Bigg Boss Elimination: బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష జర్నీ ఎండ్ అయినట్లేనా. సిచ్యువేషన్ చూస్తే అలానే అన్పిస్తోంది. హౌస్ లో ఆమె ఒక్క వారానికే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. ఈ వారం ఎలిమినేషన్లో ఉన్న ఆమెకు ఓటింగ్ లో ఉన్న నెగెటివిటీనే ఇందుకు కారణం. మరి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఏడో వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలు వచ్చాక మరింత హోరాహోరీగా మారుతుందనిపించింది. కానీ మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నట్లు అయిపోయింది పరిస్థితి. ఈ వారం హౌస్ నుంచి వెళ్లిపోయేందుకు ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ఇందులో తనూజ, కల్యాణ్, దివ్య నిఖిత, సంజన గల్రానీ, రాము రాథోడ్, రీతు చౌదరీ, శ్రీనివాస్ సాయి, రమ్య మోక్ష ఉన్నారు.
Read Also: Bigg Boss Promo: ఒక్కరైనా ఓకే.. తనూజతో అమర్, అర్జున్ ల డీల్ సెట్
పికిల్స్ పాప..
బిగ్ బాస్ ఎలిమినేషన్ ఏడో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ట్రెండ్ ప్రకారం చూస్తే పికిల్స్ పాప రమ్య మోక్షను బయటకు పంపించాలని ఆడియన్స్ గట్టిగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. నోటి దురుసు రమ్యకు ప్రాబ్లెంగా మారింది. తనూజ, కల్యాణ్ ల పర్సనల్ గురించి మాట్లాడటం, ఓవరాక్టింగ్ తదితర కారణాలతో జనాలు చిరాకు పడుతున్నారని తెలిసింది. బిగ్ బాస్ ఓటింగ్ ఏడో వారం బిగ్ బాస్ ఓటింగ్ చూసుకుంటే పికిల్స్ పాప లాస్ట్ ప్లేస్ లో ఉంది. సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి టాప్ లో కొనసాగుతోంది. 37.71 శాతం ఓట్లతో ఆమె నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ఆ తర్వాత కళ్యాణ్ పడాల 20.53 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.
Read Also: Bigg Boss Elimination: అన్నా.. టాస్క్ కాదా? నిజంగానే ఎలిమినేట్ చేస్తున్నారా?
ఓటింగ్ ఎలా ఉందంటే?
దివ్య నిఖిత (9.64 శాతం), సంజన గల్రానీ (9 శాతం), రాము రాథోడ్ (8.62 శాతం), రీతు చౌదరీ (6.47 శాతం) ఓట్లతో వరుసగా మూడు, నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. శ్రీనివాస్ సాయి (4.75 శాతం) ఏడో స్థానంలో ఉన్నాడు. రమ్య మోక్ష 3.28 శాతం ఓటింగ్ తో లాస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. లెక్క ప్రకారమైతే ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చాయో వాళ్లను ఎలిమినేట్ చేస్తున్నామని బిగ్ బాస్ వాళ్లు చెప్తున్నారు. కానీ అది నిజం కాదన్నది జనాల మాట. ఎందుకంటే ఈ సీజన్ లో భరణి, శ్రీజ దమ్ము ఎలిమినేషన్ అందుకు నిదర్శనం. దీంతో బిగ్ బాస్ నచ్చినవాళ్లకు ఓటింగ్ తక్కువ వచ్చినా కచ్చితంగా హౌస్ లో కొనసాగిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రమ్య హౌస్ లో ఉంటుందా.. ఎలిమినేట్ చేస్తారో చూడాలి.


