Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Geetu: ఆ బలుపు, పొగరు మాటలు.. ఆ పిల్ల పుల్ల పెట్టకుంటే అందరూ...

Bigg Boss Geetu: ఆ బలుపు, పొగరు మాటలు.. ఆ పిల్ల పుల్ల పెట్టకుంటే అందరూ జాలీగా ఉండేవాళ్లు..

Bigg Boss Geetu: బిగ్ బాస్ సీజన్ 9లో పికిల్స్ పాప రమ్య మోక్ష జర్నీ ముగిసింది. ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే, నాగార్జున హౌస్ మేట్స్ తో రకరకాల గేమ్స్ ఆడుతూ ఒకొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. చివరకు సంజన, రమ్య మోక్ష ఉండటంతో సంజనను సేవ్ చేసి రమ్యను ఎలిమినేట్ చేశారు. హౌస్‌లోకి వెళ్లిన రమ్య మొదటి వారంలో వెల్డ్ కార్డు అవ్వడంతో నామినేషన్స్ లో లేదు.. కానీ రెండో వారంలో నామినేషన్స్ లో ఉంది. ఇక రమ్యమోక్షకు ఓటింగ్ లో చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. ఇక, ఆమె హౌస్ లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ అమ్మడు హౌస్ మెట్స్ మధ్య ఉండే బాండింగ్స్ గురించే ఎక్కువ మాట్లాడింది. దాంతో ప్రేక్షకులకు కూడా చిరాకు వచ్చింది. దీంతో, ఓట్లు తక్కువ పడ్డాయి బిగ్ బాస్ గేట్లు ఓపెన్ అయ్యాయి. అలా బయటకు వచ్చేసింది.

- Advertisement -

Read Also: Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్ లో పాత కంటెస్టెంట్ రీ ఎంట్రీ.. నామినేట్ చేస్తూ ఒక్కొక్కరి మాస్క్ తీసేస్తూ

రీతూ రాయల్స్..

రమ్య బయటకు రావడంతో నెట్టింట్లో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. అలాగే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ గీతూ రాయల్ రమ్య మోక్ష ఎలిమినేషన్ పై స్పందించింది. “అలేఖ్య చిట్టి పికిల్స్.. రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యింది. తన కోపమే తన శత్రువు, తన బలుపు తన శత్రువు, తన పొగరే తన శత్రువు, తన మాటలే తన శత్రువు ఇవన్నీ ఆమె కు శత్రువులు.. ఇవన్నీ మార్చుకోవాలి. మొదటి రోజే శ్రీజ వచ్చి మాకు పచ్చళ్ళు వస్తున్నాయా అని అడగ్గానే.. హా వస్తాయిలే కంగారుపడకు అని యాటిట్యూడ్ చూపించింది. అప్పుడే వాళ్ల ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ మారిపోయాయి. ఇక హౌస్ లోని వారి బాండ్స్ బ్రేక్ అయ్యేందుకు రీజనే ఆమె. కళ్యాణ్, తనూజ బాండ బ్రేక్ చేసింది. డీమాన్ దగ్గరకు వెళ్లి రీతూ గురించి తప్పుగా మాట్లాడిం. భరణి దగ్గరకు వెళ్లి బంధాలు పెట్టుకోవడం వల్లే మీ గేమ్ ఇలా ఏడ్చింది అని చెప్పింది.

Read Also: Ramya Moksha: ఈ మాత్రం దానికి ఇంత హడావిడి ఎందుకో.. పికిల్స్ పాపపై ట్రోల్స్..!

గొడవ వల్లే..

ఆ పిల్ల గొడవ పెట్టకుండా ఉంటే వాళ్లు ఇప్పటికే జాలీగా ఉండేవారు.. మనకు ఎదో కంటెంట్ అన్నా వచ్చిఉండేది. ఇప్పుడు కంటెంట్ లేదు ఏం లేదు ఏం చూడాలో అర్ధమే కావడం లేదు.. అసలు ప్రతి సీజన్ లో ఈ టైం కు మంచిగా ఉండేది.. హౌస్ మేట్స్ మధ్య రైవల్రి.. పోటా పోటీగా జరుగుతుండేది. ప్రోపర్ ఫ్రెండ్ షిప్ ఉండేది.. ఇప్పుడు అదేం లేదు.. నాకు తుప్పాస్ ఫ్రెండ్ షిప్ లా అనిపిస్తుంది. ఇక రమ్య ఒక్క టాస్క్ కూడా బాగా ఆడింది నేను చూడలేదు . ఈ వారం అంతా నామినేషన్స్ లో ఉన్నా కూడా ఈ వారమంతా తన పర్ఫామెన్స్ లేదు.. కనీసం మాటల్లో అన్నా మారిందా అంటే అది కూడా లేదు. ఆ బలుపు మాటలు, పొగరు మాటలను అన్ని తనను ఎలిమినేట్ చేశాయి” అనీ చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Geetu Royal (@geeturoyal_)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad