Suman Shetty:బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు మరింత ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే తొమ్మిదో వారం మధ్యలోకి చేరుకుంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఒక కంటెస్టెంట్ హౌస్‌కు గుడ్‌బై చెప్పనున్నారు. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ తొమ్మిదో వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు 9 మంది పోటీదారులు ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారం నామినేషన్స్‌లో భరణి శంకర్, సాయి శ్రీనివాస్, తనూజ పుట్టస్వామి, కల్యాణ్ పడాల, సుమన్ శెట్టి, రాము రాథోడ్, సంజన గల్రాని ఉన్నారు. వీరిలో ఎవరు సేఫ్, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారన్న దానిపై ఓటింగ్ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.
ఆన్‌లైన్ ఓటింగ్ శుక్రవారం అర్థరాత్రి వరకు కొనసాగనుండగా, తాజా ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం కల్యాణ్ పడాల టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఎప్పుడూ నంబర్ వన్‌గా నిలిచిన తనూజ గౌడ ఈసారి రెండో స్థానానికి జారింది. సీనియర్ నటి సంజన గల్రాని మూడో ప్లేస్‌లో నిలవగా, సీరియల్ నటుడు భరణి శంకర్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. హీరో సాయి శ్రీనివాస్ ఐదో స్థానంలో ఉన్నాడు.
ఇక అనూహ్యంగా వెనుకబడిన సుమన్ శెట్టి ఆరో స్థానంలో ఉన్నాడు. ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఏడో ప్లేస్‌లో నిలవడంతో ఈ ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. హౌస్‌లోనూ, బయటా బలమైన మద్దతు ఉన్న సుమన్ శెట్టి సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ వారం ఎలిమినేషన్ గండం రాము రాథోడ్ మీద పడే అవకాశం ఉందని బిగ్ బాస్ అభిమాన వర్గాలు చెబుతున్నాయి.


