Bigg Boss Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డులు ఎంట్రీ ఇచ్చాక కాస్త హైప్ పెరిగింది. ఇక, భరణి ఎలిమినేషన్ తర్వాత మళ్లీ గేమ్ చప్పగా సాగుతోంది. దీంతో, హైప్ ఇచ్చేందుకు, ఆటలో ఎనర్జీ నింపేందుకు బిగ్ బాస్ హౌస్ లోకి అమర్ దీప్, అర్జున్ అంబటి ఎంట్రీ ఇచ్చారు. ఏం అనుకున్నారో ఏమో కానీ.. మళ్లీ పాత కంటెస్టెంట్స్‌ని రంగంలోకి దింపారు. సీజన్ 7 రన్నర్ అమర్ దీప్, ఫైనలిస్ట్ అంబటి అర్జున్‌లను పోలీసులుగా హౌస్‌లోకి పంపారు. వాళ్లిద్దరూ డ్యూటీ ఎక్కేసిన వినోదాన్ని ఎంత పండించాలన్నా అది బలవంతపు రుద్దుడులాగే అనిపిస్తుంది. సంజన సైలెన్సర్ వర్సెస్ మాస్ మాధురి గ్యాంగ్స్ మధ్య గ్యాంగ్ వార్ జరుగుతుండగా.. వాళ్లని పట్టుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్లుగా వెళ్లారు. సీజన్ 7లో వీళ్లిద్దరూ పోలీస్ ఆఫీసర్లుగా చేసిన ఎపిసోడ్ బాగా పేలడంతో.. ఇప్పుడు అదే గెటప్‌లతో హౌస్‌లోకి పంపారు.
Read Also: Bigg Boss Updates: సంజనా- దివ్య మధ్య “చెత్త” గొడవ?
కంటెస్టెంట్స్ కి ఓపెన్ ఆఫర్..
అయితే, ఇప్పుడు వీళ్లిద్దరూ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మాస్ మాధురి, సైలెన్సర్ సంజనలను పట్టిచ్చిన వాళ్లకి డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ షిప్ ఆఫర్ చేశారు. ఒక్కొక్కర్నీ యాక్టివిటీ రూంలో ఉన్న వ్యాన్‌లోకి పిలిచి.. విచారణ స్టార్ట్ చేయడంతో ఆట ఎంటర్ టైన్మెంట్ మోడ్‌లోకి వెళ్లింది. ఇద్దరూ కాకుండా ఒక్కర్ని పంపిస్తే అని తనూజ అనడంతో.. ఒక్కరైనా ఓకే అంటూ అమర్ దీప్ నవ్వులు పూయిస్తున్నాడు. ఆ తర్వాత.. ప్రేమ జంట రీతూ చౌదరి, డీమాన్ పవన్‌లను కూడా పిలిచి.. వాళ్ల గురించి కూపీలాగారు. అయితే సందర్భం ఏదైనా సరే.. తనకి అనుకూలంగా మార్చుకుని.. ఫన్ జనరేట్ చేసే సత్తా ఉన్న ఇమ్మానుయేల్ అయితే.. ‘మాధురి, సంజనలను పట్టించేస్తా సార్.. మీ స్టేషన్‌లోనే పెరిగినోడ్ని.. అక్కడే కప్పులు కడుక్కుంటూ పెరిగినోడ్ని.. నా గురించి మీకు తెలియదా సార్.. అంటూ స్టార్ మా ఛానల్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఫన్ జనరేట్ చేశాడు ఇమ్మూ.
Read Also: Bigg Boss Updates: బిగ్ బాస్ లో ప్రేమ జంట బ్రేకప్.. అంతలోనే ప్యాచప్
డీల్ కి ఒప్పుకున్న తనూజ
ఇక పోలీసుల ఆఫర్‌ని సరేనన్న తనూజ.. వాళ్లని పట్టించేస్తా అంటూ డీల్‌కి ఒప్పుకుని తీసుకుని వెళ్తుంది. మరి వాళ్ల డీల్ సెట్ అయ్యిందో లేదో ఏమో కానీ.. ఈవారం టాస్క్ అయితే, ఏ మాత్రం ఇంట్రస్ట్ లేదు. అమర్ దీప్, అర్జున్ అంబటిలను తీసుకొచ్చినా కూడా.. బోరింగ్ తప్పితే.. చూడదగ్గట్లుగా అస్సలు అనిపించడం లేదు. ఆల్రెడీ గ్యాంగ్ స్టర్స్ ఎవరో పోలీసులకు తెలుసు.. మళ్లీ వాళ్లే గ్యాంగ్ స్టర్స్ ఎవరో చెప్పండని ఎంక్వైరీ చేయడం.. సోదిలాగే సాగుతోంది. అమర్ దీప్, అర్జున్ అంబటిలు వచ్చినా కూడా సరైన కంటెంట్ ప్లానింగ్ చేయలేకపోయింది బిగ్ బాస్ టీం. దీంతో, ఈ వారం ఎపిసోడ్ అంతా సప్పగా సాగిపోయినట్లైంది.


