Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss New Promo:  లత్కోర్ హరీష్.. చెలరేగిన నాగ్.. దారుణమే జరిగిందయ్యో..!

Bigg Boss New Promo:  లత్కోర్ హరీష్.. చెలరేగిన నాగ్.. దారుణమే జరిగిందయ్యో..!

Bigg Boss New Promo: బిగ్ బాస్ హౌస్‌ అంటేనే అన్నీ చిల్లర పంచాయితీలు ఉంటాయి. అలాంటిది ఓ దాని కోసమే లొల్లి జరుగుతోంది. లత్కోర్ అన్న మాట కోసం పెద్ద పంచాయితీనే నడుస్తోంది. గతవారం బిగ్ బాస్ హౌస్‌లో నేను మీలా లత్కోర్ పనులు చేయను అంటూ నోరు జారేశాడు హరీష్. అయితే ఎవరైనా బిగ్ బాస్ హౌస్‌లో అలాంటి పదాలను వదిలేస్తే.. అదే పదంతో హోస్ట్ నాగార్జున సంభోదిస్తూ తాట తీస్తుంటారు. ఈవారం అయితే.. హరీష్‌ని లత్కోర్ హరీష్ అంటూ ఏకిపారేశారు. దానికి సంబంధించిన బిగ్ బాస్ సీజన్ 9 ఈ శనివారం నాటి ఎపిసోడ్‌ ప్రోమో వచ్చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూసేద్దాం.

- Advertisement -

వాయింపు స్టార్ట్ చేసిన నాగ్..

ఇక, వచ్చీరావడంతోనే వాయింపు స్టార్ట్ చేశారు నాగార్జున . బిగ్ బాస్ సీజన్ 9 టెనెంట్స్ Vs ఓనర్స్ అని అనుకున్నాం.. అదే కాన్సెప్ట్ కానీ.. అసలు ఆ వ్యత్యాసమే కనిపించడం లేదు.. అంటూ క్లాస్ పీకారు నాగార్జున. దానిపై ఢమాల్ పవన్ స్పందిస్తూ.. ‘ఓనర్స్ అంతా కలిపి కలెక్టివ్ డిసీషన్ తీసుకున్నాం సార్’ అని అన్నాడు. ఆ కలెక్టివ్ డిసిషన్సే తప్పని ఆడియన్స్ చెప్తున్నారూ.. వాళ్లకి నచ్చడం లేదు.. అని ఇచ్చిపడేశారు నాగార్జున. తర్వాత అసలు నాగార్జున హోస్ట్‌గా దేకను కూడా దేకడం లేదు శ్రీజా. ఈరోజు ఎపిసోడ్‌లోకూడా అదే చేసింది. ‘సంచాలక్‌గా ఏం చేశావమ్మా అని నాగార్జున అంటే.. పళ్లు ఇకిలిస్తూ.. కరెక్ట్‌గానే చేశాను సార్ అని గట్టిగానే సమాధానం చెప్పింది. ‘కరెక్ట్‌గా చేశానని నువ్వు అనుకుంటే సరిపోద్దా.. అని కౌంటర్ ఇచ్చారు నాగార్జున. దాంతో శ్రీజా.. ‘బిగ్ బాస్ చెప్పినట్టే చేశానుసార్’ అని వాదించడం మొదలుపెట్టింది. ‘అసలు నువ్వు చేసిన పని వల్ల గేమ్ మొత్తం కన్ఫ్యూజ్ అయ్యింది’ అంటూ గాలి తీసేశారు నాగార్జున.

Read Also: Bigg Boss 9 Telugu: సీక్రెట్ రూమ్‌లో సంజన.. ఒంటరైపోయా.. కెప్టెన్ అయిన రోజే ఏడ్చేసిన ఇమ్మూ

రీతూకి క్లాస్

ఆ తరవాత.. బిగ్ బాస్ హౌస్‌లో రాధిక అక్కలా పవన్‌లు ఇద్దర్నీ వాయిస్తున్న రీతూకి క్లాస్ పీకారు నాగ్. ‘నాకు లక్ లేదూ.. లక్ లేదూ అంటూ తలబాదుకుంటున్నావ్.. నీ ఆటని నువ్వే నాశనం చేసుకుంటున్నావ్’ అని అన్నారు. ఆ తర్వాత గత వారం హరీష్ చేసిన లత్కోర్ పంచాయితీపై నాగార్జున ఘాటుగా స్పందిస్తూ.. ‘లత్కోర్ హరీష్’ అని సంభోదించారు. దెబ్బకి మనోడికి మొహం మాడిపోయింది. అది పదం కాస్త ఇబ్బందికరమైనదని నీకు అనిపించలేదా? లత్కోర్ హరీష్ అని నాగార్జున అంటే.. ‘అది కామన్‌గా వాడేదే కదా’ అని అన్నాడు. దాంతో నాగార్జున.. ‘అయితే హౌస్‌లో వాళ్లంతా నిన్ను లత్కోర్ హరీష్ అని అంటారు.. నీకు ఓకేనా? మరి?? అని అడిగారు నాగార్జున. నేను ఎవర్నీ ఉద్దేశించి అనలేదు అని హరీష్ అనడంతో.. ఇరిటేటింగ్ బ్యూటీ ప్రియ నేనున్నానంటూ లేచింది. ఆ పదాన్ని వాడటం రాంగ్ సార్ అని అన్నది. దాంతో హరీష్.. ‘సార్.. నేను ఎవర్నీ లత్కోర్ అని అనలేదు.. అలాంటి పనులు చేయను అని మాత్రమే అన్నాను’ అని ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టుగా హరీష్ సమాధానం ఇవ్వడంతో నాగార్జునకి మండింది.

Read Also: Asia Cup: అర్ష్‌దీప్‌ మ్యాజిక్.. సూపర్ ఓవర్లో శ్రీలంకపై భారత్ గెలుపు

హరీష్ కి గట్టి క్లాస్..

‘హరీష్.. నేను నీలాంటి లత్కోర్ మాటలు మాట్లాడను అని అంటే దాని అర్థం ఏమి వస్తుంది? నువ్వు అనొద్దు.. మీరు అనాలని నువ్వు అడుగుతున్నప్పుడు.. లత్కోర్ పని అంటే అది కరెక్ట్ కాదు హరీష్’ అంటూ ఓ రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు నాగార్జున. అయితే వారం వారం హరీష్ మాత్రం టార్గెట్ అవుతూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే హరీష్ కంటే హౌస్‌లో లత్కోర్ పనులు చేసే వాళ్లు ఇంకా ఉన్నారు. ఆ పవన్ కళ్యాణ్, రీతూ, డీమాన్‌లు అయితే చేసేవన్నీ లత్కోర్ పనులే.. బట్ ఇక్కడ టార్గెట్ అయ్యేది మాత్రం హరీష్. దీంతో, అన్ని సీజన్లలో ఉన్నట్లే ఈ సీజన్ లో టార్గెటెడ్ కంటెస్టెంట్ హరీష్ అని జనాలు అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad