Bigg Boss Wildcard Entries: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఐదో వారంలోకి అడుగుపెట్టింది. అయితే, ఈ రియాలిటీ షో నుంచి ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. మరోవైపు, గత సీజన్లలో మాదిరిగానే ఈసారి కూడా వైల్డ్ కార్ట్ ఎంట్రీలు ఉండనున్నాయి. ఇప్పటికే కామనర్స్ విభాగం నుంచి దివ్య నిఖిత హౌస్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారుని తెలుస్తోది. వారి పేర్లు కూడా సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య, సుహాసిని, కావ్య, అమర్ దీప్, ప్రభాస్ శీను, యూట్యూబర్ అఖిల్ రాజ్ లు హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది. వీరితో పాటు ఒక అందాల తార పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ దర్శకులపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన ప్రముఖ మోడల్, సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్ మౌనీషా చౌదరి. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.
Read Also: Emmanuel Love Story: ఇమ్మూ లవర్ ఫొటో వైరల్.. ఆమె డాక్టర్ అయితే ఈమె ఎవరు?
బడా డైరెక్టర్ పై సంచలన కామెంట్స్..
2016లో ‘మిస్ ఆసియా ఉతా’గా కిరీటం గెలుచుకుంది మౌనీషా చౌదరి. అయితే, స్నో అక్కగా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్దిరోజుల క్రితం అమెరికా వెళ్లిన మంచు విష్ణుతో కలిసి ‘కన్నప్ప’ ప్రమోషన్స్ లోనూ పాల్గొందీ అందాల తార. అయితే ఆ మధ్యన ఓ టాలీవుడ్ బడా దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది. సినిమా అవకాశం ఇస్తానని చెప్పి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ వాపోయింది. సదరు డైరెక్టర్ తన థైస్ సైజ్ గురించి అడిగాడని, ఆ సమయంలో ఆ ఆఫర్‌ను తిరస్కరించినప్పటికీ, ఆ డైరెక్టర్ ఇప్పుడు పెద్ద స్టార్స్‌తో పెద్ద సినిమాలు తీస్తున్నాడని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కాస్టింగ్ కౌచ్ గురించి మరోసారి చర్చను రేకెత్తించాయి. అయితే ఆ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో మాత్రం చెప్పలేదు మౌనీష. మొత్తానికి కొత్త కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో బిగ్‌బాస్ మరింత ఆసక్తికరంగా మారనుందని చెప్పవచ్చు. అయితే ఆ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరో మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఒకవేళ మౌనీష హౌస్ లోకి వెళ్తే కచ్చితంగా షో మరింత ఇంట్రెస్టింగ్ గా మారనుంది.
Read Also: Thanuja- Pawan Relationship: తనూజ- పవన్ సాయి రిలేషన్ షిప్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!


