Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Divvala: దువ్వాడ నువ్వు దేవుడివయ్యా.. ఆమెను ఎలా భరిస్తున్నావురా సామి..!

Bigg Boss Divvala: దువ్వాడ నువ్వు దేవుడివయ్యా.. ఆమెను ఎలా భరిస్తున్నావురా సామి..!

Bigg Boss Divvala: బిగ్ బాస్ ఆరోవారం పోరు రసవత్తరంగా మారింది. వైల్డ్ కార్డుల మరీ వైల్డ్ గా బిహేవ్ చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌తో ఎఫైర్ పెట్టుకుని తన క్యారెక్టర్‌ని దిగజార్చుకున్న దివ్వెల మాధురిని మొత్తం బ్యాడ్ చేయడానికి గట్టి ప్లానింగే చేశాడు. ఆమె బిగ్ బాస్ స్క్రీన్‌పై కనిపించగానే.. జనం చీ అని ఉమ్మేసేంత దారుణంగా చూపిస్తున్నారు. అసలు ఆమె బిగ్ బాస్ అనుకుంటుందో లేదంటే దువ్వాడ బంగ్లా అనుకుంటుందో ఏమో కానీ.. అంతా తనకి ఇష్టం వచ్చినట్లే జరగాలని అంటుంది. తన మాటే శాసనం అన్నట్లు చేస్తోంది. నోరేసుకుని పడిపోతుంది. ఈమె ఇన్ని అరాచకాలు చేస్తున్న బిగ్ బాస్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా అది తప్పు అని చెప్పింది లేదు. దాంతో దివ్వెల మాధురి నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా.. అడ్డు చెప్పారంటే ఊరుకోను అని అంటుంది. ఆ పచ్చళ్ల పాపతో కలిసి.. వాళ్లు ఇలా.. వీళ్లు ఇలా అంటూ అమ్మలక్క ముచ్చట్లు చెప్పుకుంటూ.. అందరి క్యారెక్టర్ల గురించి దారుణంగా మాట్లాడుతుంది దివ్వెల మాధురి. ఇవాళ్టి ఎపిసోడ్ లో మరీ దిగజారి ప్రవర్తించింది. దానికి సంబంధించిన వివరాలపై లుక్కేద్దాం.

- Advertisement -

Read Also: Bigg Boss Updates: వాయమ్మో.. సీరియల్ విలన్ సినిమా చూపిస్తాడంట.. రూటు మార్చిన భరణి

దివ్వెల మాధురి రచ్చ రచ్చ

వాష్ రూం దగ్గర తాను పెట్టిన బొట్టు బిల్లలు కనిపించడం లేదు అంటూ దివ్వెల మాధురి కంటెంట్ ఇవ్వడం కోసం సంజనతో గొడవ పడింది. అయితే వీళ్లిద్దరూ ముందే గొడవపడదాం అని వాష్ రూం దగ్గర చెప్పుకుని వచ్చి డ్రామా క్రియేట్ చేశారు. కుళాయిల దగ్గర బిందెల బ్యాచ్ లా తెగ తిట్టుకున్నారు. ఆ దివ్వెల మాధురి అయితే.. వామ్మో మరీ దారుణంగా ఉంది ఆమె మాటతీరు. వీళ్లు మామూలు మెంటల్ కాదు.. కంటెంట్ కోసం దారుణంగా చేస్తున్నారంటూ ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది దివ్య. అయితే తిండి విషయంలో తనకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్న దివ్వెల మాధురి.. దోసెల్లో కర్రీ వేసుకుని తిన్నది. దాంతో దివ్యకి మండింది. దోసెల్లో కర్రీ వేసుకుని తింటే.. మరి భోజనంలో ఏమి వేసుకుని తింటారు.. అయినా ఫుడ్ సెక్షన్‌కి నన్ను రెస్పాన్సిబిలిటీగా పెట్టినప్పుడు నన్ను అడగాలి కదా అని మాధురిని అడిగింది దివ్య. దాంతో దువ్వాడ దువ్వెడ చెలరేగిపోయింది. ఏంటి? నాతో గొడవపడాలని చూస్తున్నావా? ఏంటి అని అన్నది. వచ్చినప్పటి నుంచి ఎవరు ఏం అడిగినా కూడా.. సేమ్ డైలాగ్ చెప్తుంది మాధురి. తన పేరు తెలియదని అన్నందుకు.. ఫీల్ అయిపోయి.. నా పేరు తెలియదా? అంటూ శ్రీజతో గొడవపడింది మాధురి. ఇప్పుడు కర్రీ విషయం గురించి అడిగితే.. అదే తంతు. ‘నాకు ఈ ఫుడ్ మానిటర్ నచ్చలేదు.. మార్చేయండి’ అని ఆర్డర్ వేస్తుంది దివ్వెల మాధురి. అంటే ఈమె చెప్పగానే మార్చేయాలి మరి. అది అసలు బిగ్ బాస్ హౌస్‌నా లేదంటే ఈమె ఇష్టం వచ్చినట్టుగా ఉండటానికి దువ్వాడ బంగ్లానా? తెలియదు

Read Also: Bigg Boss Nominations:  కెప్టెన్ కి స్పెషల్ పవర్.. రాత్రిపూట రాజు, రాజా గుసగుసలు

కెప్టెన్ ని లెక్కచేయని..

హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న కళ్యాణ్‌ని అయితే అస్సలు లెక్కచేయడం లేదు. ఓసారి కూర్చోండి మాట్లాడదాం అని అంటే.. కూర్చొంటే కానీ మాట్లాడవా? అని అంటూ అతనితో అడ్డంగా వాదనకి దిగింది. వాడు మంచోడు కాబట్టి సరిపోయింది కానీ.. వేరేవాడైతే తొక్కిపడేసేవాడు. ఇప్పుడు కూడా.. ఈ గొడవలో కెప్టెన్ కల్పించుకుంటే.. నువ్వెవరూ అడగాడినికి అని అంటోంది దివ్వెల మాధురి. మీతో నాకు పర్సనల్ బాండింగ్ అవసరం లేదు.. ఇది హౌస్‌కి సంబంధించిన విషయం కాబట్టి అడుగుతున్నా అని దివ్య అనడంతో.. నోటికి పనిచెప్పింది దువ్వాడ. ‘నాకు అస్సలు అవసరం లేదమ్మా.. మీ బాండింగ్‌లు నాకెందుకు అంటూ బాదేసుకుంటూ.. మొహం చిరాకుగా పెట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad