలియాలి కదా.. అందుకే చెప్తున్నా’ అని కూతురి నచ్చజెప్పారు భరణి. ఆ తరువాత ప్రతివారం లాగే.. స్పాన్సర్ టాస్క్ జరిగింది. ఈ పూరీ ఛాలెంజ్‌లో తనూజ టీం గెలిచింది.

- Advertisement -

అల్లాడించిన ఎన్ఆర్ఐ

ఆ తరువాత.. ఆడియన్స్‌తో మాట్లాడారు నాగార్జున. ఇక యూకే నుంచి వచ్చిన తెలంగాణ అమ్మాయి శ్రుతి అయితే అల్లాడించేసింది. వీకెండ్‌లో మీరు వచ్చి వాళ్లని తిడుతుంటే నాకు మస్త్‌గా అనిపిస్తుంది అని చెప్పింది. తన ఫేవరేట్ ఇమ్మానుయేల్ అని.. నచ్చనిది భరణి అని చెప్పింది. బంధాలు పెట్టుకుని తనతో ఎవరు బావుంటే వాళ్లతో క్లోజ్‌గా ఉంటున్నారు.. బంధాలు పెట్టుకోని వాళ్లతో తోసేస్తున్నారు. మొన్నటి గేమ్‌లో శ్రీజాని కూడా అలాగే తోసేశారు. అది నాకు నచ్చలేదు అని చెప్పింది. ఆ తరువాత ఇంటి సభ్యులతో మాట్లాడారు నాగార్జున. కొత్త కెప్టెన్ కళ్యాణ్‌ని అభినందించారు నాగ్. అసలు నువ్వు ఉంటావో లేవో అనుకున్నా.. ఇప్పుడు కెప్టెన్ అయ్యి గోల్డెన్ స్టార్ తీసుకున్నావ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు నాగ్. ఈ స్టార్ నేను కాదు.. తనూజ పెడితే బావుంటుంది సార్ అని అన్నాడు ఇమ్మూ. దాంతో నాగ్.. తనూజ రామ్మా.. కళ్యాణ్‌కి గోల్డెన్ స్టార్ పెట్టు అని అన్నారు. దాంతో తనూజ వచ్చి గోల్డెన్ స్టార్ పెడుతుంటే.. హ్యాపీనా అని అన్నాడు పులిహోర రాజా కళ్యాణ్. వీడు మాత్రం తనూజతో పులిహోర కలపడానికి అస్సలు గ్యాప్ ఇవ్వడమే లేదు.

Read Also: Bigg Boss Promo: నీకు హెయిర్ మాత్రమే.. మైండ్ కూడా దొబ్బింది.. రీతూని ఏకి పారేసిన నాగ్..

కన్ఫెషన్ రూంకి తనూజ

ఆ తరువాత తనూజని కన్ఫెషన్ రూంకి పిలిచి పర్సనల్‌గా మాట్లాడారు నాగార్జున. నువ్వు కూడా గోల్డెన్ స్టార్ గెలుచుకున్నావ్. కెప్టెన్సీ టాస్క్‌కి సంబంధించిన వీడియో ఒకటి చూపిస్తున్నా.. అది మనిద్దరి మధ్యనే ఉండాలి అంటూ డీమాన్ పవన్ చేసిన చెత్తపనిని వీడియోలో చూపించారు నాగ్. వీడియో చూశావ్ కదా.. అందులో నీకు ఏ కనిపించింది అని తనూజని అడిగారు నాగ్. అతను కాలితో ఎటు వైపు లైట్ వెలిగిందో కళ్యాణ్‌కి చూపిస్తున్నాడు సార్ అని అన్నది. దాంతో నాగార్జున.. కరెక్ట్‌గా చెప్పావ్. నువ్వు నాన్నా నాన్నా అని బంధం పెంచుకున్న భరణి లైట్ ఆఫ్ చేశాడు అని డెమాన్ పవన్ క్లియర్‌గా కళ్యాణ్‌కి చూపించాడు. కళ్యాణ్ అందుకే చాలా టైమ్ తీసుకున్న తరువాత కళ్యాణ్ లైట్ ఎవరిది ఆరిందో చెప్పాడు. ఈ విషయం నీకు పవన్ కానీ, కళ్యాణ్ కానీ చెప్పారా? అని అడిగారు నాగ్. లేదు సార్ వాళ్లు చెప్పలేదు అని అన్నది తనూజ. గెలవడం ముఖ్యమే తనూజా.. ఎలా గెలిచాం అనేది ముఖ్యం. నీ గెలుపు ఎలా వస్తుందో తెలుసుకో.. ఎవరు ఏంటో మర్చిపోకు. నీ ఆటని దీన్ని బట్టి మార్చుకో’ అని అంటూ తనూజకు నాగార్జున హితబోధ చేశారు. ఆ తరువాత తనూజకి గోల్డెన్ స్టార్ ఇచ్చారు. ఎవరితోఅయినా పెట్టించుకుంటావా? అంటే.. ‘నాకు నేను పెట్టుకుంటా సార్’ అని తన గోల్డెన్ స్టార్‌ని తనే పెట్టుకుంది తనూజ. ఆ తరువాత బెడ్ టాస్క్‌లో తనూజ చేసిన మిస్టేక్‌ని గుర్తు చేశారు. ఆ తరువాత దివ్య నిఖితకి కూడా గోల్డెన్ స్టార్ ఇచ్చేశారు నాగార్జున. ఇమ్మూతో ఆ స్టార్‌ని పెట్టించారు.

భరణికి గోల్డెన్ స్టార్ ఇస్తూ..

ఇక, భరణికి గోల్డెన్ స్టార్ ఇస్తూ.. ఎవరితో పెట్టించుకుంటావ్ అని అడిగితే.. క్షణం ఆలస్యం చేయకుండా దివ్య పేరు చెప్పాడు భరణి. దాంతో నాగ్.. ‘తనూజా’ అని పిలిచి.. నువ్వు ఫీల్ అవుతావ్.. మీ నాన్న దివ్యతోనే గోల్డెన్ స్టార్ పెట్టించుకున్నారు చూశావా? అని ఫిటింగ్ పెట్టేశారు. తనూజకి నవ్వాలో ఏడ్వాలో తెలియక నవ్వేసింది. బెడ్ టాస్క్‌లో శ్రీజాని తోసేయడం కరెక్టా? డెమాన్ పవన్‌తో జరిగిన తోపులాటలో ఎవరు కాలు ముందుకు పెట్టారు? అని అడిగారు. ఈ రెండు విషయాల్లో నాదే మిస్టేక్ సార్.. స్వార్ధంగా ఆలోచించాను అని ఒప్పుకున్నాడు. దాంతో నాగార్జున.. ‘ఎంతో ఎదగాల్సిన నువ్వు పడ్డది బెడ్ పై నుంచి కాదు.. మా దృష్టిలో నుంచి కూడా కిందికి పడ్డావ్ అని చురక వేశారు. ఆ తరువాత పవన్, భరణిల వీడియో చూపించి సంచాలక్‌గా ఉన్న ఫ్లోరాకి క్లాస్ పీకారు. చూడు భరణీ.. ధర్మరాజు ఎన్ని తప్పులు చేస్తున్నాడో నువ్వు కూడా అన్ని చేస్తున్నావ్. మంచి ప్లేయర్ ముందుకెళ్లాలి కానీ.. మనకి నచ్చిన ప్లేయర్ కాదు.. అలాంటప్పుడు శ్రీజా ముందుకు వెళ్లాలి కదా. నీవల్ల ఆమె వెళ్లలేకపోయిందంటే అది నీ మిస్టేక్ వల్లే కదా. నువ్వు ఆడిన తీరు తప్పు. వారంతో తప్పులు చేసి.. వీకెండ్‌లో ఒప్పుకుంటే కుదరదు.

Read Also: Bigg Boss Elimination: ఫ్లోరా షైనీ ఔట్.. లవ్ బర్డ్స్ కి విరహం తప్పదా? సీక్రెట్ రూంలోకి వాళ్లిద్దరిలో ఒకరు

రాము రాథోడ్ కు చప్పట్లు..

ఇక, రాము రాథోడ్‌ని నాగ్ ఆకాశానికి ఎత్తేశారు. రాముని లేపి చప్పట్లు కొట్టారు నాగ్. కెప్టెన్‌గా ఇరగ్గొట్టావ్. సంచాలక్‌గా ప్రతి నిర్ణయం కరెక్ట్‌గా తీసుకున్నావ్. అందరితో మంచిగా పనులు చేయించావ్. నాకైతే ఇప్పటి వరకూ ఈ హౌస్‌కి నువ్వే బెస్ట్ కెప్టెన్ నువ్వే అంటూ ఆకాశానికి ఎత్తేశారు నాగ్. ఆ తరువాత గోల్డెన్ స్టార్ ఇచ్చారు నాగార్జున. ఆటలో ఫౌల్ జరుగుతుందని తెలిసినప్పుడు నువ్వు గట్టిగా చెప్పు.. నువ్వు అనుకున్నదానికి నిలబడు. నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో మర్చిపోకు.. ఎక్కడ వరకూ వచ్చావో మర్చిపోకు అని విలువైన సలహా ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad