Friday, December 12, 2025
Homeబిగ్‌బాస్ 9Prince Yawar: తనూజతో ప్రిన్స్ డ్యాన్స్.. కుళ్లి కుళ్లి ఏడ్చిన కళ్యాణ్

Prince Yawar: తనూజతో ప్రిన్స్ డ్యాన్స్.. కుళ్లి కుళ్లి ఏడ్చిన కళ్యాణ్

Prince Yawar: మాజీ కంటెస్టెంట్ల వరుసగా ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌ తెలుగు సీజన్ 9లో పోరు రసవత్తరంగా మారింది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో సీజన్ 4 ఫైనలిస్ట్ సొహైల్ ఎంట్రీ ఇచ్చి.. కథ వేరే ఉండది అంటూ ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు. ఇక సీజన్ 7 ఫైనలిస్ట్ ప్రిన్స్ యావర్ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సొహైల్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ మోడ్‌లో వెళ్తే.. యావర్ మాత్రం తనూజ కోసం.. తనూజ కావాలి.. అన్నట్టుగా పులిహోర కలిపేశాడు. హాయ్ తనూజా… అంటూ పేరుని బారులెక్క సాగదీసి మరీ టైట్ హగ్ ఇచ్చాడు. ఆ తరువాత.. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అని అడిగాడు. దానికి తనూజ.. నో అని చెప్పింది. దాంతో మనోడు చెలరేగిపోయాడు. తనూజ వైపు చూస్తూ.. ‘తను ఫైర్.. నాలాగే’ అంటూ పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు. ఇక మన ఎడిటర్ మామ పడిపోయా.. పడిపోయా అని మంచి రొమాంటిక్ సాంగ్ వేశాడు.

- Advertisement -

Read Also: Bigg Boss Sohel: అట్లుంటది సొహైల్ తోటి.. కథ వేరుంటదంతే

ఎడిటర్ మామకు పడిపోయిన యావర్..

ఇక, ఎడిటర్ పాటవ వేయగానే.. ప్రిన్స్ యావర్ నిజంగానే తనూజ ప్రేమలో పడిపోయాడు. మోకాళ్లపై కూర్చుని మరీ ఆమెకి ప్రపోజ్ చేశాడు. తనూజ అయితే తెగ సిగ్గుపడిపోయింది. ఇక ఇదే మంచి అవకాశం అనుకున్నాడో ఏమో కానీ.. తనూజని ఎత్తుకుని జిమ్నాస్టిక్ స్టెప్‌లు వేయిస్తూ.. తెగ రొమాన్స్ చేశాడు. ఒక్కసారి ఎత్తుకుని కిందికి దింపేసి వదిలేయకుండా.. సాంగ్‌ని మళ్లీ కంటిన్యూ చేస్తూ.. ఆమెను అదే పనిగా ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు. మనోడైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఆ టైమ్‌లో కళ్యాణ్ ఫేస్ చూడాలబ్బా.. ప్లేట్ లోని చికెన్ ముక్కను కాకి ఎత్తుకుపోయినట్లు.. ఇంకా చెప్పాలంటే, అంతకంటే ఎక్కువ ఫీల్ అయిపోయాడు. అది లైవ్ ఎపిసోడ్ లో కన్పించింది.

Read Also: Bigg Boss Bharani: భరణి ఏజ్ తెలుసుకుని ఏం చేస్తారు?

ఇమ్మూపై సెటైర్

ఎక్కువ స్ట్రెస్ తీసుకోకురా.. పైన మొత్తం ఊడిపోతుంది అని ఇమ్మానుయేల్‌ని అన్నాడు యావర్. ‘స్ట్రెస్ కోసం నువ్వు చెప్తున్నావా?’ అని పెద్దగా నవ్వేశాడు ఇమ్మానుయేల్. అతనిలో నీకు ఏం నచ్చుతుంది? అని రీతూ అడిగితే.. ‘పెద్ద పొట్ట’ అని అన్నాడు యావర్. తర్వాత, కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మానుయేల్‌తో పోటీపడ్డాడు యావర్. అయితే ఆ సీజన్‌లో యావర్ టాస్క్ కింగ్ అయితే.. ఈ సీజన్‌లో ఇమ్మానుయేల్ కింగ్ కాగా.. వీళ్లిద్దరి టాస్క్ రసవత్తరంగా జరిగింది. అయితే యావర్‌కి బాడీ ఉంది.. ఇమ్మానుయేల్‌కి బాడీతో పాటు బ్రెయిన్ కూడా ఉండటంతో అతనే గెలిచినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఎపిసోడ్ లో గెస్టులుగా వచ్చిన ప్రిన్స్ యావర్, సొహైల్ మధ్య ఓ కామన్ పాయింట్ ఉంది. ఇద్దరూ ఫైనల్ చేరారు. అంతేకాకుండా, ఇద్దరూ సూట్ కేసులు తీసుకుని గేమ్ నుంచి ఔట్ అయ్యారు. సీజన్ 4లో సొహైల్ పాతిక లక్షల సూట్ కేసు తీసుకుని గేమ్ నుంచి క్విట్ కాగా.. సీజన్ 7లో యావర్ రూ.15 లక్షల సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేశాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News