Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా.. డేంజర్ జోన్ లో ఎవరున్నారో తెలుసా?

Bigg Boss: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా.. డేంజర్ జోన్ లో ఎవరున్నారో తెలుసా?

Bigg Boss: బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో వైల్డ్ కార్డులు మరీ వైల్డ్ గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్లు వచ్చినప్పట్నుంచి ఆట రసవత్తరంగా మారింది. ఇక, ఈ వారం కెప్టెన్సీ రేసు హోరాహోరీగా సాగుతోంది. వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన ఫైర్ స్టార్మ్, పాత కంటెస్టెంట్ల మధ్య పోరు రసవత్తరంగా మారింది. వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన హౌస్ మేట్స్ అటాకింగ్ గేమ్ తో హడలెత్తిస్తున్నారు. ఈ వారం కెప్టెన్సీ రేసు నుంచి ఒక్కొక్క పాత హౌస్ మేట్ ను తీసేస్తున్నారు.

- Advertisement -

Read Also: Bigg Boss Thanuja: బిగ్‌బాస్ తనూజ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పది నెలల తర్వాత ఓటీటీలోకి..

ఉత్కంఠభరితంగా..

బిగ్ బాస్ 9 తెలుగులో ఆరో వారం కెప్టెన్సీ రేసు ఉత్కంఠభరితంగా మారింది. వైల్డ్ కార్డ్స్, పాత హౌస్ మేట్స్ మధ్య పోరు పెట్టాడు బిగ్ బాస్. ఫస్ట్ హ్యాండ్ బాల్ లాంటి పోటీ పెట్టాడు. ఇందులో వైల్డ్ కార్డ్స్ ఒక టీమ్, మిగతా వాళ్లు మరో టీమ్. అయితే, ఈ టీమ్స్ అవతలి వాళ్ల గోల్ పోస్టులో బాల్ వేయాలి. ఇక గేమ్ స్టార్ట్ కాగానే వైల్డ్ కార్డ్స్ విరుచుకుపడుతున్నారు. ఫస్ట్ గోల్ చేసి భరణిని ఎలిమినేట్ చేశారు. సెకండ్ గోల్ విషయంలో పుష్ చేశారంటూ తనూజ విపరీతంగా గొడవ చేసింది.

డేంజర్ జోన్ లో ఫోక్ సింగర్

ఇక మరోవైపు బిగ్ బాస్ 9 తెలుగు ఆరో వారం ఓటింగ్ చూసుకుంటే ఫోక్ సింగర్ రాము రాథోడ్ డేంజర్ జోన్లో ఉన్నాడు. అతను ఎలిమినేషన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. హౌస్ లో తన పర్ఫార్మెన్స్ తగినంతగా లేకపోవడంతో ఆడియన్స్ కుడా ఓట్ వేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్ ప్రకారం చూస్తే రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లడం కన్ఫామ్ గా కనిపిస్తోంది. లేటెస్ట్ ఓటింగ్ అప్ డేట్ ప్రకారం తనూజ టాప్ లో కొనసాగుతోంది. ఆమెకు 30.85 శాతం ఓటింగ్ తో ఫస్ట్ ప్లేస్ దక్కింది. ఇక సుమన్ శెట్టి 23.99 శాతం ఓటింగ్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. నామినేషన్స్ లో ఉన్న వాళ్లలో దివ్య నిఖిత 12.15 శాతం ఓటింగ్ తో మూడో స్థానంలో, భరణి 11.41 శాతం ఓటింగ్ తో నాలుగో స్థానంలో, డీమాన్ పవన్ 11.35 శాతం ఓటింగ్ తో అయిదో స్థానంలో ఉన్నాడు. రాము రాథోడ్ 10.25 శాతం ఓటింగ్ తో లాస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. భరణి, పవన్, రాముకు మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు. మరి ఓటింగ్ ముగిసే సరికి ఎవరు లీస్ట్ లో ఉంటారో తెలియాల్సి ఉంది.

Read Also: Deepshikha Nagpal: కెమెరా ముందు దుస్తులు తీసేసావా?.. నా కూతురు సీడీని విరిచేసింది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad