Bigg Boss Elimination: బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ షరూ అయ్యింది. ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయడం ఈవారం నామినేషన్స్ అదరహో అన్నట్లుగా ఉన్నాయి. ఇక, వాళ్లలో నుంచే ఒకరిద్దరూ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి.. హౌస్‌లో కంటిన్యూ కాబోతున్నారు. ఇప్పటికే మనీష్, దమ్ము శ్రీజ, ప్రియ, ఫ్లోరా షైనీ హౌస్‌లోకి వెళ్లి నామినేషన్స్ ప్రక్రియను కంప్లీట్ చేశారు. ఈ నామినేషన్స్‌లో భాగంగా.. రెండు ప్రేమ జంటలు రీతూ చౌదరి- డెమాన్ పవన్, తనూజ- కళ్యాణ్‌లతో పాటు గౌరవ్, దివ్వెల మాధురి , రాము రాథోడ్, సంజనా.. ఈ ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వీళ్లలో దివ్వెల మాధురిని తనూజ.. స్పెషల్ పవర్ ద్వారా నేరుగా నామినేట్ చేసింది. ఆమె నామినేషనే కాదు.. వచ్చే వారం జరగబోయే ఎలిమినేషన్ కూడా పక్క స్క్రిప్టేనే అనేందుకు కారణాలు కన్పిస్తున్నాయి.
Read Also: Bigg Boss Geetu: ఆ బలుపు, పొగరు మాటలు.. ఆ పిల్ల పుల్ల పెట్టకుంటే అందరూ జాలీగా ఉండేవాళ్లు..
ఓటింగ్ సంగతేంటి?
బిగ్ బాస్ గేమ్ అనేది స్కిప్టెట్ షో కాదు. ఇది ఓకే. మరి ఓటింగ్ సంగతేంటి? ఆడియన్స్ ఓటింగ్‌ని బట్టే ఎలిమినేషన్ ఉంటుందని పదే పదే నాగార్జున చెప్తుంటారు. ఏరోజైనా? ఓ ఎలిమినేషన్‌కి అయినా.. ఒక్కరంటే ఒక్క కంటెస్టెంట్‌కి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పారా? ఎలిమినేషన్‌ని పక్కనపెట్టండి.. కనీసం విన్నర్‌కి వచ్చిన ఓట్లను అయినా ప్రకటించారా? ఎవర్ని నామినేషన్‌లో పెట్టాలి? ఎవర్ని ఎలిమినేట్ చేయాలి? అనేది ముందే ఫిక్స్ అవుతుందని ఎప్పటి నుంచో బిగ్ బాస్ ఆడియన్స్‌లో చానాళ్ల నుంచి చాలా సందేహాలు ఉన్నాయి. అయితే వచ్చే వారం జరగబోయే ఎలిమినేషన్ ముందే ఫిక్స్ అయ్యింది అనడానికి కారణాలు చూస్తే.. నిన్నటి ఎపిసోడ్‌లో తనూజ టాస్క్ గెలిచిన గోల్డెన్ పవర్‌ని సొంతం చేసుకుంది. దాని ద్వారా నాగార్జున మూడు ఆప్షన్లు ఇచ్చారు. డైరెక్ట్ నామినేషన్, బాత్రూం-గార్డెన్ క్లీనింగ్, మాట్లాడకుండా ఇన్ విజుబుల్ కేప్ వేయడం. ఈ మూడు ఆప్షన్లు తనూజకి ఇచ్చారు. ఇందులో నువ్వు ఏ ఆప్షన్ ఎంచుకుంటావ్ అని నాగార్జున అడిగినప్పుడు.. తనూజ క్షణం కూడా ఆలోచించకుండా తన మమ్మీ మాధురి పేరు పేరు చెప్పింది.
Read Also: Ramya Moksha: ఈ మాత్రం దానికి ఇంత హడావిడి ఎందుకో.. పికిల్స్ పాపపై ట్రోల్స్..!
డైరెక్ట్ నామినేషన్ చేస్తా..
ఆ టైమ్‌లో చూస్తే.. మాధురి వైపు చూసి నవ్వుతూ.. డైరెక్ట్ నామినేషన్ చేస్తా సార్ అని అంటే.. మాధురి కన్ను కొడుతూ.. ముద్దు పెడుతూ చిరునవ్వులు చిందిస్తూ తనని డైరెక్ట్ నామినేట్ చేయమన్నది. మాధురి, తనూజలు ఇద్దరూ ఒకటే కంచం.. ఒకటే మంచం అన్నట్టుగా ఉంటున్నారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంత క్లోజ్‌గా ఉంటున్నారు. అలాంటిది ఆమెను డైరెక్ట్ నామినేట్ చేయడం ఏంటి? చిన్న చిన్న పనిష్‌మెంట్‌లను మానేసి.. ఏకంగా డైరెక్ట్ నామినేట్ చేయడం ఏంటి? అంటే.. అక్కడే ఉంది మరి మ్యాజిక్కూ. ఈవారం ఆమె నామినేషన్స్‌లో ఉంటేనే కదా.. ఎలిమినేట్ అయ్యేది. కాబట్టి.. అందుకే పక్కా స్క్రిప్ట్ ప్రకారం మాధురిని డైరెక్ట్ నామినేట్ చేయించారు. ఒకవేళ డైరెక్ట్ నామినేట్ చేయకపోయినా.. దివ్వెల మాధురి ఎలిమినేట్ కాకుండా ఉంటుందని చెప్పలేం. ఆమెపై ఉన్న నెగిటివిటీ సంగతి. మాధురి వచ్చే వారం ఎలిమినేట్ కాబోతున్న విషయం ఆమెకి ముందే తెలుసు అనడానికి మరో విజువల్ ప్రూఫ్ ఏంటంటే.. రమ్య ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్తుంటే.. ఆమెని దగ్గరకు తీసుకున్న మాధురి.. వచ్చే వారం నేను ఎలిమినేట్ అవుతానని రమ్యకి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పింది.
Bigg Boss Elimination: జనాలు గొర్రెలా? అంతా అగ్రిమెంటు ప్రకారమేనా ఇన్ ఔట్?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


