Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Updates: హే ఎందుకు ఏడుస్తున్నావ్.. జనాలు చూస్తే నవ్వుతారు దరిద్రుడా

Bigg Boss Updates: హే ఎందుకు ఏడుస్తున్నావ్.. జనాలు చూస్తే నవ్వుతారు దరిద్రుడా

Bigg Boss Updates: బిగ్ బాస్ సీజన్ 9లో కట్రాజ్ కళ్యాణ్ మళ్లీ గాడి తప్పాడు. అతడి అరాచకాలు అయితే దారుణంగా ఉన్నాయి. సైనికుడు.. సేవకుడు.. జవాన్ అంటూ బయటేమో అతని పీఆర్ టీం జిమ్మిక్కులు చేస్తుంటే.. లోపల హౌస్‌లో మాత్రం.. ఆడంగిలా ఎక్కెక్కి ఏడ్చేస్తున్నాడు కళ్యాణ్. ఎందుకయ్యా అంటే.. తనూజ కళ్లు తిరిగిపోయినందుకు. ఇక, నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

ఎమోషనల్ అయిన తనూజ

చివరి వరకూ రేస్‌లో ఉన్న తనూజకి కెప్టెన్సీ చేజారిపోవడంతో.. బాగా ఎమోషనల్ అయ్యింది. అయితే, కెప్టెన్సీ బాడ్జ్‌ని తనూజతో పెట్టించుకోవాలని ఉందంటూ.. ఆమె చేతులతోనే కెప్టెన్సీ బ్యాడ్జ్ ధరించి.. ఇంటికి రెండోసారి కెప్టెన్ అయ్యాడు ఇమ్మానుయేల్. అయితే చివరి వరకూ పోరాడి ఓడిపోవడంతో కుమిలి కుమిలి ఏడ్చింది తనూజ. అయితే సడెన్‌గా ఆమెకి ఏమైందో ఏమో కానీ.. డాక్టర్ డాక్టర్ అంటూ కుప్పకూలిపోయింది. సృహతప్పి పడిపోయింది తనూజ. వెంటనే ఆమెను మెడికల్ రూంకి తరలించారు.

Read Also: Bigg Boss Wild Cards: అదిదా ట్విస్ట్ అంటే.. బిగ్ బాస్‌లోకి శ్రీజతో పాటు అతడి ఎంట్రీకి రంగం సిద్ధం

జవాన్ బాబు ఓవరాక్షన్

అయితే తనూజ కళ్లు తిరిగిపడిపోవడంతో.. ఇక్కడ మన జవాన్ బాబు కళ్యాణ్ ఒక వైపు.. ఇమ్మానుయేల్ మరోవైపు తెగ ఏడ్చేశారు. కళ్యాణ్ అయితే ఏదో తనూజకు ఏదో అయిపోయినట్లుగానే వెక్కి వెక్కి ఏడ్చాడు. కళ్యాణ్ ఏడుస్తుంటే.. పచ్చళ్ల పాప రమ్య వచ్చి.. ఏడొద్దూ.. తను బాగానే ఉందీ.. ఏం కాదు అని తెగ ఓదార్చడం మాత్ర కామెడీ. అక్కడ తనూజ.. సృహలోకి వచ్చి లేచి కూర్చొన్నా.. మన సైనికుడు కళ్యాణ్ మాత్రం ఏడుపు ఆపలేదు. అతను ఏడుస్తుంటే.. ఇమ్మానుయేల్ వచ్చి ఓదార్చాడు. అప్పుడు ఇంకా ఎక్కెక్కి పడి ఏడ్చేశాడు కళ్యాణ్. అది చూసి మాధురికి చిరాకు దొబ్బి.. ‘హే.. నువ్వెందుకు ఏడుస్తున్నావ్.. జనాలు చూస్తే నవ్వుతారు’ అంటూ డైలాగ్ వేసింది. అయితే, సరిగ్గా జనాలు ఏదైతే చేస్తున్నారో.. అదే ఎక్స్ పెక్ట్ చేసి డైలాగ్ కొట్టిడం హైలెట్. తను వీక్ నెస్‌తో కళ్లు తిరిగిపడితే.. నువ్వెందుకు ఏడుస్తున్నావ్? ఛీ ఛీ అని గడ్డిపెట్టింది మాధురి.

Read Also: Emmanuel: అప్పుడు సంజన కోసం త్యాగం.. ఇప్పుడు తనూజతో పోటీ

మరోసారి ఎమోషనల్

ఇక మెడికల్ రూం నుంచి తిరిగి వచ్చిన తరువాత తనూజ.. ఫీవర్ వచ్చినా.. హెల్త్ బాలేకపోయినా ఎందుకు ఆడానంటే కెప్టెన్ అవ్వాలని ప్రతిసారి ఇదే అవుతుంది అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక మన కాట్రాజ్ కళ్యాణ్.. అర్ధరాత్రి అయిన తరువాత.. తనూజ దగ్గరకు వెళ్లి.. పక్కనే కూర్చుని మొదలెట్టాడు రుద్దడం. అసలు వీడేంటో.. వీడు వాలకం ఏంటో.. అసలు వీడు ఎందుకు హౌస్‌లోకి వచ్చాడో ఏమో కానీ.. ‘ఎందుకు ఏడ్చావ్? అని తనూజ అడిగితే.. ‘ఓడిపోయినందుకు ఏడ్చాను’ అని అన్నాడు. ఇప్పుడు తనూజ ఎందుకు ఏడ్చావ్ అని అడిగితే.. ఓడిపోయినందుకు ఏడ్చాను అని అన్నాడు. వాడు ఎందుకు ఏడ్చాడో.. వాడి ఏడుపు ఏంటో తనూజకి తెలిసినంతగా హౌస్‌లో వాళ్లకి తెలియదు. కళ్యాణ్ గాడి కక్కుర్తి గురించి తెలిసి కూడా.. ‘నిజం చెప్పు ఎందుకు ఏడ్చావ్’ అని రెచ్చగొట్టేట్టుగా అడిగింది తనూజ. అది నేను చెప్పలేనే.. సర్లే బొజ్జో.. నేను సేవ్ అయితే నీకొకటి చెప్తా’ అంటూ తనూజ నిద్రపోతున్నా ఆమె దగ్గరే కూర్చుని ఆమె చేతుల్ని పిసుకుతూ ఆమె వైపు చూస్తూనే ఉన్నాడు. ఇక, ఇప్పుడు ఈ లొల్లితో అటు తనూజ ఆట పాయే.. ఇటు కళ్యాణ్ మారిపోయే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad