Bigg Buzz: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సింగర్ రాము రాథోడ్ స్వచ్ఛందంగా షో నుంచి బయటకు వచ్చేశాడు. కుటుంబ సభ్యులు గుర్తొస్తున్నారని చెప్పి సెల్ఫ్ నామినేట్ అయి ఎలిమినేట్ అయ్యాడు. పెద్దగా నెగటివిటీ లేకుండా గేమ్ ఆడిన కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందాడు. ఆయన సడెన్ డిసిషన్‌తో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత రాము తాజాగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూకు యాక్టర్ శివాజీ హోస్ట్ గా విడుదలైన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం.
Read Also: Bigg Boss: పాపం సాయి.. లక్ వచ్చినట్లే వచ్చి కిక్ ఇచ్చింది..!
రాను బొంబాయికి రాను..
ప్రోమో ప్రారంభంలో శివాజీ “రాను బొంబాయి కి రాను” అనే రాము రాథోడ్ సూపర్ హిట్ పాటతో ఆయనకు స్వాగతం పలికాడు. ఆ పాటకు ఇద్దరూ కలసి స్టెప్పులు వేయడంతో స్టూడియో మొత్తం సందడి చేసింది. అయితే ఆ సరదా సన్నివేశం తర్వాత ఇంటర్వ్యూ టోన్ ఒక్కసారిగా మారిపోయింది. శివాజీ మొదటి నుంచే రాము రాథోడ్‌ను తనదైన స్టైల్లో రోస్ట్ చేశాడు. ఇంటర్వ్యూలో శివాజీ ” రాను బొంబాయి కి రాను అనే పాట చేయడానికి ఎన్ని రోజులు పట్టింది?” అని అడగగా, రాము “దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది” అని చెప్పాడు. దీనికి శివాజీ సీరియస్ టోన్‌లో “ఒక సక్సెస్ రావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. కానీ, బిగ్ బాస్ హౌస్‌లో కప్పు కొట్టడానికి 15 వారాలే చాలు కదా?” అంటూ శివాజీ సూటిగా కామెంట్ చేశాడు. “ఎవరైనా బిగ్ బాస్ షో చూడడానికి మాత్రమే వస్తామనుకుంటే హౌస్ లోకి రాకండి. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడం అంటే బస్సు ఎక్కడం కాదు. ఇది కోట్ల మందికి కల. నీకు కావాలంటే వస్తా, వెళ్లిపోతా అని అనడం సరైంది కాదు” అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
Read Also: Jabardasth Emmanuel: బిగ్ బాస్ లో ఇమ్మూ సంచలన రికార్డు
కన్ఫ్యూజ్ అయ్యాడని..
ఇక రాము హౌస్‌లో ఉన్నప్పుడు కన్ఫ్యూజ్‌గా కనిపించాడని టాపిక్‌కి వచ్చేసిన శివాజీ, “బయట కూడా ఇలానే ఉంటావా రామూ? నీ క్లారిటీ ఏమిటి?” అంటూ సూటిగా ప్రశ్నించాడు. రాము “బయట క్లారిటీగా ఉంటా” అని సమాధానం ఇవ్వగానే, “మరి కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు?” అంటూ శివాజీ మళ్లీ విరుచుకపడ్డారు. రాము సమాధానమిస్తూ “హౌస్‌లో ప్రతి ఒక్కరి మెంటాలిటీ వేరుగా ఉంటుంది, మాటలతో మాయ చేస్తారు” అన్నాడు.అదిగో అక్కడినుంచే శివాజీ ర్యాప్ మొదలెట్టాడు “అంటే మాటలతో మాయ చేస్తే మారిపోతావా?” అని మరోసారి ప్రశ్నించాడు. రాము ‘లేదు’ అని సమాధానం ఇచ్చినా, శివాజీ “బయట కూడా ఇలా జరిగితే దూరం అవుతావా?” అంటూ క్లాస్ పీకేశాడు. ఇక ఇంటర్వ్యూ మూడ్ మార్చి, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌పై అభిప్రాయం అడిగాడు. మొదట సంజనా ఫోటో చూపించగా.. లక్కీ అనే బోర్డు చూపించాడు రామ్. ‘అంటే సంజన లక్కీ తో లాక్కొస్తుందా?’ అని ప్రశ్నించగా, వెంటనే రాము నవ్వుతూ.. ‘అక్కడ స్కోప్ లేకుండా సరే.. ఆమె అందులోకి దూరిపోతుంది’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెంటనే శివాజీ “నువ్వు దూరతావు కానీ మాట్లాడవు, ఆమె దూరితే ఏదో చేస్తుంది కదా” అంటూ సెటైర్ వేశాడు.
గౌరవ్ కాంట్రవర్సీ పై..
ఆ తరువాత గౌరవ్-సంజనా కాంట్రవర్సీ గురించి ప్రశ్నించారు. “గౌరవ్ సంజనను లాగాడా లేక ఆమెనే దిగిందా?” అని ప్రశ్నించాడు. రాము “నేను సరిగా చూడలేదు” అని బదులిచ్చాడు. వెంటనే శివాజీ “రాము బాయ్, తుమారా కన్ఫ్యూజ్ హోరా హాయ్!” అంటూ పంచ్ వేశాడు. ఈ ప్రోమోలో శివాజీ తన పంచ్‌లతో, హ్యూమర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా, రాము సమాధానాలు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. నెటిజన్లు “ప్రోమో ఇంత ఎంటర్టైనింగ్‌గా ఉంటే, ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.


