Nagarjuna Akkineni: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్ కోసం అందరూ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేశారు. అనుకున్నట్లు వచ్చీ రాగానే నాగార్జున వైల్డ్ కార్డులపైన వాయించేశాడు. ఈ ఎపిసోడ్‌లో మాత్రం మాధురిని బుజ్జగిస్తూ.. ఏకంగా రేషన్ మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చేశాడు. అటు పవన్ కళ్యాణ్- తనూజలకు బయట ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వివరించారు. మరి ఇంకా ఏమేం జరిగాయో ఇప్పుడు చూసేద్దాం.
వైల్డ్ కార్డులతోనే మాట్లాడిన నాగ్..
ఈ ఎపిసోడ్ లో నాగార్జున ఎక్కువగా వైల్డ్‌కార్డులతోనే మాట్లాడాడు. తమిళ బిగ్‌బాస్ బాగుందా? ఇక్కడ బాగుందా? అని అడగ్గా ఆయేషా.. తమిళ్ కంటే ఇక్కడే బాగుంది అని నవ్వింది. పచ్చళ్ల పాప రమ్యను సైతం హౌస్ బాగుందా? అని అడగ్గా చాలా బాగుందని మెలికలు తిరిగిపోయింది. బాగుందా? లేదంటే చాలా బాగున్నాడా? అని పంచ్ వేశాడు నాగ్. దీంతో రమ్య వెంటనే.. డీమాన్ పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ అని తడుముకోకుండా చెప్పేసరికి హౌస్‌మేట్స్ షాకైపోయారు. కళ్యాణ్-తనూజల బంధంపై అందరూ ఏమనుకుంటున్నారు? ఏంటనేది వీడియోలతో వారికి క్లారిటీ వచ్చేలా చేశాడు నాగ్. అయితే తనూజకు అప్పటికే ఓ క్లారిటీ ఉంది. కళ్యాణ్ చిన్నపిల్లోడు సర్ అనేసింది. అటు అతడు కూడా జనరేషన్ గ్యాప్ ఉందని చెప్పాడు.
Read Also: Bigg Boss Updates: ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టిన సుమన్ శెట్టి.. క్లాప్స్ కొట్టిన లేడీస్
పచ్చళ్ల పాపకు పడిందిగా..
ఇప్పుడిక రమ్య వంతు వచ్చింది. ఈమె వచ్చీరావడంతోనే కళ్యాణ్‌కు అమ్మాయిల పిచ్చి ఉందని అతడిపై ముద్ర వేసింది. రమ్య కామెంట్స్.. నోరెళ్లబెట్టిన కళ్యాణ్‌నిజానికి కళ్యాణ్ చూపులు, ప్రవర్తన.. కాస్త తేడాగా ఉన్నప్పటికీ మరీ అమ్మాయిల పిచ్చి అనేయడం తప్పుగానే అనిపించింది! నాపై చేతులు వేసి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటిచ్చేస్తాను అని రమ్య మాట్లాడిన వీడియోను కన్ఫెషన్ రూమ్‌లో ప్లే చేశాడు నాగ్. అది చూసి నోరెళ్లబెట్టాడు కళ్యాణ్. ఒకరిని అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వేమీ అతడిని జీవితాంతం చూడలేదని కౌంటరిచ్చాడు నాగ్. కళ్యాణ్‌ను అమ్మాయిల పిచ్చి అనడం తప్పని రమ్యను హెచ్చరించాడు. కళ్యాణ్ అమ్మాయిలతో ప్రవర్తించే తీరు సరిగా ఉందా? లేదా? అని ప్రేక్షకుల్ని అడగ్గా సగం మంది అవునని, మిగతా సగం మంది కాదని బదులిచ్చారు. ప్రేక్షకుల రెస్పాన్స్‌కు కళ్యాణ్ షాకయ్యాడు. అంటే జనాల్లో తనపై ఏ విషయంలో వ్యతిరేకత ఉందో ఈ ఎపిసోడ్‌తో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా మారాడు. ఇంకా ఆటపై ఫోకస్ పెడితే మాత్రం కళ్యాణ్ విన్నింగ్ రేస్‌లో దూసుకుపోవడం ఖాయం!
Read Also: Bigg Boss Telugu: మహరాణి మాధురి 200% కరెక్ట్.. కాకపోతే స్పెషల్ పవర్ ఊస్ట్..!
షాకైన డీమాన్
ఇక డీమాన్- రీతూల బంధంపై వారికే సరిగా క్లారిటీ లేకుండా పోయింది. ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుని ఆటపై ఫోకస్ చేయమన్నాడు నాగ్. అలా ఈ ఎపిసోడ్‌లో మాధురి, నిఖిల్ పవర్ పోగా.. రమ్య, ఆయేషా, శ్రీనివాస్ సాయిల పవర్ మాత్రం అలాగే ఉంది. చివర్లో ఇమ్మాన్యుయేల్‌కు కళ్లు నెత్తికెక్కాయి. పొగరు పెరిగిపోయిందంటూ కాసేపు ఆడుకున్న నాగ్ చివరకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు ఫుడ్ పార్టీ ఉంటుందన్నాడు. ఆ తర్వాత మాధురిని కొత్త రేషన్ మేనేజర్ చేశాడు.


