Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Divvala Madhuri: దువ్వాడ చెప్పింది ఒకటి.. దివ్వెల చేస్తుంది మరోటి.. నెట్టింట్లో ఫుల్ ట్రోలింగ్

Divvala Madhuri: దువ్వాడ చెప్పింది ఒకటి.. దివ్వెల చేస్తుంది మరోటి.. నెట్టింట్లో ఫుల్ ట్రోలింగ్

Divvala Madhuri: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి..  ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన జంట. అయితే, ప్రస్తుతం దివ్వెల మాధురి.. వైల్డ్ కార్డు ద్వారా బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలాంటి సెన్సేషనల్ ఇమేజ్ ఉన్న మాధురి.. హౌస్‌లోకి వెళ్ళగానే డ్రామా పీక్స్‌కు వెళ్లింది. రీతూతో గొడవ, దివ్యను టార్గెట్ చేయడం, సంజనాతో ప్రాంక్ ఇలా ఆమె హౌస్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే, ఆమెకు బయటి నుంచే దువ్వాడ శ్రీనివాస్ ప్రచారం కల్పిస్తున్నారు.

- Advertisement -

Read Also: Bigg Boss Captain: బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా.. అధ్యక్షా.. సుమన్ అనే నేను..!

చీరకట్టు గురించి దువ్వాడ

ఈక్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో దువ్వాడ మాధురి ఆట గురించి ఆయన మాట్లాడారు. అలా మాట్లాడుతున్న క్రమంలోనే చీర కట్టులో.. నిండైన తెలుగుతనంతో మాత్రమే మాధురి బిగ్ బాస్‌లో కనిపిస్తుంది.. కంటిన్యూ అవుతుందని శ్రీనివాస్ చెప్పారు. తను ఇదే చెప్పి పంపించా అంటూ చెప్పుకొచ్చారు. అయితే శ్రీనివాస్‌కిచ్చిన ఈ మాటనే ఇప్పుడు మాధురి దాటేసింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్ ఎపిసోడ్‌ అయిన 39th ఎపిసోడ్‌లో… బుజ్జిగాడు సాంగ్‌తో నిద్రలేచిన కంటెంస్టెంట్ అందరూ.. లాన్‌లో వచ్చి డ్యాన్స్‌ చేస్తూ ఉండగా.. కాస్త లేట్‌గా హౌస్‌ నుంచి బయటికి వచ్చింది దివ్వెల మాధురి. అయితే అలా హౌస్‌ నుంచి బయటికి వచ్చిన ఆమె.. చీరలో కాకుండా నైట్‌ సూట్‌లో కనిపించింది. దీంతో ఈఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొంత మంది శ్రీనివాస్‌ను ట్రోల్ చేస్తున్నారు. మాట తప్పిన మాధురి అంటూ.. కామెంట్ చేస్తున్నారు. శ్రీనివాస్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలంటూ పోస్టులు పెడుతున్నారు.

Read Also: Bigg Boss Updates: గెలుపు కొరకు చివరి వరకు.. నిఖిల్ పై గెలిచి కెప్టెన్ గా నిలిచిన కండల వీరుడు..!

దివ్వెలపై నెగిటివిటీ..

బిగ్ బాస్ హౌస్‌లో మనిషిని బట్టి రూల్ మారిపోతుంటుంది. ఒకర్ని ఒకలా.. ఇంకొకర్ని ఇంకోలా డీల్ చేస్తుంటారు. ఈ జబ్బు ఇప్పటిది కాదు.. ఫస్ట్ సీజన్‌ నుంచి ఇలాగే ఉంది. వ్యక్తిని బట్టి పిలుపు మారిపోతుంది. వేరే వాళ్ల విషయంలో తప్పైంది.. వీళ్ల విషయంలో ఒప్పు అవుతుంది. బరితెగించిన వాళ్లను కూడా బిగ్ బాస్ వెనకేసుకొచ్చిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ముందు ముందు కూడా బిగ్ బాస్ హౌస్‌లో ఉండబోతున్నాయి అని అనడగానికి దివ్వెల మాధురినే పెద్ద ఉదాహరణ. ఆమె ప్రవర్తన చూసి జనం రగిలిపోతున్నారు. కరిగిపోయాను కర్పూర వీణలా అంటూ దువ్వాడ శ్రీనివాస్‌తో డ్యుయెట్‌లు పాడుతూ బిగ్ బాస్ స్టేజ్ మీదికి రావడమే.. ఏమిరా ఈ చెండాలం అని జనాలు తలలు పట్టుకున్నారు. అక్రమ సంబంధంతో హాట్ టాపిక్ అయిన వాళ్లని బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకొచ్చారు. దీనిపై జనాలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad