Bigg Boss Nominations: ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో రీతూ చౌదరి పత్తేపారాలు బానే చేసింది. ఇప్పుడు, తనకు కరెక్ట్ గా సెట్ అయ్యే పర్సన్ దివ్వెల మాధురితోనే ఆమె జత కట్టించింది. వీళ్లిద్దరూ భరణికి క్లాసులు పీకడం మరో హైలెట్. ఓ పక్క సంచాలక్‌గా ఉన్న రాము రాథోడ్.. ఫౌల్ గేమ్ ఆడుతున్నావ్ అని చెప్పినా వినిపించుకోలేదు. కానీ ఇఫ్పుడు మాత్రం నువ్వు చెప్పలేదంటూ తనకి అలవాటైన పద్దతిలో బొంకేస్తుంది ఛీ తూ. ఇక, ఆరోవారంలో బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ కార్డులుగా వచ్చి.. మరీ వైల్డ్ గా బిహేవ్ చేయడంతో రచ్చ రంబోలా ఉంది ఇవాళ్టి ఎపిసోడ్. దానికి సంబంధించిన ప్రోమో వివరాలు చూసేద్దాం.
ఆరోవారం నామినేషన్స్..
ఈ ఆరోవారం నామినేషన్ ప్రక్రియలో భరణి రఫ్ ఆడించాడు. దివ్య నిఖిత రాకముందు, వచ్చాక అన్నలా భరణి సిచ్యువేషన్ ఉంది. ఆమె చుట్టూ భరణి ప్రదక్షిణలు చేయడంతో ఇంటి మొత్తానికి విలన్ అయ్యాడు. ఆ కసంతా నామినేషన్ లో తీర్చుకున్నారు. నేటి ఎపిసోడ్‌లో భరణి-దివ్య నిఖితల గురించి దివ్వెల పిచ్చికూతలు కూసింది. దివ్య హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం.. మీకు దివ్య తప్ప వేరే ప్రపంచమే కనిపించడం లేదు అని అన్నది. ఆ కసితోనే తాను అందుకున్న బాల్‌ని తీసుకుని రీతూ ఇచ్చి భరణిని నామినేట్ చేయించింది. ఇక తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి.. టాస్క్ మొత్తం క్యాన్సిల్ అవ్వడానికి కారణమైన రీతూ.. తన తప్పుని సమర్ధించుకుంటూ అడ్డంగా వదిస్తోంది.
Read Also: Bigg Boss Buzz: టచ్ చేయి.. మరి దమ్ముంటే టచ్ చేయి.. శ్రీజపై శివాజీ ఫైర్
బెలూన్ టాస్క్‌లో వెధవపనులన్నీ చేసి జనంతో ఛీ థూ అనిపించుకున్నా కూడా రీతూకి ఏమాత్రం బుద్దిరాలేదు. ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాము రాథోడ్‌తో గొడవకి దిగింది. ఆ తరువాత భరణి మారిపోయాడటంటూ అతన్ని నామినేట్ చేసింది. మీరు మాటఇస్తే చేస్తారనే నమ్మకం పోయింది అని అన్నది. దాంతో భరణి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. నేను ఏం మాట ఇచ్చాను.. నేను మాట ఇచ్చిన తరువాత నువ్వెన్ని టాస్క్‌లు ఆడావ్ అని అడిగాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు సపోర్ట్ చేయలేదని రీతూ అనడంతో.. ‘రాము నువ్వు ఉన్నప్పుడు నేను రాముకే సపోర్ట్ చేస్తానన్నాను చేశాను’ అని చెప్పాడు భరణి. నేను కెప్టెన్‌గా ఉంటే.. నాకు ఇష్టం లేదని చెప్పిన ఫస్ట్ పర్సన్ రీతూ.. అలాంటి నువ్వు నేను సపోర్ట్ చేయలేదని ఎలా అంటావ్ అంటూ ఇచ్చిపడేశాడు భరణి. ఇక భరణితో పాటు దివ్యనిఖితని నామినేట్ చేస్తూ.. ‘నువ్వు దోసె సరిగా వేయలేదు.. కరెక్ట్ టైమ్‌కి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వలేదు’ అంటూ సిల్లీ రీజన్‌లతో నామినేట్ చేసింది రీతూ. దోసె ఆలస్యం అయ్యిందని ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ చేస్తున్నావా? అని గాలి తీసేసింది దివ్య.
Read Also: Bigg Boss Sreeja: బిగ్ బాస్ లో దమ్ము శ్రీజ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
సంజన లొల్లి..
ఇక తర్వాత సంజన.. నన్ను లోపల పడుకోనీయలేదు.. నీకు మానవత్వం లేదు అని రాముని నిందించింది. అప్పుడు మనోడు కొట్టిన డైలాగ్ మాత్రం హైలట్. ‘మాచెల్లి మా అక్క ఉన్నా నేను అదే చేస్తాను ’ అని కౌంటర్ ఇచ్చాడు. ఇక భరణిని మానవత్వం లేదని సంజన అనడంతో.. భరణికి సుర్రున కాలింది. మాట్లాడే ముందు ఎదుటి వాళ్లు అన్నది కూడా తీసుకోవాలి అంటూ ఆవేశంతో ఊగిపోయాడు భరణి. మొత్తానికి ప్రోమోలో హీట్ అయితే మామూలుగా లేదు. మంటలే అన్నట్టుగా ఉంది.


