Sunday, November 16, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Bharani: భరణి ఎలిమినేషన్ పై దువ్వాడ సంచలన వ్యాఖ్యలు

Bigg Boss Bharani: భరణి ఎలిమినేషన్ పై దువ్వాడ సంచలన వ్యాఖ్యలు

Bigg Boss Bharani: బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో వైల్డ్ కార్డులు ఎంట్రీ అయినప్పట్నుంచి పోరు రసవత్తరంగా మారుతోంది. అయితే, వైల్డ్ కార్డుగా దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఆమె ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్ బయటి నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే, ఇటీవలే హౌస్ లో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ నుంచి భరణి ఎలిమినేట్ అయ్యాడు. భరణి ఎలిమినేట్ అయిన తర్వాత దువ్వాడ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకి దువ్వాడ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది. అదేంటో చూద్దాం.

- Advertisement -

Read Also: Priya Malik: నాన్న కాపాడాడు.. దీపావళి ప్రమాదంపై బిగ్ బాస్ కంటెస్టెంట్

భరణిని మీరే ఎలిమినేట్ చేయించారా?

భరణి ఎలిమినేషన్ విషయంలో శ్రీనివాస్ బెదిరించారు.. భరణి-మాధురి దగ్గరవుతున్నారు అందుకే ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని శ్రీనివాస్ భరణిని ఎలిమినేట్ చేయించారని అంటున్నారు.. ఇది నిజం కాదా.. అంటూ యాంకర్ అడిగారు. దీనికి దువ్వాడ మాట్లాడుతూ భరణి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “చీచీ.. ఎవడో మూర్ఖుడూ, చదువులేనివాడు మాట్లాడుకునే మాటలు సార్ ఇవి.. వాళ్లకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ రకంగా మాట్లాడేవాడి బుద్ధే అంత.. వాడి గురించి నేను మాట్లాడను.. అయినా భరణి గారు చాలా బాగా ఆడారు.. కానీ ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే బంధాల్లో ఇరుక్కుపోయాడు.. గేమ్ ఆడకుండా అందులో ఇరుక్కుపోవడం వల్ల ఆయనకి నష్టం జరిగింది.. లేకపోతే ఆఖరి వరకూ భరణి ఉండాలస్సిన వ్యక్తి.. నేను టాప్-5లో ఆయన ఉంటారని అంచనా వేశాను.. కానీ ఆయన రిలేషన్స్‌లో ఇరుక్కుపోవడం వల్ల వెంటనే బయటికి రావాల్సిన పరిస్థితి ఓటింగ్ ద్వారా వచ్చింది.” అన్నారు.

Read Also: Bigg Boss Thanuja: తనూజ క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. పదేళ్ల క్రితం సాంగ్ ఇప్పుడు వైరల్

మాధురి వెళ్లి బ్లాస్ట్ చేశారు కదా..

దువ్వాడ మాట్లాడుతూ.. “నాకు స్వతహాగా భరణి గారి గేమ్ అంటే చాలా ఇష్టం.. ఆయన చాలా డిప్లమేటిక్‌గా ఆడారు.. ఒక సీనియర్‌గా చాలా కష్టపడి ప్లే చేశారు.. అక్కడక్కడా ఒకరిద్దరితో బంధాలు పెట్టుకుంటే అది గేమ్‌లో అవసరం అని అనుకున్నారేమో ఆయన.. కానీ అది బెడిసికొట్టిందేమో.. ఈలోపు మాధురి కూడా వెళ్లి బ్లాస్ట్ చేశారు కదా.. ఈ రిలేషన్స్ ఏంటని.. అక్కడితో అది భరణి గారికి నెగెటివ్ అయి ఎలిమినేట్ అయ్యారు.. అసలు మాధురి ఇచ్చిన డైలాగ్ వల్లే భరణికి దెబ్బ తగిలింది.. బంధాల్లో ఇరుక్కుపోయిన కారణంగానే భరణికి నెగెటివిటీ వచ్చి ఎలిమినేట్ అయ్యారు.” అంటూ దువ్వాడ చెప్పారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad