Bigg Boss: దేశవ్యాప్తంగా ఇప్పుడు బిగ్ బాస్ హవా నడుస్తోంది. బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షో గా బిగ్ బాస్ కు పేరుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. లవ్ ట్రాక్స్, స్ట్రాటజీలు, గేమ్స్ ఇదంతా ఆడియన్స్ ని విశిష్టంగా ఆకట్టుకుంటుంది. అయితే, సాయంత్రం అయితే చాలు షో టైమ్ కి ఇంటిల్లిపాది టీవీల ముందు వాలిపోతున్నారు. లేటెస్ట్ గా బిగ్ బాస్ తమిళం సీజన్ 9 ఆక్టోబర్ 5న అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. దీనికి తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సారి మరింత రసవత్తరంగా షో మొదలైంది. సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, వ్యాపారవేత్తలు, కళాకారులతో సహా 20 మంది కంటెస్టెంట్‌లు ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.
అక్కినేని డైరెక్టర్ ఎంట్రీ
అయితే, తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ఒకరు మాత్రం ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయనే… తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు-దర్శకుడు ప్రవీణ్ గాంధీ. బిగ్ బాస్ ఇంట్లో ఆయన సరళమైన, నిజాయితీతో కూడిన వ్యక్తిత్వానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కానీ ఒకప్పుడు ఆయన సినీ పరిశ్రమకు అందించిన అద్భుతమైన ప్రాజెక్టుల గురించి చాలా మందికి తెలియదు. ప్రవీణ్ గాంధీ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘రక్షకుడు’ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 1997లో విడుదలైంది. ఇందులో కింగ్ నాగార్జున అక్కినేని, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ జంటగా నటించారు. ఆ కాలంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్-రొమాంటిక్ చిత్రం అప్పట్లో ఒక సంచలనంగా నిలిచింది. ముఖ్యంగా, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.
చివరి మూవీ ఏంటో తెలుసా?
ప్రవీణ్ గాంధీ ‘రక్షకుడు’ మూవీ తర్వాత ఎన్నో హిట్ సిమినాలు చేశాడు. దర్శకుడిగా ఆయన చేసిన ‘జోడి’ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ రొమాంటిక్ డ్రామా యువ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ‘స్టార్’ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, దర్శకుడిగా ఆయన చివరి చిత్రం 2014లో వచ్చిన ‘పులిపార్వై’ . ఈ చారిత్రక డ్రామాను ఆయన స్వయంగా నిర్మించి, నటించడం విశేషం. అంతేకాకుండా, ఆయన నటుడిగా, రచయితగా కూడా పలు తమిళ చిత్రాలలో తనదైన ముద్ర వేశారు.
Read Also:Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్ కొలిక్కి వచ్చినట్లేనా.. ఎలిమినేషన్ ఎవరవుతారు?
బిగ్ స్ర్కీన్ నుంచి బుల్లితెరకి..
ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రవీణ్ గాంధీ, ఇప్పుడు బిగ్ బాస్ తమిళం 9 తో తనలోని మరో యాంగిల్ ని బయటకు తెచ్చారు. సెట్ మొత్తాన్ని తన అదుపులో ఉంచుకునే దర్శకుడు, ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో తనలోని నిశ్చలత, సృజనాత్మకత, జీవితానుభవాన్ని ఎలా ఉపయోగిస్తారో చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆయనకున్న అనుభవం, వయసు, ప్రశాంతమైన వ్యక్తిత్వం వల్ల గేమ్ ఎలా ఆడుతారో, ఆయన ఎలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతారో అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.


