Friday, December 12, 2025
HomeTop StoriesBigg Boss Sohel: అట్లుంటది సొహైల్ తోటి.. కథ వేరుంటదంతే

Bigg Boss Sohel: అట్లుంటది సొహైల్ తోటి.. కథ వేరుంటదంతే

Bigg Boss Sohel: తెలుగు బిగ్ బాస్‌లో టాప్ సీజన్ ఏదంటే చాలామంది సీజన్ 4 అని ఎందుకు అంటారో ఇవాళ్టి ఎపిసోడ్ చూస్తే అర్థమైపోయింది. సీజన్ 4లో అల్లాడించిన సొహైల్.. సీజన్ 9లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చాడు. కథ వేరుంటది అంటూ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ మోడ్‌తో అసలు సిసలు ఫన్ చూపించాడు. ఇప్పటి వరకూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ అంతా ఒక లెక్క అయితే.. సొహైల్ మరో లెక్క అన్నట్టుగా.. తన మార్క్ స్టైల్.. చికెన్ మటన్ స్లోగన్స్‌తో బిగ్ బాస్ హౌస్‌ని హుషారెత్తించాడు. డీజే టిల్లూ పాటతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సొహైల్.. అందరిలా మెయిన్ డోర్‌లో కాకుండా వెనుక నుంచి వచ్చాడు స్టెప్‌లు వేసుకుంటాడు. సొహైల్ అంటే సీజన్ 4లో మటన్.. మటన్.. చికెన్.. చికెన్ అనే స్లోగన్ గుర్తొస్తుంటుంది. మనోడికి చికెన్ మటన్ అంటే ప్రాణం. ఆ సీజన్‌లో గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. మనోడి కోసం మటన్ బిర్యానీ తీసుకుని వచ్చారంటే.. ఎంత ఫేమస్‌నో అర్థం చేసుకోవచ్చు. చికెన్ మటన్ కోసం ఆ సీజన్‌లో పెద్ద యుద్ధమే చేశాడు సొహైల్.

- Advertisement -

Read Also: Bigg Boss Bharani: భరణి ఏజ్ తెలుసుకుని ఏం చేస్తారు?

ఆరు వారాల వరకు చికెన్ పెట్టలేదంట..

ఇక హౌస్‌లోకి వచ్చీ రావడంతోనే… ‘ఏంటీ మీకు ఆరు వారాల వరకూ చికెన్ పెట్టలేదంట.. నాన్ వెజ్ లేకుండా ఎలా ఉన్నారూ.. నాకు అర్థం కాదూ.. నేనైతే దూకి వెళ్లిపోయేవాడ్ని.. బిగ్ బాస్ మాట్లాడు బిగ్ బాస్.. మాట్లాడూ.. నా ఇజ్జత్ పోతుంది’ అని ఫన్ స్టార్ట్ చేశాడు సొహైల్. ఆ తరవాత బిగ్ బాస్ కెమెరాల దగ్గరకు వెళ్లి.. ‘ఇది నా ఇజ్జత్‌కే సవాల్.. మీకు దండం పెడతాను.. వీళ్లకి రెండు పాల పేకెట్లు.. చికెన్.. కాఫీ పౌడర్ పంపించండి’ అంటూ రిక్వెస్ట్ చేస్తూ.. బిగ్ బాస్‌కి ఆర్డర్ వేస్తున్నట్టుగా అందరి ముందు బిల్డప్ ఇచ్చాడు. నరాలు పొంగిపోయినట్టుగా బిల్డప్ ఇచ్చాడు కానీ.. ఇజ్జత్ పోతుంది బిగ్ బాస్ పంపించండి బిగ్ బాస్ అని తెగ బ్రతిమిలాడాడు. వాడి బాడీ లాంగ్వేజ్ ఒకటీ.. అడిగేది మరొకటి అంటూ కనిపెట్టేశాడు భరణి. ‘నీకు దండం పెడతా పంపించు.. కాళ్లు పట్టుకుంటా పంపించు’ అని సొహైల్ బిగ్ బాస్‌ని బ్రతిమిలాడటాన్ని కనిపెట్టేసిన రీతూ.. వెనుకే వచ్చి.. ‘చూసినా చూసినా అని అనడం ఏదైతే ఉందే.. ఫుల్ ఫన్ అనేట్టుగానే ఉంది. ‘సీజన్ 4 సొహైల్ గాడూ.. గుర్తింది కదా.. కథ వేరుంటది.. నా ఇజ్జత్ కాపాడుర్రి.. పంపించండి’ అని సొహైల్ అనడంతో.. బిగ్ బాస్ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు.

Read Also: Eggs: రోజుకు 2 గుడ్లు తిన్నారంటే..14 రోజుల్లో జరిగేది ఇదే

సొహైల్ గాడంటే అట్టుంటది..

చికెన్, కాఫీ పొడి, పాలపేకెట్ల బొమ్మల్ని పంపించాడు. అది తెలియక.. సొహైల్ ‘చెప్పానా.. సొహైల్ గాడంటే అట్టుంటది’ అని చెలరేగిపోయాడు. తీరా అవి బొమ్మలు అని తెలిసిన తరువాత.. ‘ఏంటి బిగ్ బాస్ ఇజ్జత్ తీసిపారేశారు’ అంటూ తెగ నవ్వించాడు సొహైల్. ఆ తరువాత.. నిజంగానే సొహైల్ అడిగినట్టుగా చికెన్, పాల పాకెట్లు, కాఫీ పౌడర్ పంపించారు. దాంతో ‘చికెన్.. చికెన్.. మటన్.. మటన్’ అంటూ సీజన్ 4లోని సొహైల్ సిగ్నేచర్ స్టెప్‌ని అందరితోనూ వేయించాడు సొహైల్. మొత్తానికి అయితే గెస్ట్‌గా వచ్చిన సొహైల్ పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైన్మెంట్‌తో హౌస్‌లో ఫుల్ ఫన్ నింపాడు. ఇక, ఈ ఎపిసోడ్ కి ఫుల్ టీఆర్పీ రావడం గ్యారెంటీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News