Sunday, November 16, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Telugu 9: అప్పుడేమో రన్నరప్‌.. ఇప్పుడు కప్పు కోసమే.. మళ్లీ బిగ్‌బాస్‌లోకి హీరో...

Bigg Boss Telugu 9: అప్పుడేమో రన్నరప్‌.. ఇప్పుడు కప్పు కోసమే.. మళ్లీ బిగ్‌బాస్‌లోకి హీరో ఎంట్రీ?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటకే మూడో వారంలోకి అడుగుపెడుతోంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టగా ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అంతేకాక, మూడో వారం నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఈ వారంలో కూడా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో నిలిచారు. మరోవైపు గత సీజన్ల లాగే ఈ సీజన్స్ లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీల ఉండనున్నాయని తెలుస్తోంది. ఐదు లేదా ఆరుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ రెండో దశలో హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. దివ్వెల మాధురి, కావ్య శ్రీ, రమ్య మోక్ష ,రమ్య మోక్ష,  సింగర్ శ్రీ తేజ, జ్యోతి రాయ్‌‌ త్వరలోనే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

బిగ్ బాస్ కంటెస్టంట్ పేరు..

అయితే వీరి కంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల లిస్టులో ఒకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతను ఇప్పటికే ఒకసారి బిగ్ బాస్ లో సందడి చేశాడు. తనదైన ఆట, మాట తీరుతో ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. ఏకంగా రన్నరప్ గా నిలిచాడు. ఈ నటుడికి బుల్లితెరలో ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ బుల్లితెర నటుడు హీరోగా మారిపోయాడు. ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల షూటింగ్ కార్యక్రమాలు కూడా దాదాపు పూర్తి అయ్యాయి. బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 9 లో ఈ నటుడిని కంటెస్టెంట్ గా పంపనున్నట్లు సమాచారం. అది కూడా రాయల్ కంటెస్టెంట్ గా.. అంటే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీల కంటే ఈ ముందే ఈ నటుడి ఎంట్రీ ఉండనుందని సమాచారం.ఇంతకీ అతనెవరు అనుకుంటున్నారా? బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ మళ్లీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హౌస్ లో 13 మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి సమయంలో టీఆర్పీ దృష్ట్యా అమర్ దీప్ ను బి హౌస్ లోకి తీసుకొని వస్తే కచ్చితంగా సీజన్ కి బాగా ఉపయోగపడుతుందని బిగ్ బాస్ టీం భావిస్తోందని సమాచారం. ఇందుకోసం అతనికి ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చేందుకు కూడా నిర్వాహకులు రెడీగా ఉన్నారని టాక్.

Read Also: Bigg Boss Written Updates: సినిమా చూపిస్తానని బిగ్ బాస్ వార్నింగ్.. మళ్లీ మనసులు గెలిచిన ఇమ్మాన్యూయేల్..!

జిమ్ లో అమర్ దీప్..

ఈ విషయంపై ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ అమర్ దీప్ ను కూడా సంప్రదించిందని, అతను కూడా పాజిటివ్ గానే స్పందించినట్లు తెలుస్తోంది. తన సినిమాల కమిట్మెంట్స్, డేట్స్ ని చూసుకొని బిగ్ బాస్ కు వస్తానని అమర్ దీప్ చెప్పాడని తెలుస్తోంది. అయితే, దీనిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే దీనిపై స్పష్టంత రానున్నట్లు తెలుస్తోంది.

Read Also: Bigg Boss Written Updates: వామ్మో తనూజకు కళ్యాణ్ అంటే అదా..? చికెన్ ముక్కల ఆశకు నోరు జారిన రీతూ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad