Sunday, November 16, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Voting: మారిపోయిన ఓటింగ్ స్థానాలు.. టాప్ లో కమెడియన్.. లీస్ట్ లో హీరోయిన్,...

Bigg Boss Voting: మారిపోయిన ఓటింగ్ స్థానాలు.. టాప్ లో కమెడియన్.. లీస్ట్ లో హీరోయిన్, కొరియోగ్రాఫర్

Bigg Boss Voting: బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ మొదటి వారానికి చేరుకోబోతుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ 14వ తేదితో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకోనుంది. అయితే, మొదటి వారంలో బిగ్ బాస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. కాగా.. అతి తక్కువ ఓటింగ్ పడిన కంటెస్టెంట్ ఇంట్లోంచి ఎలిమినేట్ అవుతారని తెలిసిందే. అయితే, ఈ ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో ఓ హీరోయిన్, డ్యాన్సర్ ఉన్నారు. కంటెస్టెంట్ల పర్ఫామెన్స్‌పై శని, ఆది వారాల్లో హోస్ట్ నాగార్జున వచ్చి హౌజ్ కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్, వారి పాజిటివ్, నెగెటివ్‌లపై రివ్యూ ఇస్తాడన్న విషయం తెలిసిందే. ఈ రివ్యూ తర్వాత ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ కంటెస్టెంట్‌ను అనౌన్స్ చేస్తారు. అతి తక్కువ ఓటింగ్ పడిన హౌజ్‌మేట్ బిగ్ బాస్ ఇంట్లోంచి అవుట్ అవుతారని బీబీ ఆడియెన్స్‌కు తెలిసిన విషయమే.

- Advertisement -

Read Also: Bigg Boss Captaincy: రెండు గ్రూపులు కొట్టుకుని సంజనాను కెప్టెన్ చేసేశారుగా..!
నామినేషన్స్ లో 9 మంది
బిగ్ బాస్ తెలుగు 9 మొదటి వారం 9 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వారిలో ఇమ్మాన్యుయెల్, తనూజ, సుమన్ శెట్టి, ఫ్లోరా సైని, శ్రేష్టి వర్మ, సంజన, రామ్ రాథోడ్, రీతూ చౌదరితోపాటు ఒక కామనర్ డిమోన్ పవన్ ఉన్నారు. కాగా.. ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత టాప్ లో సీరియల్ హీరోయిన్ తనూజ నిలిచింది. కాగా.. ఓటింగ్ ముగిసే సరికి.. ఓటింగ్ స్థానాలు మారిపోయాయి. ప్రారంభంలో ఉన్నట్లుగా చివరికి వచ్చేసరికి నామినేట్ కంటెస్టెంట్స్ ఓటింగ్స్ మారిపోయాయి. వీరిలో ఓటింగ్ ప్రారంభంలో తనూజ టాప్ 1లో ఉంటే ఇప్పుడు ఇమ్మాన్యుయెల్ నెంబర్ వన్‌కి వచ్చేశాడు. 23.51 శాతం ఓటింగ్‌తో ఇమ్మాన్యుయెల్ టాప్ 1 స్థానంలోఉన్నాడు. 12.43 శాతంతో తనూజ గౌడ రెండో స్థానానికి పడిపోయింది. 9.55 శాతంతో టాప్ 3లో సుమన్ శెట్టి, 9.32 శాతంతో నాలుగో స్థానంలో డిమోన్ పవన్, 9.27 శాతం రాము రాథోడ్ ఐదో ప్లేసులో ఉన్నారు.

Read Also: Bigg Boss Day 5 Updates: కెప్టెన్ మాట వినలేదు కదా.. పర్యావసనాలు ఏంటో చెప్తా.. సంజనా వీర డైలాగులు

సంజనాకు ఆరో ప్లేస్

అలాగే, ఆరో ప్లేసులో ఉన్న సంజనకు 9.04 శాతం ఓటింగ్ పడింది. జబర్దస్త్ బ్యూటి రీతూ చౌదరి 9.04 శాతం ఓటింగ్‌తో ఏడో స్థానంలో ఉంది. ఇక చివరి రెండు స్థానాల్లో ఫ్లోరా సైనీ, శ్రేష్టి ఉన్నారు. 8.9 శాతంతో 8వ ప్లేసులో ఫ్లోరా, 5 శాతం ఓటింగ్‌తో తొమ్మిదో స్థానంలో శ్రేష్టి ఉన్నారు. ఇక, ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేందుకు డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ ఫ్లోరా సైనీ, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ శ్రేష్టి ఇద్దరు ఉన్నారు. వీరిద్దరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. అయితే, ఈసారి ఎలిమినేషన్ ఉంటుందో ఉండదో తెలియాల్సి ఉంది. మరి ఈ ఎలిమినేషన్ విషయంలో హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ ఏమైనా ట్విస్టులు ఇస్తారో తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad