Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Re Entry: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.. భరణికే గుద్దిపారేశారయ్యో

Bigg Boss Re Entry: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.. భరణికే గుద్దిపారేశారయ్యో

Bigg Boss Re Entry: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందంటే ఇదే కావచ్చు. దమ్ము శ్రీజ బిగ్ బాస్ హౌస్ లో రీఎంట్రీ విషయంలో జరిగిందిదే.. అయితే, ఈ రీఎంట్రీలో ట్విస్టులు మామూలుగా లేవు. లేటెస్ట్ ఎపిసోడ్ లో భరణికి గాయాలయ్యి హాస్పిటల్ లో చేరాడు. దీంతో దమ్ము శ్రీజ పర్మినెంట్ హౌస్ మేట్ గా ఉంటుందని  వార్తలొచ్చాయి. అయితే, అనూహ్యంగా భరణి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయి మళ్లీ హౌస్ లో చేరాడు. ఇప్పుడు షాకింగ్ అప్ డేట్ ఏంటంటే శ్రీజ ఎలిమినేట్ అవ్వడమే.

- Advertisement -

Read Also: Women’s World Cup: ఆచితూచి ఆడుతున్న భారత్.. 16 ఓవర్లు ముగిసే సరికి..

శ్రీజ, భరణి

ఇక, బిగ్ బాస్ లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ని మళ్లీ హౌస్‌లోకి పంపి.. వాళ్లతో నామినేషన్స్ చేయించారు. అయితే, అందులో శ్రీజ, భరణి ఈ ఇద్దరిని మాత్రమే హౌస్‌లో ఉంచి.. వాళ్లలో ఒక్కరికి మాత్రమే పర్మినెంట్ హౌస్ మేట్‌గా ఉంచడానికి టాస్క్‌లు ఓటింగ్‌లు పెట్టారు. హౌస్ నుంచి ఏడుగురు ఎలిమినేట్ అయితే.. ఈ ఇద్దరికి మాత్రమే ఈ బంపరాఫర్ ఎందుకో బిగ్ బాస్ క్లారిటీ ఇవ్వకపోగా.. ఇప్పుడు బిగ్ బాస్ తీసుకున్న తాజా నిర్ణయం కూడా వివాదానాకి తావిస్తోంది. ఆల్రెడీ ఒకసారి శ్రీజా దమ్ముని అన్యాయంగా హౌస్ నుంచి బయటకు పంపారనే వాదన ఉంది. ఇప్పుడు మళ్లీ ఆమెని హౌస్‌లోకి తీసుకుని వచ్చి భరణిని పర్మినెంట్ హౌస్ మేట్‌గా అవకాశం కల్పిస్తూ.. శ్రీజాని ఎలిమినేట్ చేయబోతున్నారు. నిజానికి శ్రీజ-భరణిలకు ఓటింగ్ అంటే.. వార్ వన్ సైడ్ కచ్చితంగా శ్రీజాకే ఎక్కువ ఓట్లు వస్తాయని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ వార్ వన్ సైడ్ అయ్యింది.. అది శ్రీజాకి కాదు.. భరణికి అనేది ఓటింగ్‌లోని ట్విస్ట్.

Read Also: INDW vs AUSW: టాస్‌ గెలిచిన ఆసీస్‌.. భారత్‌ ఫస్ట్ బౌలింగ్

హార్ష్ రియాలిటీ

శ్రీజా, భరణిలకు ఓటింగ్ అంటే.. శ్రీజాకే ఎక్కువ వస్తాయి. ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు కాబట్టి.. ఆమెకే ఓట్లు వస్తాయని అనుకున్నారంతా. కానీ వాస్తవంలోకి వెళ్తే.. శ్రీజా కంటే భరణికి ఎక్కువ పాపులారిటీ ఉందనేది రియాలిటీ. అంతేకాకుండా, అతనేదో ఎదవపని చేసి హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వలేదు. అందుకే ఓట్లన్నీ గుద్దిపారేశారు. పోనీ శ్రీజ ఎలిమినేట్ అయిన తరువాతి వారంలో ఇలాంటి పోల్ పెడితే కాస్తో కూస్తూ ఓటింగ్ వచ్చేదేమో కానీ.. ఆమె ఎలిమినేట్ అయ్యి మూడు వారాలు అయిపోయింది కాబట్టి.. ఆమెని, ఆమె ఆటని అంతా మర్చిపోయారు. పైగా భరణికి ఎంత కాదనుకున్నా కూడా.. సీరియల్ ఫ్యాన్స్ ఓటింగ్ ఉంది. అదే ఈ వారంలో అతనికి కలిసి వచ్చింది. ఈ లెక్కలు పక్కన పెడితే.. ముఖ్యంగా బిగ్ బాస్ లెక్క వేరే ఉంటుంది. ఎవర్నైతే హౌస్‌లో ఉంచాలని అనుకుంటారో.. వాళ్లనే ఉంచుతారు. అక్కర్లేదు అనుకున్న వాళ్లని ఎలిమినేట్ చేసి పంపిస్తారు. అన్ని లెక్కలు బట్టి చూస్తే.. ఈరోజు భరణి బిగ్ బాస్ హౌస్‌లో ఉంటున్నారు.. శ్రీజా ఎలిమినేట్ అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad