Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Telugu 9: షూటింగ్‌లో ఆ స్టార్ హీరోతో ఇబ్బంది పడ్డా.. బిగ్‌బాస్ సంజన...

Bigg Boss Telugu 9: షూటింగ్‌లో ఆ స్టార్ హీరోతో ఇబ్బంది పడ్డా.. బిగ్‌బాస్ సంజన షాకింగ్ కామెంట్స్

Bigg Boss Telugu 9: బుజ్జిగాడుతో తెలుగులో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది కన్నడ బ్యూటీ సంజనా గల్రానీ. ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ తెలుగు హౌస్ లోఉంది. అయితే ఈ అమ్మడు. అయితే, తెలుగు, తమిళ, కన్నడలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సంజనా గల్రానీ ఇప్పుడు బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ లో పార్టిసిపేట్ చేస్తోంది. తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగానే దగ్గరైపోయింది. స్టార్టింగ్ లో గుడ్ల దొంగతనం వల్ల ఆమెపై నెగెటివిటీ కనిపించినా ఇప్పుడు హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారిపోయింది.

- Advertisement -

Read Also: Bigg Boss Wild Card: అబ్బ సాయిరాం.. ఈ సీరియల్ యాక్టర్లందరూ వైల్డ్ కార్డు ఎంట్రీలేనా?

వైరల్ గా ఓల్డ్ వీడియో

అయితే సంజనాకు సంబంధించి ఒక పాత ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. కెరీర్ ప్రారంభంలో ప్రొఫెషనల్ పరంగా ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, వేధింపులను ఈ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. ముఖ్యంగా ఓ హీరో తనను మానసికంగా వేధించాడంటూ సంచలన విషయాన్ని బయట పెట్టిందీ అందాల తార. ‘కన్నడలో ఓ సినిమా షూటింగ్‌ నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఒక స్టార్ హీరో నన్నుబాగా టార్చర్‌ పెట్టాడు. ఆ మూవీ డైరెక్టర్‌తో అప్పటికే అతనికి గొడవలు జరుగుతున్నాయి. అదే సమయంలో షూటింగ్‌ జరగడం.. హీరో వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వాస్తవానికి ఆ సీన్ లో హీరో నా చేతులు పట్టుకొని ముందుకు కదాలాలి. కానీ ఆయన కోపంతో వచ్చి నా చేతులను పట్టుకుని గట్టిగా నొక్కాడు. నొప్పిగా ఉందని చెబితే.. మ్యానేజ్‌ చేసుకో అని సీరియస్‌ లుక్‌తో చెప్పాడు. దీంతో నేను షూటింగ్‌కు బ్రేక్ చెప్పాను.’ అని చెప్పుకొచ్చింది.

Read Also: Bigg Boss Season 12: రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం.. మళ్లీ స్టార్ట్ అయిన బిగ్ బాస్

నేనేమీ దెబ్బలు తినడానికి రాలేదు..

సంజన మాట్లాడుతూ..‘నేనేమీ దెబ్బలు తినడానికి ఇక్కడకు రాలేదు..ఇదేం యాక్షన్‌ సీన్‌ కాదు.. నేను విలన్‌ కాదు..ఈ సీన్‌కి తగ్గట్టుగా నీ మైండ్‌సెట్‌ మార్చుకో.. ఆ తర్వాతే షూటింగ్ చేద్దాం’ అని ఆ హీరోకు చెప్పి అరగంట తర్వాత మళ్లీ ఆ సీన్‌ చేశాం. ఇలాంటి క్రాక్‌ ఉన్నవాళ్లు అప్పుడప్పుడు మననకు తగులుతుంటారు. వారిని పట్టించుకోకుండా..మన పని చేసుకొని పోవాలి’ అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట బాగా వైరలవుతోంది. అయితే తనను వేధించిన హీరో పేరు చెప్పలేదు సంజన. ఇకపోతే, తరుణ్ నటించిన సోగ్గాడు(2005) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సంజన. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే, దుశ్శాసన, యమహో యమ, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి తెలుగు చిత్రల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా, డ్రగ్స్ కేసులోనూ ఇరుక్కుంది. అప్పట్లో ఈ విషయంలో ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కరోనా లాక్ డౌన్ టైంలో సైలెంట్ గా పెళ్లిచేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad