Bigg Boss Written Updates: వాటెండ్ పేట అంటూ బిగ్‌బాస్ హౌస్‌ని గ్యాంగ్‌స్టర్‌ల అడ్డాగా మార్చేశారు. మాస్ మాధురి-సంజన సైలెన్సర్ ఇద్దరూ తమ గ్యాంగ్స్‌తో కలిసి హౌస్‌లో వీరంగం చేస్తున్నారు. అయితే తనూజ-సుమన్ శెట్టి కలిసి నిన్నటి ఎపిసోడ్‌లో సంpన టీమ్ క్యాష్‌ని స్టోర్ రూమ్ నుంచి కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో సంజన టీమ్ హర్ట్ అయిపోయి మేము ఇక గేమ్ ఆడం అంటూ భీష్మించుకొని కూర్చుంది. ఇది చూసి మాధురి కూడా సపోర్ట్ చేసింది. కొట్టేసింది తనూజ-సుమన్-దివ్య కలిసి పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ విషయం తెలిసి నిజంగానే డబ్బులు కొట్టేశారా అని తనూజని వెళ్లి అడిగింది మాధురి. కానీ తనూజ నాకేం సంబంధం లేదు నేను తీయలేదు అంటూ అబద్ధం చెప్పింది. దీనికి హర్ట్ అయి అలిగిన మాధురి కిచెన్‌లోకి వెళ్లింది. ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని తనూజ వస్తే మాధురి గట్టిగానే రియాక్ట్ అయింది. ఆపేయ్ తనూజ నాకు చిరాకు.. నన్ను నమ్మిన వాళ్లు నన్ను మోసం చేస్తే నేను తట్టుకోలేను.. నేను కొంతమందితో మాత్రమే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాను.. నాకు గేమ్ అవసరం లేదు.. నాకు మనుషులే ముఖ్యం.. అంటూ రియాక్ట్ అయింది మాధురి. ఇంతలో రీతూ వచ్చి నీకు టీమ్ ముఖ్యం కాదా అంటూ తనూజపై ఫైర్ అయింది. దీంతో అంటే టీమ్ బొక్క వాళ్ల దృష్టిలో అంటూ నోరు జారింది.
Read Also: Bigg Boss Bharani: భరణి ఎలిమినేషన్ పై దువ్వాడ సంచలన వ్యాఖ్యలు
మాధురిపై సంజన ఫైర్..
మాధురి సపోర్ట్ చేయడంతో సంజన కాస్త ఫైర్ అయింది. దివ్య నువ్వు మా క్యాష్ తీశావా అని అడిగింది. నేను తీయలేదు నాకు గుర్తులేదు.. అంటూ దివ్య చెప్పడంతో సంజన సీరియస్ అయింది. ఓకే రేపటి నుంచి నువ్వు లేకుండా గేమ్ ఆడతాం.. ఇదే పనిష్మెంట్ అంటూ సంజన అంది. దీంతో దివ్య ఫైర్ అయింది. మీరు ఎగ్స్ కొట్టేసినప్పుడు లేదా.. అన్ ఫెయిర్ అయినప్పుడు ఇది కూడా ఫెయిర్‌యే మీకు ఒక రూల్ మాకు ఒక రూల్ ఉండదు కదా అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో సంజన హర్ట్ అయింది. కొట్టేసిన క్యాష్ గురించి మాధురి చివరికి డీల్ చేసింది. రూ.6 వేలు కొట్టేయగా.. రూ.3 వేలు మాత్రమే మాధురికి ఇచ్చారు. దీంతో, ఆ క్యాష్ తో పాటు గోలీసోడా టాక్ గెలిచినందుకు వచ్చిన క్యాష్ ని టీమ్ మెంబర్స్ కు పంచేసింది. ఇక తన కోటాలో వచ్చిన 6 వేల క్యాష్‌ని దాచినట్లు చెప్పింది.
Read Also: Bigg Boss Thanuja: తనూజ క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. పదేళ్ల క్రితం సాంగ్ ఇప్పుడు వైరల్
దొంగతనం కరెక్టే
ఉదయకం కాగానే కొట్టేసిన క్యాష్ గురించి మాధురి టీమ్ డిస్కస్ చేసుకుంది. నేను ఏమన్నాను బిగ్‌బాస్ కాల్ కోసం చూశాను.. బిగ్‌బాస్ ఒకవేళ అన్‌ఫెయిర్ అయ్యుంటే వాళ్ల డబ్బులు అప్పుడే ఇచ్చేసి మీ డబ్బులు ఉంచుకోండి ఆడుకోండి అని చెప్పుండేవాళ్లు.. చెప్పలేదు కనుక దొంగతనం ఫెయిర్ గేమ్ అని డిసైడ్ చేశారు.. సో దొంగతనం చేసుకోవచ్చు.. అయితే మేము చేయాలంటే నిమిషం పట్టదు కళ్యాణ్ జేబులో ఉన్నాయి మేము లాక్కోగలం పీక్కోగలం అని వాళ్లు అంటే మీకు దమ్ముంటే లాక్కొని పీక్కోండి ఎవరు వద్దని చెప్పలేదు అన్నాను.. మొన్న వీడు (గౌరవ్) కెప్టెన్ అవ్వడానికేమో డిఫరెంట్ స్ట్రాటజీలు చేయొచ్చు.. నేనేమో వీడికి ఆడటానికి కూడా వద్దు.. నేను ఓడిపోతానట వీడు ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని నా ముఖం మీద వచ్చి చెప్తాడు.. ఈరోజు ఏమో ఫెయిర్‌నెస్ కోసం మాట్లాడతన్నాడు.. అంటూ మాధురి ఫైర్ అయింది.


