Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Captain: నిన్న అయేషా.. నేడు తనూజ.. హౌస్ లో ఏం జరుగుతోంది?

Bigg Boss Captain: నిన్న అయేషా.. నేడు తనూజ.. హౌస్ లో ఏం జరుగుతోంది?

Bigg Boss Captain: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 9లోకి సీజన్ 7 కంటెస్టెంట్లు అమర్ దీప్, అర్జున్ అంబటి ఎంట్రీ జరిగింది. ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేసే టాస్క్ వారు చేశారు. ఇక, ఇప్పుడు హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌ జరుగుతోంది. ఈ కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.

- Advertisement -

Read Also: Bigg Boss Elimination: అన్నా.. టాస్క్ కాదా? నిజంగానే ఎలిమినేట్ చేస్తున్నారా?

కాగా.. కెప్టెన్సీ టాస్కు కోసం క్యాప్ గేమ్ పెట్టారు. ఇందులో సర్కిల్‌లో టోపీ పెట్టారు. బజర్‌ మోగినప్పుడు టోపీని చేజిక్కించుకున్న వ్యక్తి.. కెప్టెన్సీ రేసులో లేనివాళ్లకు ఇవ్వాలి. వారు కెప్టెన్‌గా ఎవర్ని చూడొద్దనుకుంటున్నారో వారిని రేసు నుంచి తప్పించాలి. అయితే, అలా నిఖిల్‌ పోటీ పడి.. టోపిని గెలిచి గౌరవ్‌ చేతిలో పెట్టాడు. దీంతో గౌరవ్‌.. కళ్యాణ్ ను ఎలిమినేట్‌ చేశాడు. అతడ్ని కెప్టెన్ గా చూడొద్దనుకుంటున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్‌.. సంజనాకు టోపీ ఇవ్వగా ఆమె దివ్యను ఎలిమినేట్‌ చేసింది. మరోసారి టోపీ అందుకుని మాధురికి ఇవ్వగా ఆమె నిఖిల్‌ను సైడ్‌ చేసింది. అలా చివరకు ఇమ్మాన్యుయేల్‌, తనూజ మిగలగా.. ఇమ్మూ గెలిచాడు.

Read Also: Bigg Boss Promo: ఒక్కరైనా ఓకే.. తనూజతో అమర్, అర్జున్ ల డీల్ సెట్

కళ్లుతిరిగి పోయిన తనూజ

అయితే చివర్లో తనూజ కళ్లు తిరిగి పడిపోయినట్లు కనిపిస్తోంది.  నీళ్లు కొట్టి లేపినా ఆమె కళ్లు తెరవకపోయేసరికి హౌస్‌మేట్స్‌ కాస్త కంగారుపడ్డారు. అయితే అలిసిపోయి అలా పడిపోయింది తప్ప భయపడాల్సిందేమీ లేదు. మరోవైపు ఆయేషా కూడా డీహైడ్రేషన్‌కు గురైంది. దీనివల్ల టాస్కుల్లోనూ పాల్గొనలేకపోతోంది. ఆమెకు టైఫాయిడ్‌ అని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే తనను షో నుంచి పంపించేయనున్నారని రూమర్స్‌ వస్తున్నాయి. కానీ, పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇక, హౌస్‌మేట్స్‌తో కొన్ని టాస్కులాడించేందుకు లేదా, నామినేట్‌ చేయడానికి.. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు మళ్లీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రానున్నారని ఓ వార్త వైరలవుతోంది. దాదాపు నామినేట్‌ చేసేందుకే వస్తారు. అలా వచ్చినప్పుడు ఒకరిద్దరు హౌస్‌లోనే పాగా వేయనున్నట్లు టాక్‌ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముంది? ఏంటి? అన్నది తర్వాతి వారంలో తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad