Homeబిగ్‌బాస్Bigg Boss Elimination: ఈసారి ఎలిమినేట్ అయ్యేది అతడేనా?

Bigg Boss Elimination: ఈసారి ఎలిమినేట్ అయ్యేది అతడేనా?

Bigg Boss Elimination: బిగ్ బాస్ 9లో ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్లు జరుగుతున్నాయి. హౌస్ లో బాండింగ్స్, ఏడుపులు, అరుపులు.. అబ్బో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. వారం వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఊహించిన విధంగానే గత వారం హౌస్ నుంచి మాధురి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే ఓట్లు తక్కువ పడటంతో ఆమె బయటకు వచ్చిందని అనుకుంటుంటే ఆమె మాత్రం నేను కావాలనే బయటకు వచ్చేశా అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అని అందరిలో ఆసక్తి మొదలైంది. అయితే ఈసారి హౌస్ నుంచి బయటకు వచ్చేది అతనే అని జోరుగా చర్చ జరుగుతోంది.

- Advertisement -

వైల్డ్ కార్డు ద్వారా..

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా దివ్వెల మాధురి, రమ్య మోక్ష, నిఖిల్, గౌరవ్, సాయి శ్రీనివాస్, అయేషా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఇప్పటికే అయేషా, రమ్య మోక్ష, మాధురి  ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇక ఇప్పుడు సాయి శ్రీనివాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే అవకాశాలు కనిపించనున్నాయి. ఇప్పటికే ఓటింగ్ లో సాయి శ్రీనివాస్ వెనకబడి ఉన్నాడు. మనోడు హౌస్ లో కూడా పెద్దగా యాక్టివ్ గా కనిపించడంలేదు.. టాస్క్ ల విషయంలోనూ సాయి ఎక్కడగా కనిపించడం లేదు. దాంతో ఈసారి నామినేషన్స్ లో ఉన్న సాయి. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓట్లు కూడా అతనికి తక్కువ వస్తున్నాయి. రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఓటింగ్ లో లాస్ట్ లో ఉన్నారు. ఓటింగ్ కు ఇంకా రెండు రోజులు ఉండటంతో ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.

 Read Also: Coffee: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ ధర ఎంతో తెలుసా?

ఎలిమినేషన్ కు రీజన్..

సాయి శ్రీనివాస్‌ ఎలిమినేషన్‌కి మెయిన్ రీజన్ అంటే.. అతను తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చాడు. బయట ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పీఆర్ నెట్ వర్క్ లేదు. గత వారమే నామినేషన్‌లోకి రావాల్సి ఉండగా.. తన దగ్గర ఉన్న స్పెషల్ పవర్‌తో సేవ్ అయ్యాడు. ప్రత్యేకించి.. ఇతనిపై పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు. ఉన్నంతవరకూ ఫెయిర్‌గానే ఉన్నాడు. తొండి ఆటలు ఆడలేదు. అడ్డమైన వాదనకి దిగలేదు. ఫుటేజ్ ఇవ్వడం కోసం కక్కుర్తి పడలేదు. బయట పీఆర్ టీం స్ట్రాటజీలు చేయలేదు. ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు. బయట ఐదు వారాలు ఆట చూసి.. ఎవరి స్ట్రాంగో అని తెలిసి కూడా.. వాళ్లతో బాడింగ్‌లు పెట్టుకుని అడ్డదారిలో హౌస్‌లో ఉండే కక్కుర్తి పనులు చేయలేదు.

 Read Also: Divvala Madhuri: రెమ్యూనరేషన్ గురించి దివ్వెల షాకింగ్ కామెంట్స్

ప్రతి నామినేషన్ లోనూ..

నేను పోటీ పడటానికి వచ్చా.. ప్రాధేయపడటానికి రాలేదు అంటూ బల్లగుద్ది చెప్పాడు. ప్రతి నామినేషన్స్‌లో దమ్మున్న పాయింట్లే పెట్టాడు తప్ప ఎవ్వరికీ భయపడలేదు. తనకి ఓట్లు పడవేమో.. అని ఎట్టి పరిస్థితుల్లోనే సేఫ్ గేమ్ ఆడలేదు. ఎన్ని రోజులు ఉన్నాం అన్నది కాదు.. ఉన్నన్ని రోజులూ కూడా గుండె ధైర్యంతోనే ఆడాడు. కాబట్టి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాకుండా ఎందుకుంటాడు చెప్పండీ. సో 9వ వారం ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్‌ని బట్టి చూస్తే సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ కాబోతున్నాడు. ఓటింగ్‌కి ఇంకా రెండు రోజులు ఉన్నాయి కాబట్టి.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేడు సాయి శ్రీనివాస్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News