Bigg boss elimination: బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నుంచి తొలి వారం కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. కాగా, దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ శనివారం (సెప్టెంబర్ 13) జరిగింది. బిగ్ బాస్ 9 తెలుగు ఆదివారం ఎపిసోడ్‌లో శ్రేష్టి వర్మ ఎలిమినేషన్ ప్రసారం కానుంది. అయితే, శ్రేష్టి వర్మ రెమ్యునరేషన్ ఎంత అనే వివరాలు తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ మొదటి వారం సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయిపోయింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ 9 తెలుగులోకి కంటెస్టెంట్స్‌గా మొత్తం 15 మంది అడుగుపెట్టారు. వారిలో కామనర్స్‌గా మనీష్, హరీష్, శ్రీజ దమ్ము, ప్రియా, సోల్జర్ కల్యాణ్, డీమోన్ పవన్ ఆరుగురు అగ్ని పరీక్ష ద్వారా ఎంటర్ అయ్యారు. సెలబ్రిటీ కేటగిరిలో. ఇక సెలబ్రిటీ కేటగిరిలో రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, తనూజ గౌడ, శ్రేష్టి వర్మ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి తొమ్మిది మంది కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. ఇక వీరికి మొదటి వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్ నిర్వహించారు. ఫస్ట్ వీక్ నామినేషన్స్. బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో రాము రాథోడ్, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయెల్, తనూజ గౌడ, సుమన్ శెట్టి, సంజన, ఫ్లోరా సైని, శ్రేష్టి వర్మ, డిమోన్ పవన్ 9 మంది ఉన్నారు. వీరికి నామినేషన్స్ తర్వాత నుంచి ఓటింగ్ నిర్వహించారు.
Read Also: Bigg Boss Saturday Episode: గుండు అంకుల్ బాడీ షేమింగా? రెడ్ ఫ్లవర్ కాదా? వీకడెక్కడ దొరికాడ్రా బాబు
లీస్ట్ లో ఇద్దరు అంటూ వార్తలు
బిగ్ బాస్ తెలుగు 9 మొదటి వారం ఓటింగ్‌లో తొలి రోజు నుంచి డేంజర్ జోన్‌లో ఇద్దరు ఉంటూ వచ్చారు. అందులో శ్రేష్టి వర్మ, ఫ్లోరా షైనీ ఉన్నారు. అయితే, వీరిలో అతి తక్కువ ఓటింగ్‌తో చివరిగా శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయింది. దీనికి సంబంధించిన బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ షూటింగ్ శనివారం (సెప్టెంబర్ 13) నాడే జరిగిపోయింది. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం ఎలిమినేషన్‌ను ఇవాళ (సెప్టెంబర్ 14) రాత్రి ప్రసారం చేయనున్నారు.బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మొదటి వారమే కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో శ్రేష్టి వర్మ బిగ్ బాస్ రెమ్యునరేషన్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
Read Also: London protest: బ్రిటన్ లో భారీ యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ.. రోడ్లపైకి వచ్చిన లక్షల మంది
శ్రేష్టి వర్మ రెమ్యునరేషన్
అయితే, బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో పాల్గొన్నందుకు శ్రేష్టి వర్మ రోజుకు సుమారు రూ. 28,571 పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా వారం రోజుల్లో రూ.2 లక్షల వరకు సంపాదించినట్లు సమాచారం. ఇలా, వారం రోజులు బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో ఉన్న శ్రేష్టి వర్మ దాదాపుగా రూ. 2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా శ్రేష్టి వర్మ కేవలం రూ. 2 లక్షలు సంపాదించిందని అర్థం చేసుకోవచ్చు. ఇది ఇతర కంటెస్టెంట్ల రెమ్యునరేషన్‌తో పోలిస్తే తక్కువ అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ప్రముఖ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో శ్రేష్టి వర్మ కాంట్రవర్సీ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ శ్రేష్టి వర్మ అప్పట్లో వార్తల్లో హైలెట్ అయింది. అయితే, ఆ కాంట్రవర్సిటీ వల్లే ఆమెకు బిగ్ బాస్ 9 అవకాశం వచ్చింది. కానీ, బిగ్ బాస్ తెలుగు ద్వారా మాత్రం శ్రేష్టి వర్మకు అంత గుర్తింపు దక్కలేదనే చెప్పుకోవచ్చు.


