Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Updates: బిగ్ బాస్ లో ప్రేమ జంట బ్రేకప్.. అంతలోనే ప్యాచప్

Bigg Boss Updates: బిగ్ బాస్ లో ప్రేమ జంట బ్రేకప్.. అంతలోనే ప్యాచప్

Bigg Boss Updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో గేమ్ రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ప్రేమ జంట కూడా గేమ్ పై ఫోకస్ పెట్టింది. అయితే, గేమ్ విషయంలోనే రీతూ- డీమాన్ మధ్య గొడవ జరిగింది. రీతూ దగ్గర క్యాష్ తక్కువ ఉండటంతో మాధురి.. ఆపోజిట్ టీమ్ అయినా సరే డీమాన్‌ని సాయం అడిగింది. అయితే ఈ విషయంలో రీతూ-డీమాన్‌కి చిన్న గొడవ అయింది. నేను నిన్ను ఎప్పుడైనా తిట్టానా..అని రీతూని అడిగాడు డీమాన్. నేను ఏ మాట అన్నా కూడా నువ్వు ఫీలవుతున్నావ్.. దానికి అసలు రీజన్‌యే లేదు నేను నా గోలలో నేనున్నాను.. ఆమె నిన్ను అడిగింది.. అని రీతూ చెప్పింది. ఏదో డైలాగ్ వేశావ్ ఇందాక ఏంటది.. అని డీమాన్ అడిగాడు. నీ 100 బాధలు తీసుకొచ్చి నా మీద వేయకు అన్నా.. అని రీతూ చెప్పింది. నేను నీ మీద వేశానా.. అని డీమాన్ సూటిగా అడిగాడు. మరి ఎన్నిసార్లు సారీ చెప్పాలిరా నువ్వు ఏమన్నావ్ నీ భావం నాకు అర్థమైంది అని చెప్పావ్.. అంటూ రీతూ అంది. నా పాయింట్ అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడతా అంటే నేను తీసుకోను.. గూబ మీద కొట్టి సారీ చెప్తా అంటే ఎవరూ ఒప్పుకోరు.. అంటూ డీమాన్ ఫైర్ అయ్యాడు.

- Advertisement -

Read Also: Bigg Boss Updates: సంజనా- దివ్య మధ్య “చెత్త” గొడవ?

ఇంతలో బ్రేకప్ అంతలోనే ప్యాకప్

ఇక మళ్లీ డీమాన్ దగ్గరికెళ్లి రీతూ మాట్లాడింది. నువ్వు ఆ కన్ఫెషన్ రూమ్‌ది కూడా అదే చేశావ్.. నేను అప్పుడూ చెప్పా.. నువ్వు రిపీట్ చేసుకుంటా ఉండొచ్చు పక్కనోళ్లు ఏమైనా అంటే డోంట్ రిపీట్ ఇట్ అంటావ్.. అని రీతూ కోపపడింది. నేను నాకు నేనుగా ఏం చెప్పలేదు అడిగితే చెప్పాను.. అని డీమాన్ అన్నాడు. అడిగితే ఏంటి ఇప్పుడు నన్నూ అడిగారు కన్ఫెషన్ రూమ్‌ది నేను చెప్పానా.. అని రీతూ ఫైర్ అయింది. ఇప్పుడు నేను ఏం చెప్పేశాను.. అని డీమాన్ రెయిజ్ అయ్యాడు. అలా చెప్పకు పవన్ అది నీకు నాకు మధ్యన ఉన్న విషయం.. లేకపోతే నేను హాల్లోనే నీకు చెప్పేదాన్ని కదా.. నేను చెప్పలేదా నీకు నాకు మధ్య జరిగింది ఎప్పుడూ ఎవరికీ చెప్పొద్దని.. అంటూ రీతూ మాట్లాడింది. నేను నీ సీక్రెట్స్ ఏమైనా చెప్పానా.. అయినా ఈ హౌస్‌లో జరిగినప్పుడు చెప్పుకుంటార్రా.. చెప్పకూడదు అంటే హౌస్‌లో గొడవపెట్టకు.. మాధురి అక్క నన్ను ఇలా అడిగినప్పుడు మిస్ అండర్‌స్టాండింగ్ అయింది దాని గురించి మాట్లాడాం అని చెప్పా అంతే.. అందులో నేను మొత్తం ఏం చెప్పేశాను చెప్పు.. అంటూ డీమాన్ వాదించాడు. దీంతో పవన్ ఇది నా మిస్టేక్.. నేను ఇక నీతో మాట్లాడను.. నువ్వు నాతో మాట్లాడకు.. అంటూ రీతూ వెళ్లిపోయింది. కట్ చేస్తే డీమాన్ వాష్‌రూమ్‌లోకి వెళ్లి బాధపడుతుంటే రీతూ బయట నిల్చొని డోర్ కొడుతూ పిలుస్తుంది. డీమాన్ బయటికి రాగానే సారీ చెప్పి రీతూ హగ్ ఇచ్చేసింది. దీంతో, కథ సుఖాంతం అయ్యింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ 7 కంటెస్టెంట్లు అమర్ దీప్, అర్జున్ అంబటి సర్  ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు.

Read Also: Bigg Boss Nominations: పికిల్స్ పాపకు పంపేందుకు ఆమెకు ఓట్లు గుద్దేసిన జనాలు

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad