Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Divvala Madhuri: రాజాకి రోజా.. భరణికి ముల్లు దించిన అక్క

Divvala Madhuri: రాజాకి రోజా.. భరణికి ముల్లు దించిన అక్క

Divvala Madhuri: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఈ వారం దివ్వెల మాధురి ఎలిమినేట్ అయింది. అందరూ ఊహించినట్లే మాధురి ఈ వారం ఔట్ అయింది. అయితే మాధురిని సేవ్ చేసుకునే ఛాన్స్ ఉన్నా కూడా తనూజ దాన్ని వాడుకోలేదు. ఇది చూసి ఆడియన్స్ కూడా అవాక్కయ్యారు. సండే ఎపిసోడ్‌ అటు ఎంటర్‌టైన్‌మెంట్ ఇటు ఎమోషన్‌తో నిండిపోయింది. ఫస్టాఫ్ అంతా ఆటలు, పాటలు.. హీరోయిన్ రష్మిక మందన రాకతో కలర్‌ఫుల్‌గా సాగిపోయింది. తన కొత్త సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రమోషన్స్ కోసం రష్మిక, హీరో దీక్షిత్ బిగ్‌బాస్‌లో సందడి చేశారు. వీరి ముందు హౌస్‌మేట్స్ పలు హిట్ సినిమాల్లో ఐకానిక్ సీన్లను రిక్రియేట్ చేసి నవ్వించారు. మధ్యమధ్యలో నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని నాగ్ సేవ్ చేస్తూ వెళ్లారు. 

- Advertisement -

Read Also: chillies: గ్రీన్ ఆర్ రెడ్.. ఏ మిర్చి తింటే మంచిది

లీస్ట్ లో మాధురి, గౌరవ్

కాసేపటికి మాధురి, గౌరవ్ ఇద్దరి కళ్లకి గంతలు కట్టి కారులో ఎక్కించారు. మీ ఇద్దరిలో లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్లు ఎలిమినేట్ అవుతారు.. ఇంకొకరు సేవ్ అయి మారుతి సుజుకీ కారులో లోపలికి వస్తారు..అని నాగార్జున చెప్పారు. కాసేపటికి మాధురికి లీస్ట్ ఓటింగ్ వచ్చిందంటూ స్క్రీన్ మీద ఫొటో వచ్చింది. దీంతో బాటమ్ 2లో లీస్ట్ ఓటింగ్ వచ్చింది మాధురి.. తనూజని గోల్డెన్ బజర్ యూజ్ చేస్తావా లేదా.. నువ్వు ఒక వేళ గోల్డెన్ బజర్ యూజ్ చేసి మాధురిని సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమినేటర్ అవుతాడు.. అని నాగార్జున క్లారిటీగా అడిగారు. అయితే, చాలా సేపు డిస్కర్షన్ తర్వాత తనూజ ఆ పవర్ ని వాడుకోలేదు. దీంతో సో మాధురి ఈజ్ ఎలిమినేటెడ్.. గౌరవ్ ఈజ్ సేఫ్.. అని నాగార్జున ప్రకటించారు. ఈ మాట చెప్పగానే రాము పరిగెత్తుకుంటూ వచ్చి తనూజ కాళ్లు పట్టుకున్నాడు. అయితే, సిల్లీ రీజన్ తో గౌరవ్ ని రాము నామినేట్ చేశాడు. దీంతో, పవర్ వాడొద్దని తనూజను రాముచాలా రిక్వెస్ట్ చేశాడు. ఇక, ఆమె పవర్ యూజ్ చేయకపోయే సరికి రాము ఖుష్ అయిపోయాడు.

Read Also: IND vs AUS: వాహ్.. వాషింగ్టన్ సుందర్.. టీమిండియా ఘన విజయం

మాధురి డిసైడ్ అయ్యింది.

మాధురి స్వయంగా ఈ వారం ఇంటికి వెళ్లిపోవాలని డిసైడ్ అయింది. అందుకే తనూజతో డైరెక్ట్ నామినేషన్ చేయించుకుంది. అదీ కాకుండా సేవింగ్ పవర్ యూజ్ చేయొద్దని ముందే తనూజకి మాధురి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎలిమినేట్ అయిన మాధురి స్టేజ్ మీదకి రావాలని నాగ్ పిలిచారు. మాధురి స్టేజ్ మీదకి రాగానే ఎక్స్‌పెక్ట్ చేశారా.. అని నాగ్ అడిగారు. చేశా సార్ నిజానికి ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్నా.. నవంబర్ 4 మా ఆయన బర్త్‌డే సార్.. అని చెప్పింది. ఇక ఏవీలో తన జర్నీని చూసి ఆమె ఎమోషనల్ అయ్యింది. కంటెస్టెంట్లకు మూడు రోజాలు, మూడు ముళ్లులు ఇవ్వాలని నాగ్ చెప్పాడు. తనూజకు రోజా ఇవ్వగానే రాజాకు రోజా అని నాగ్ నవ్వులు పూయించాడు. ఆ తర్వాత డీమాన్, పవన్ కళ్యాణ్ కు రోజెస్ ఇచ్చింది. వెళ్తూ వెళ్తూ దివ్య, భరణిలను టార్గెట్ చేసింది. వారికి ముళ్లులు ఇచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad