Saturday, November 15, 2025
HomeTop StoriesBigg Boss New Promo: కలిసిపోయిన ఇమ్మూ- తనూ.. గోలిసోడా గేమ్ లో గెలుపెవరిదంటే?

Bigg Boss New Promo: కలిసిపోయిన ఇమ్మూ- తనూ.. గోలిసోడా గేమ్ లో గెలుపెవరిదంటే?

Bigg Boss New Promo: బిగ్ బాస్ లో ఇటీవలే షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. భరణి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఇప్పుడు హౌస్ లో పోరు కూడా రసవత్తరంగా సాగుతోంది. అయితే, ఇక ఇవాళ్టి ప్రోమోలో ఒక్కొక్కరూ ఒక్కో రకమైన వింత గెటప్స్‌లో రౌడీల్లా రెడీ అయ్యారు. నా పేరు సైకో సాంబ.. అంటూ డీమాన్ జబ్బల బనియన్ వేసుకొని వచ్చాడు. ఇది చూసి ఎవరివల్ల తయారయ్యావ్ ఇలా.. అంటూ ఇమ్మూ పంచ్ వేశాడు. ఇక నేను టిల్లు బావా ఆడపిల్లలందరికీ బావ.. అంటూ మగరాయుడి గెటప్ వేసుకొని మాధురి నడుము గిల్లేసింది తనూజ. దీంతో టిల్లు బావా ఒకసాకి గిల్లు బావా.. అంటూ తనూజ వెంటపడ్డాడు ఇమ్మూ. దీనికి తనూజ నవ్వుతూ ఇమ్మూ భుజం మీద చేయి వేసి మనకి మనకి వద్దురా.. అంటూ డైలాగ్ వేసింది. అది అందరూ ఇలా ఉండాలి కంఫర్ట్ జోన్‌లో.. అంటూ ముందు జరిగిన గొడవపైన కౌంటర్లు వేశాడు ఇమ్మూ.

- Advertisement -

Read Also: Bigg Boss Telugu: సంజనా.. నీకు నాకు పెళ్లి చూపులా..? నాగ్ షాకింగ్ రియాక్షన్

ఇమ్మూ కామెడీ..

తర్వాత రమ్య కూడా మగ రౌడీలా రెడీ అయింది. ఎవరికన్నా మీసాలు మూతి మీద వస్తాయ్ దీనికేంటి గడ్డం మీద వచ్చినయ్.. మీసాలకి ఏం ఆయిల్ వాడతారు చెప్పరా.. అంటూ పరువు తీశాడు ఇమ్మూ. సుమన్ శెట్టి ఏమో లుంగీ కట్టుకొని పైన కర్చీఫ్ కట్టుకొని గట్టిగానే రెడీ అయ్యాడు. ఇది చూసి సార్ మీరు నాకు తెలుసు యుగానికి ఒక్కడు సినిమాలో విలన్ కదూ.. అంటూ ఇమ్మూ జోకులేశాడు.

Read Also: Bigg Boss Sreeja: బిగ్ బాస్ కోసం మంచి ఉద్యోగం వదిలేశా.. కన్నీళ్లు పెట్టుకున్న శ్రీజ

గోలీసోడా పోటీలో..

తర్వాత రెండు గ్యాంగ్‌లకి గార్డెన్ ఏరియాలో ఒక టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. డబ్బు సంపాదించడానికి మీకు ఇస్తున్న మొదటి అవకాశం.. గోలిసోడా.. ఈ పోటీలో తమ గ్యాంగ్‌లో ఉంటూ తమ తరఫున పోటీ పడటానికి ప్రతి గ్యాంగ్‌స్టర్‌కి ఇద్దరు పోటుగాళ్లు అవసరం.. ఎందుకంటే వారిలో నుంచి ఒకరు 50 సోడాలు కొడుతుంటే ఇద్దరూ కలిసి మొత్తం 30 సోడాలి తాగాలి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో మాధురి టీమ్ నుంచి డీమాన్-రమ్య.. సంజన టీమ్ నుంచి ఇమ్మూ-కళ్యాణ్ ఈ టాస్కులో పోటీపడ్డారు. సోడాలు కొట్టడం ఓకే కానీ తాగేటప్పుడే అందరికీ తీరిపోయింది. 30 సోడాలంటే మాటలు కాదుగా. అయినా ఎలాగోలా ఇమ్మూ-కళ్యాణ్ అయితే సోడాలు బాగానే లేపారు. ఇద్దరూ కలిసి డీమాన్-రమ్య కంటే ఎక్కువగా మొత్తం 22 సోడాలు తాగి ఈ టాస్కులో గెలిచినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad