Bigg Boss: బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో పోరు రసవత్తరంగా మారింది. ఎనిమిదో వారం అయినప్పటికీ సీజన్ విజేత ఎవరు అంటూ నెట్టింట చర్చలు స్టార్ట్ అయ్యాయి. అయితే, బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఇప్పటివరకు లేడీ కంటెండర్ ఎవరూ విన్నర్ కాలేదు. అయితే, ముద్దమందారం బ్యూటీ తనూజ ట్రోఫీ అందుకుంటుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. అంతేకాకుండా, నామినేషన్స్ లో ఉంటే ఓటింగ్ లో ఎప్పుడూ ఆమెనే టాప్ లో నిలుస్తుంది. ప్రస్తుతానికి పలు ఓటింగ్ వేదికలలో తనే టాప్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవారిలో తనూజ బెటర్ అంటూ చాలామంది బిగ్‌బాస్ ఫాలోవర్స్ చెప్పడం విశేషం. ఎమోషన్స్, టాస్కులు, ఎక్స్‌ప్రెషన్స్, ఇతరులతో కన్విన్సింగ్‌గా మాట్లాడటం వంటి అంశాల్లో ఆమె తనదైన ముద్ర వేస్తుందని చెబుతున్నారు.
ఇదే సమయంలో ఆమె ఆట తీరు నచ్చని వారి నుంచి నెగెటివ్ కూడా సోషల్‌మీడియాలో కొనసాగుతుంది. ఇలా రెండు కోణాల్లో తనూజ విన్నింగ్‌పై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఏకంగా బిగ్‌బాస్ టీమ్ కూడా ఆమె పట్ల సానుకూలంగా ఉన్నారంటూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే, ఈ కామెంట్లు ప్రతి సీజన్‌లో వస్తూనే ఉంటాయి. విన్నింగ్ రేసులో ఉన్న వారితో పాటు బిగ్‌బాస్ టీమ్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రతిసారి జరుగుతుంది.
Few Yashmi fans supporting thanuja in this season be like
“Antharya Yudham” 🤣🤣🤣
You know whom am refering to 🤣🤣 #BiggBossTelugu9 pic.twitter.com/9MPbTPg4XI
— Maga Maha Raj (@maga_rah) October 30, 2025
ట్రోలింగ్
ఇక ఇప్పుడు, తనూజపై పాత కంటెస్టెంట్స్ ట్రోలింగ్‌కు దిగారు. ఒక వీడియోను తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్ యష్మి గౌడ, సీజన్-6లో పాల్గొన్న శ్రీ సత్య స్విమ్మింగ్ ఫూల్‌లో ఉంటూ తనూజపై పరోక్షంగా ట్రోలింగ్‌కు దిగారు. వారిద్దరూ తనూజను టార్గెట్ చేస్తున్నారని రెగ్యూలర్‌గా బిగ్‌బాస్ చూసే వాళ్లకు ఈజీగా అర్థం అవుతుందని చెప్పవచ్చు. లాస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా మర్యాద మనీష్ హౌస్‌లోకి వచ్చాడు.. అయితే, ఆ సమయంలో కల్యాణ్‌ను నామినేట్ చేసి హెచ్చరిస్తాడు.
Read Also: Bigg Boss Captain: ప్చ్.. పాపం తనూజ.. ఈసారి కూడా.. కెప్టెన్సీ టాస్క్ లో ఓటమి
‘ముద్దుగా మాటలు చెప్పి మందార పూలు పెడుతున్నారు’ అంటూ పరోక్షంగా తనూజతో జాగ్రత్త అనేలా హింట్ ఇస్తాడు. ఇప్పుడు ఇదే పాయింట్‌తో యష్మి గౌడ ఇలా ట్రోలింగ్ మొదలు పెట్టింది. ‘అరేయ్.. ఏంట్రా నువ్వు ముద్దు మాటలు చెప్పి చెవిలో మందారం పువ్వులు పెడుతున్నావ్.. నాకు దెబ్బలు తగిలాయి ఫ్రెండ్స్.. ఇదీ (శ్రీ సత్య) ముద్దు ముద్దు మాటలు చెప్పి నా చెవిలో మందార పువ్వులు పెడుతుంది.’ అంటూ ఇద్దరూ కలిసి ఒక వీడియో క్రియేట్ చేసి వదిలారు. గతంలో కూడా తనూజపై యష్మి పరోక్షంగా తనూజపై పోస్టులు పెట్టింది. కేవలం పీఆర్ టీమ్ వల్లే తన ఆట కొనసాగుతుంది అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది. మళ్లీ ఇప్పుడు ఇలా ఏకంగా వీడియో షేర్ చేసింది.
Read Also: Women’s World Cup: ఆట బాలేదు.. పక్కన పెట్టేస్తున్నా.. కానీ ఈ రియాక్షన్ అస్సలు ఊహించలేదేమో!


