Bigg Boss Wild Cards: బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డులు ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి ఆట కొంచెం రసవత్తరంగా మారింది. కొంతమంది గొడవలతోనే ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారు. మరికొంతమంది టాస్క్ ల్లో తమ సత్తా చాటుతున్నారు. ఇక ఈ వారం కెప్టెన్ అయ్యే హౌస్ మేట కోసం బిగ్ బాస్ రకరకాల టాస్క్ లు ఇచ్చాడు. అంతేకాక, ఇక వారం వారం నామినేషన్స్, ఎలిమినేషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపైంది. కామనర్స్ , సెలబ్రెటీల మధ్య హౌస్ లో రచ్చ మాములుగా జరగడం లేదు. సెలబ్రెటీలతో పోల్చుకుంటే హౌస్ నుంచి బయటకు వెళ్లిన వారిలో కామనర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు హౌస్ లోకి ఇద్దరు కామనర్స్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే హౌస్ లో నుంచి బయటకు వచ్చిన వారిలో దమ్ము శ్రీజ ఒకరు. ఈ అమ్మడు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది.
Read Also: Bigg Boss Elimination: పికిల్స్ పాప బ్యాగ్ ప్యాక్ చేసుకోవాల్సిందే.. లీస్ట్ లో ఆమెనే..!
హౌస్ మేట్స్ ని హడలెత్తించిన శ్రీజ
దమ్ము శ్రీజ హౌస్ లో తన మాటలతో హౌస్ మెంబర్స్ ను బెంబేలెత్తించింది. గేమ్ కంటే నోటితోనే ఈ చిన్నది ఎక్కువగా పని చెప్పింది.. దాంతో ఆడియన్స్ కు చిరాకు వచ్చింది. దాంతో ఓట్లు తక్కువ పడటంతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. ఈ ఆదివారం బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీజ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. శ్రీజతో పాటు మరో కామనర్ కూడా హౌస్ లోకి రానున్నాడని తెలుస్తుంది. అతను ఎవరో కాదు మాస్క్ మ్యాన్ హరీష్. కామనర్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హరిత హరీష్. తన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తన ముక్కుసూటి తనంతో హౌస్ లో ఎన్నో గొడవలు పడుతూ రచ్చ చేశాడు హరీష్. ఇక ఇప్పుడు మాస్క్ మ్యాన్ మరోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తుంది. హరీష్ ఎంట్రీతో హౌస్ లో రచ్చ డబుల్ అవవడం ఖాయం అంటున్నారు ఆడియన్స్. మరి నిజంగా హరీష్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి. ఇకపోతే, భరణి ఎలిమినేషన్ పైనా ఆడియన్స్ గుర్రుగా ఉన్నారు. అయితే, భరణిని కూడా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపించాలని చూస్తున్నారు. దీనిపై, బిగ్ బాస్ టీం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Read Also: Emmanuel: అప్పుడు సంజన కోసం త్యాగం.. ఇప్పుడు తనూజతో పోటీ


